హైదరాబాదులోని నాంపల్లి బజార్ ఘాట్ లో సోమవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
బాజార్ ఘాట్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో మంటలు చెల్లారేగడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ లో 15 కుటుంబాలు నివసిస్తున్నాయి. భవనం కింది భాగంలో గ్యారేజ్ ను నిర్వహిస్తున్నారు.
అందులో కెమికల్స్, డీజిల్ ఆయిల్స్, వాహనాలు ఉపయోగించే ఆయిల్స్ నిలువ చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి క్షణాల వ్యవధిలో బిల్డింగ్ అంతా మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు అందులో నివాసం ఉంటున్న వారిని అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.

అయితే ఆ సమయంలో నిద్ర పోతున్నవారు మంటలో చిక్కుకుని పొగ కారణంగా మృతి చెందారు. ఈ ఘటనలో ఆరు ద్విచక్ర వాహనాలు ఒక కారు కూడా తగలబడిపోయాయి. ఉదయం 9:30 కి ఘటన జరగగా స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఐదు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.ముందుగా బిల్డింగ్ లో టపాకాయలు కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు అనుకున్నారు. కానీ మంటలు వేగంగా వ్యాపించడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ఫైర్ సిబ్బంది తెలియజేశారు. లేడర్లు సహాయంతో 16 మందిని కాపాడారు. మరో ఏడుగురు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.చనిపోయిన 9 మంది మృతదేహాలను మార్చురీకి తరలించారు.
watch video:
https://youtu.be/6e_qLDJKVjk
వాహనాల ఆయిల్ అక్రమంగా నిలవ ఉంచిన కారణంగానే ప్రమాదం జరిగిందని, భవన యజమానిని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దట్టమైన పొగ కారణంగా బయటికి చాలామంది రాలేకపోయారని అన్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణనష్టం తగ్గిందని తెలియజేశారు.భవన యజమాని రమేష్ జైస్వాల్ రసాయన పరిశ్రమను నిర్వహిస్తున్నారు. వివిధ రకాల రసాయనాలను భవన సెల్లార్ లో నిలివవుంచిన కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.



చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఆయన 1942లో కృష్ణాజిల్లాలోని పమిడిముక్కలలో మే 23న జన్మించారు. 1966లో రంగులరాట్నం అనే సినిమాతో చంద్రమోహన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తొలి సినిమాతోనే నంది అవార్డ్ ను అందుకున్నారు. కెరీర్ మొదట్లో హీరోగా నటించిన చంద్రమోహన్, 175 పైగా సినిమాలలో హీరోగా చేశారు. ఆ తరువాత ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించిన ఆయన మొత్తం 932 చిత్రాలలో నటించాడు.
సెకండ్ హీరోగా, హీరోగా, కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా వైవిధ్యమైన క్యారెక్టర్లలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కామెడీ పాత్రల ద్వారా ఆయన తెలుగు ఆడియెన్స్ మనసులో చెరిగిపోని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్స్ కి చంద్రమోహన్‌ను లక్కీ హీరోగా చెబుతారు. ఆయన పక్కన నటించిన హీరోయిన్స్ ఆ తరువాతి కాలంలో టాప్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీని ఏలారు. వారిలో జయప్రద, జయసుధ, శ్రీదేవి, సుహాసిని, విజయశాంతి వరకు చాలా మంది ఉన్నారు. వారంతా కెరీర్ తొలినాళ్లలో చంద్రమోహన్ తో నటించినవారే.
చంద్రమోహన్ కెరీర్ లో ఆయన నటనకు గానూ 2 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. ఆయన భార్య పేరు జలంధర. మంచి రచయిత్రి. పలు కథా సంకలనాలను రాశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, మధుర మీనాక్షీ అమెరికాలో స్థిరపడింది. రెండవ కుమార్తె మాధవి డాక్టర్ చెన్నైలో స్థిరపడింది.
విషయం తెలియగానే ఇంటికి వచ్చిన బాలిక కుటుంబసభ్యులు రూమ్ బయట వైపు తాళం వేశారు. ఆ తరువాత కొందర్ని పిలిచి ఆ యువకుడి పై దాడి చేశారు. దారుణంగా కొట్టి, దాదాపు 3 గంటల పాటు అతన్ని చిత్ర-హిం-స-ల-కు గురి చేసి, కుమార్తెకు జోలికి మళ్ళీ రావద్దని వార్నింగ్ ఇచ్చి, విడిచిపెట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు తన ఇంటికి వెళ్ళి, కిందపడి అపస్మారక స్థితికి వెళ్లాడు.
కరణ్ కుటుంబసభ్యులు అతన్ని వెంటనే ఘట్కేసర్ గవర్నమెంట్ హాస్పటల్ కి తరలించారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు, అప్పటికే అతడు మరణించినట్టుగా ధ్రువీకరించారు. కరణ్ తల్లి సుశీల కంప్లైంట్ చేయడంతో, ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి, కరణ్ పై దాడి చేసిన 10 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పోలీసులు ఈ సంఘటన పై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ప్రస్తుత రోజుల్లో మానవత్వానికి విలువనివ్వడం లేదు. డబ్బుకి, ఆస్తులకు ఇచ్చే విలువలో సగం కూడా కుటుంబ బంధాలకు ఇవ్వడం లేదు. అలా అనడానికి తాజాగా జరిగిన ఒక సంఘటననే ఉదాహరణగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలంలోని గామాలపాడు చెందిన ఏడుకొండలు, వెంకటరత్నమ్మలకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని తమకున్నంతలో పెంచి, పెద్ద చేసి ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. అయితే వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుమారుడు వెంకటేష్ కు వారు భారమయ్యారు.
ఇక ఆస్తి పంపకాలలో వచ్చిన గొడవల వల్ల వెంకటరత్నం పై కొడుకు, కోడలు దాడి చేశారు. దాంతో వెంకటరత్నం చెయ్యి విరిగింది. విషయం బయటికి వస్తుందని కుమారుడు తల్లి పై కాస్త జాలి కూడా లేకుండా నల్గొండ జిల్లా, మిర్యాలగూడలోని ఒక తండాలోని శ్మశానవాటికలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తరువాత అక్కడికి మొక్కలకు నీళ్ళు పోసే పని చేసే గ్రామపంచాయతీ వర్కర్ శ్రీనివాస్ వెళ్లాడు. అక్కడ ఉన్న వెంకటరత్నం చూసి వెంటనే సర్పంచ్ కు తెలియచేశాడు.
దాంతో సర్పంచ్, గ్రామస్తులు వెంకటరత్నం వివరాలు తెలుసుకుని పోలీసులకు తెలిపారు. ఆమె ఇంటికి వెళితే కొడుకు, కోడలు తనను చంపేస్తారని భయాందోళనను వ్యక్తం చేసింది. హాస్పటల్ కి తీసుకు వెళ్లమని కన్నీటితో వేడుకొంది. గాయాలతో బాధపడుతున్న ఆ వృద్ధురాలిని పోలీసులు మిర్యాలగూడ హాస్పటల్ కి తరలించారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి, దాచేపల్లి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.










