పెళ్లి అనే ఒక బంధం కొందరి జీవితాలను స్వర్గమయం చేస్తే మరికొందరి జీవితాలను నరకంలోకి తోసేస్తుంది. అలాంటి ఘటన ఒకటి బెంగళూరులో వెలుగు చూసింది. 12 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్న ఒక భార్య కన్నీటి కథ. మైసూర్ కి చెందిన ఒక వ్యక్తి కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు పెళ్లి జరిగినప్పటి నుంచి ఆమెని ఎవరితో కలవనీయకుండా ఇంట్లో ఉంచి తాళం వేసుకొని బయటికి వెళ్లేవాడు.
అంతటితో ఊరుకోకుండా చిత్రహింసలకు గురి చేసేవాడు. అడిగే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో అతని హింస 12 ఏళ్ల పాటు కొనసాగింది. అయితే చుట్టుపక్కల వాళ్ళు జరుగుతున్న దారుణాన్ని గ్రహించి పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మహిళలను బయటకు తీసుకువచ్చి జరిగిన విషయం గురించి తెలుసుకొని నివ్వెర పోయారు.

తన భర్త ఏ పని మీద బయటకు వెళ్ళినా ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్లేవాడని, పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడనివ్వకుండా పదేపదే కొట్టేవాడని చెప్పింది. తన పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చినా తన భర్త ఇంటికి వచ్చి తాళం తీసే వరకు పిల్లలు బయటన వెయిట్ చేయవలసిందే. పిల్లలకి కిటికీలోంచి ఆహారాన్ని అందించేది ఆ తల్లి. మలమూత్ర విసర్జన కోసం ఒక బాక్స్ ఉపయోగించే దానినని, తనని ఇంట్లోనే బంధించి ఇంటిని జైలుగా మార్చాడని పేర్కొంది.
గత 12 ఏళ్లుగా మానసికక్షోభకు గురి చేసాడని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు ఆ శాడిస్ట్ భర్తకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఆ భార్య భర్త పై ఫిర్యాదు చేయటానికి నిరాకరించింది. ఇకపై అతనితో ఉండకుండా పుట్టింట్లో ఉంటానని తెలిపింది. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే ఆ శా-డిస్ట్ భర్తకి ఇంతకుముందే రెండు పెళ్లిళ్లు అయ్యాయి, ఇతని వేధింపులు తాళలేక వాళ్ళిద్దరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఈమె మూడవ భార్య కాగా వీరికి ఇద్దరు పిల్లలు.

బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, దేశంలో డిజిటల్ పేమెంట్ యాప్స్ లో పేటీఎమ్ కూడా ఒకటి. డిజిటల్ పేమెంట్ మార్కెట్ లో పేటీఎమ్ వాటా 16 నుండి 17 శాతం ఉంటుంది. బుధవారం నాడు రిజర్వ్ బ్యాంక్ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకు పై ఆంక్షలు విధిస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. పేటీఎం ఆడిట్ రిపోర్ట్ తో పాటు ఇతర బాహ్య ఆడిటర్ల రిపోర్ట్స్ ప్రకారం, తరచుగా పేటీఎం రూల్స్ ని ఉల్లంఘించినట్లుగా తేలింది. అందువల్ల బ్యాంకుల నియంత్రణ చట్టంలో ఉన్న ’35ఏ’ రూల్ ప్రకారంగా, ఫిబ్రవరి 29 అనంతరం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో లావాదేవీలు, వ్యాలెట్, క్రెడిట్ డిపాజిట్, ఫాస్టాగ్ టాప్అప్లు ఆపేస్తున్నాము.
కస్టమర్ల బ్యాలెన్స్ ఉపసంహరించుకోవడానికి, ఉపఎగిన్చుకోవడానికి పూర్తిగా పేటీఎం సహకరించాలి. అందుకు తగిన సౌకర్యాలు కల్పించాలి. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఫాస్టాగ్‌లలో ఉన్న డబ్బును విత్‌డ్రా, లేదా వాడుకోవడానికి కస్టమర్ల పై ఎటువంటి ఆంక్షలు ఉండవు’’ అంటూ ఆర్బిఐ ప్రకటనలో వెల్లడించింది. అందువల్ల ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు దానిని వినియోగించలేరు. మార్చి 15 లోగా నోడల్ అకౌంట్‌ను కూడా సెటిల్ చేయాలని ఆర్బీఐ పేటీఎంను కోరింది.





