ప్రస్తుతం కాలంలో ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతున్నాయో అర్థం కావడం లేదు. నడుస్తూ నడుస్తూ ప్రాణాలు కోల్పోయిన వారు, మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారు ఈమధ్య ఎక్కువైపోయారు. పనులు చేసుకుంటూ కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇండోర్ లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.
మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాకు చెందిన రాజా(18) అనే విద్యార్థి ఉన్నత చదువులు కోసం ఇండోర్ లో ఉంటున్నాడు. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం భవర్ కువా లోని ఒక కోచింగ్ సెంటర్ లో ప్రిపేర్ అవుతున్నాడు. ప్రతిరోజు లానే క్లాస్ రూంలో కూర్చుని పాఠాలు వింటుండగా ఒక్కసారిగా అస్వస్థతకు లోనై కుప్పకూలిపోయాడు.
పక్కనున్న విద్యార్థులు గమనించి రాజని పైకి లేపి కూర్చోబెట్టారు.అప్పటికే ఆపస్మారక స్థితికి చేరుకున్న అతడిని కోచింగ్ సెంటర్ సిబ్బంది హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు హాస్పటల్ వద్దకు చేరుకున్నారు. కోచింగ్ సెంటర్ సిబ్బంది తమకు పూర్తిస్థాయి సిసి ఫుటేజ్ ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కి తరలించారు.
watch video :
कितना खतरनाक है यह सब देखना इंदौर में 18 साल का लड़का पीएससी की तैयारी कर रहा था कोचिंग सेंटर में ही हार्ट अटैक आ गया शिक्षक कह रहे हैं पढ़ाई में भी अच्छा था कोई तनाव नहीं था अस्पताल ले गए शाम को उसकी मौत हो गई pic.twitter.com/ia7Uvut7rS
— Anurag Dwary (@Anurag_Dwary) January 18, 2024