ఇక నుండి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు..!

ఇక నుండి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు..!

by Mohana Priya

Ads

సినీ ప్రముఖులకు ప్రతి సంవత్సరం సినిమాలో వివిధ రంగాల్లో వారు చేసిన కృషికి నంది అవార్డు ఇస్తారు. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు ఈ అవార్డులు గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు ఈ అవార్డుల స్థానంలో మరొక అవార్డులు ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Video Advertisement

నంది అవార్డులు అనే అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గద్దర్ గారి పేరు మీద ఎంతో మంది సినీ రంగానికి చెందిన వారికి పురస్కారాలు అందజేస్తాము అని తెలిపారు. ఇటీవల హైదరాబాద్ లో ఉన్న రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ గారి జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

అప్పుడు ఆయన మాట్లాడుతూ, “ఇక నుండి నండి అవార్డుల ప్లేస్ లో గద్దర్ అవార్డులు ఇస్తాము” అని చెప్పారు. అంతే కాకుండా, “గద్దర్ పేరుతో ఒక జిల్లా, ట్యాంక్ బండ్ మీద గద్దర్ గారి విగ్రహం కూడా పెట్టాలి అనే విజ్ఞప్తిని క్యాబినెట్ లో చేర్చుతాము” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమాజం కోసం గద్దర్ తన జీవితాన్నే త్యాగం చేశారు. బడుగు, బలహీనవర్గాల న్యాయం కోసం పోరాడారు. వారికి మంచి జరగాలి అని కోరుకున్న వారిలో గద్దర్ కూడా ఒకరు. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దర్ చాలా ముఖ్య పాత్ర పోషించారు.

తన ఆటపాటలతో తెలంగాణ ప్రజలలో చైతన్యం నింపారు గద్దర్. అందుకే గద్దర్ పేరు మీద అవార్డులు ఇస్తాము అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయం మీద జీవో జారీ చేస్తాము అని చెప్పారు. అంతే కాకుండా ఇదే తన శాసనం అని, తన మాటే జీవో అని రేవంత్ రెడ్డి అన్నారు. గద్దర్ గారి పేరు మీద అవార్డు ప్రకటించిన తర్వాత ఉపముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డిని కౌగిలించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కమ్యూనిస్ట్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని అభినందించారు.

ALSO READ : కుమారి ఆంటీ తర్వాత ఫుడ్ బిజినెస్ లో ఫేమస్ అయిన మరొక ఆవిడ ఎవరో తెలుసా..? ఇక్కడ ఒక ప్లేట్ ధర ఎంతంటే..?


End of Article

You may also like