ఫుడ్ కు ఫేమస్ అయిన హైదరాబాద్ లో ఇటీవల కాలంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ లు బాగా పెరిగిపోయాయి. ఆ ఫుడ్ కి రోజు రోజుకి అభిమానులు పెరిగిపోటున్నారు. రోడ్డు పక్కన మంచి రుచికరమైన ఫుడ్ దొరకడం, అది కూడా చాలా తక్కువ ధరకు లభిస్తుండడంతో వాటి దగ్గరకి జనాలు క్యూ కడుతున్నారు. ఇందుకు ఉదాహరణగా కుమారి ఆంటీ పేరు చెప్పుకోవచ్చు. ఆమె ఫుడ్ బిజినెస్ తో చాలా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఏక్కడ చూసిన ఆమె గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. అయితే అదే ప్రాంతంలో అనురాధ ఆంటీ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు.
ఆమె స్టాల్ లో టేస్టీ దాల్ రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, జీరా రైస్, టమాటా రైస్, పెరుగన్నం అందుబాటులో ఉన్నాయి. ఇక నాన్ వెజ్ లో మటన్, చికెన్, లివర్, ఫిష్, తలకాయ, ఫ్రాన్స్ వంటి కర్రీస్ ఉంటాయి. వెజ్ ప్లేట్‌కు 80 రూపాయలు కాగా, రైస్ అన్లిమిటెడ్ గా ఉంది. చికెన్ కర్రీ రూ.120 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్ ),చికెన్ ఫ్రై రూ.150 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్), మటన్ కర్రీ –రూ.200 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్), లివర్ కర్రీతో రైస్ 150 రూపాయలు, ప్రాన్స్ కర్రీతో రైస్ 150 రూపాయలు, ఫిష్ కర్రీతో రైస్ 150 రూపాయలు,కాగా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటితో కలిపి తీసుకుంటే 450 రూపాయలు.
ఆమె వద్ద రోజుకు మూడు వందల మంది దాకా ఫుడ్ తింటారు. ఆ లెక్కన ఒక్కోక్కరికి యావరేజ్ గా రూ. 100 చొప్పున రోజుకు 30000 వస్తుంది. ఖర్చులన్ని పోగా 10 వేల రూపాయల వరకు మిగిలే ఛాన్స్ ఉంది. ఈ విధంగా చూస్తే నెలకు మూడు లక్షల దాకా ఆమెకు లాభం వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. తక్కువ ధరకు వందల మందికి ఆహారం అందిస్తున్న ఇలాంటి మహిళలను అందరు మెచ్చుకుంటున్నారు.





అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవం ఎంతో దివ్యంగా, అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్యలో దశాబ్దాల తర్వాత బాబ్రీ మసీదు వివాదం ముగిసి, సుప్రీం కోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణం జరిగింది. 500 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవంతో భక్తుల చిరకాల కోరిక నెరవేరింది. రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవంలో ముస్లింలు కూడా పాల్గొనడం ఆమోదించలేని పాకిస్థాన్, రామ మందిరం పై ఫిర్యాదు చేస్తూ ఐక్యరాజ్యసమితికి అధికారికంగా లేఖ రాసింది.
భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో ఎప్పుడూ అలసిపోని పాక్ నాయకులలో మునీర్ అక్రమ్ ఒకరు. పాకిస్తాన్ రాయబారి ఉన్న మునీర్ అక్రమ్ రామ మందిరం పై ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. అందులో
ఈ ధోరణి భారతీయ ముస్లింల సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ శ్రేయస్సుతో పాటు ఈ ప్రాంతంలో సామరస్యం మరియు శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. భారతదేశంలోని ఇస్లామిక్ వారసత్వ ప్రదేశాల రక్షణ కోసం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాబ్రీ మసీదు లాగే భారతదేశంలోని ఇతర మసీదులు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదుతో సహా ఇతర మసీదులు ఎన్నో అవమానాలు మరియు విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నాయని పాకిస్థాన్ లేఖలో వెల్లడించింది.