ఐసోలేషన్ వార్డులో ఉక్కబోతగా ఉన్నదని సాకెట్ లోనుండి వెంటిలేటర్ ప్లగ్ తీసి ఎయిర్ కూలర్ ప్లగ్ పెట్టాడో వ్యక్తి.. రాజస్థాన్ లోని కోటాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో కరోనా పేషెంట్ ఒకరు మరణించారు.. జూన్ 13న కరోనా లక్షణాలు ఉన్నాయని 40ఏళ్ల వ్యక్తిని కోటా గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు.. టెస్టులు చేయగా పాజిటివ్ రావడంతో ఐసొలేషన్ వార్డ్ కి తరలించారు..
ఐసోలేషన్ వార్డులో ఉక్కబోతగా ఉందని అనడంతో అతని కుటుంబసభ్యులు కూలర్ తీసుకుని వచ్చారు.. కూలర్ ప్లగ్ పెట్టడానికి సాకెట్ ఎక్కడా ఖాళీ కనిపించకపోవడంతో , బెడ్ పక్కనే ఉన్న సాకెట్ లో ప్లగ్ తీసి కూలర్ ప్లగ్ పెట్టారు..అరగంట తర్వాత ఆ వ్యక్తి ఊపిరాడక మరణించాడు..కూలర్ ప్లగ్ పెట్టడానికి వెంటిలేటర్ ప్లగ్ తీసేయడంతో సదరు వ్యక్తి ఊపిరాడక మరణించాడు..
ఈ వ్యహారంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.నీవీన్ సక్సేనా ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. ఐసోలేషన్ వార్డులోని వైద్య సిబ్బంది కరోనా బాధితుడి మరణానికి సంబంధించిన సమాచారాన్ని కమిటీకి అందివ్వగా, అతని కుటుంబ సభ్యులు మాత్రం కమిటీ విచారణకు నిరాకరిస్తున్నారు. అయితే ఈ సంఘటనకు సంభందించిన పూర్తి నివేధికను కమిటి ఇవ్వనుంది..
ఐసోలేషన్ వార్డులో కూలర్ ప్లగ్ పెట్టుకోవడానికి తమ అనుమతి తీసుకోలేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు..ఒక హాస్పిటల్ లోకి కూలర్ తీసుకొచ్చినా కనపడకపోవడానికి అదేం చిన్న వస్తువు కాదుకదా, ఐసోలేషన్ వార్డులోకి ప్రత్యేక అనుమతి ద్వారానే కుటుంబ సభ్యులని ,బంధువులని పంపుతున్నప్పుడు,కొన్ని సార్లు ఎవరికి అనుమతి లేనప్పడు ఇంత పెద్ద సంఘటన జరిగేవరకు హాస్పిటల్ సిబ్బందికి తెలియకపోవడం వింతగా ఉంది అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు..