తిరుమలకు వెళ్ళే నడకదారిలో చిరుత పులి దాడిలో లక్షిత అనే పాప ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అందరినీ ఈ ఘటన తీవ్రంగా కలిచి వేసింది. చనిపోయిన లక్షిత మృత దేహానికి పోస్టుమార్టం జరిపించారు. దీనిలో లక్షిత చనిపోవడానికి కారణం చిరుత పులి అని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు.
పోస్టుమార్టం పూర్తి అయిన తరువాత లక్షిత మృతదేహాన్ని రుయా మార్చురీ నుండి నెల్లూరుకు తరలించారు. లక్షిత మరణించడంతో ఇటు ఆమె కుటుంబంలో, అటు ఆమె గ్రామం అంత విషాదంలో మునిగింది. రుయా హాస్పటల్ లక్షిత కుటుంబ సభ్యుల రోధనతో నిండిపోయింది.
తిరుమలలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆరు సంవత్సరాల లక్షిత ఫ్యామిలీకి టీటీడీ ఎక్స్‌గ్రేషియాను ఇవ్వనున్నారు. టీటీడీ తరపున ఐదు లక్షలు ఇవ్వనుండగా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐదు లక్షలు ఇవ్వనుంది. మొత్తం కలిపి పది లక్షల ఎక్స్‌గ్రేషియాను లక్షిత కుటుంబానికి అంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి లక్షిత ఇన్సిడెంట్ పై స్పందించడం కోసం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ధర్మారెడ్డి మాట్లాడుతూ, చిరుత పులి దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమైన, విషాదకరమైన ఘటన అని తెలిపారు. లక్షిత నడకదారిలో తన తల్లిదండ్రులతో కాకుండా పలుమార్లు ఒంటరిగా వెళ్లినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో నడకదారిలో పటిష్టమైన చర్యలు మరింతగా తీసుకుంటామని, త్వరలో 500 సీసీ కెమరాలను ఏర్పాటు చేసి అడివిమృగాలు కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని వెల్లడించారు.
గాలి గోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రతను మరింతగా పెంచుతామని, 10 మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డు చొప్పున నియమిస్తామని వెల్లడించారు. నడకదారిలో చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిలల్లను వారి సంరక్షణలో ఉంచుకోవాలని సూచించారు, హై అలర్ట్ ప్రాంతాలలో బోన్లను ఏర్పాటు చేస్తామని, రాత్రి 10 గంటల వరకు ప్రస్తుతం నడకదారిలో తిరుమల వచ్చే భక్తులను అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అనుమతించే టైమ్ ను తగ్గించేందుకు ఆలోచిస్తున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు.
Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాజీ ప్రధాని “మన్మోహన్ సింగ్”..! ఇలా అయిపోయారేంటి..?

భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త అయిన ముకేశ్ అంబానీ ఆసియాలోనే అపర కుబేరుడుగా పేరుగాంచాడు. ముకేశ్ అంబానీకి సంబంధించిన వార్తలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. అంబానీ ఆంటిలియా భవనం ప్రపంచంలోనే రెండవ అత్యంత రిచెస్ట్ హౌస్ గా నిలిచింది. ఈ ఇంటి ఖరీదు 15 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని సమాచారం. ఈ భవనం మాత్రమే కాకుండా అంబానీకి ఇతర దేశాలలో కూడా ఎన్నో భవంతులు ఉన్నాయి. తాజాగా వాటిలో ఒక లగ్జరీ ప్రాపర్టీని అమ్మేసినట్లుగా ఒక న్యూస్ నెట్టింట్లో షికారు చేస్తోంది.
అమెరికాలోని మ్యాన్‌హట్టన్ వెస్ట్ విలేజ్‌లో ఉండే ఒక లగ్జరీ హౌజ్ ను విక్రయించినట్లుగా న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. 2406 చదరపు అడుగులు ఉన్న ఇంటిని 9 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.74.5 కోట్లకు అమ్మినట్లుగా పేర్కొంది. ఇక ఈ లగ్జరీ హౌజ్ హడ్సన్ నదీ తీరంలో ఉందట. రెండు బెడ్రూంల నుండి హడ్సన్ నది ప్రకృతి అందాలను చూసే విధంగా ఈ ఇంటిని నిర్మించారని తెలుస్తోంది.
ఈ ఇంటి లోపల భాగాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. జిమ్మీ జాన్సన్, హిల్లరీ స్వాంక్, మార్క్ జాకబ్స్ లాంటి ప్రముఖులు ఈ హౌజ్ ఇంటీరియర్ డిజైన్‌ను అద్భుతంగా రూపొందించారు. గతేడాది అంబానీ అరబ్ సిటీ దుబాయ్‌లో కూడా 640 కోట్ల రూపాయలు పెట్టి ఒక లగ్జరీ విల్లా కొనుగోలు చేశారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. సోమవారం (ఆగస్టు 7) నాడు రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయం పై చర్చ జరుగగా, మన్మోహన్ సింగ్ చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేసారు. ఓటింగ్ ముందు సీరియస్ గా జరిగిన చర్చలో 90 ఏళ్ల వయసులోనూ పాల్గొన్నారు. ఆయన మౌనంగా రాజ్యసభలో జరిగిన చర్చను నిశితంగా గమనించి, ఆ తరువాత ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తన అనారోగ్యాన్ని పట్టించుకోకుండా, తన బాధ్యతను నెరవేర్చడం కోసం వచ్చిన మన్మోహన్ సింగ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు పార్లమెంట్ కు రాకుండా ఉంటారని, కానీ 90 సంవత్సరాల వయసులో ఉన్న మన్మోహన్ సింగ్ ను చూసి వారు నేర్చుకోవాలని నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు. సెప్టెంబర్ లో మన్మోహన్ సింగ్ 91వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు.
సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో ఆ బిల్లును ఆమోదముద్ర కోసం రాష్ట్రపతికి పంపించనున్నారు. ఈ బిల్లుతో దేశరాజధాని డిల్లీలోని పరిపాలన యంత్రాంగం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక పై కేజ్రీవాల్ ప్రభుత్వ నియంత్రణ ఢిల్లీ ఉద్యోగుల పై నామమాత్రంగా ఉంటుంది.
ప్రజా గాయకుడు గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఆయన 1949లో తూప్రాన్‌లో జూన్ 5న జన్మించారు. మూడు రోజుల క్రితమే గద్దర్ అపోలో హాస్పటల్ లో గుండెకు చికిత్సను చేయించుకున్నారు. ఈ క్రమంలో వైద్యులు గుండె ఆపరేషన్ విజయవంతం అయినట్టుగా ప్రకటించారు. అయితే అంతలోనే గద్దర్ మరణించడం విషాదకరంగా మారింది. ఇక ఆయన చనిపోవడానికి గల కారణాల గురించి డాక్టర్స్ బులెటిన్ రిలీజ్ చేశారు. గద్దర్ మరణానికి గల ముఖ్యమైన కారణాలను అందులో తెలిపారు.
గద్దర్ ముఖ్యంగా ఊపిరితిత్తులు మరియు మూత్ర సమస్యలతో మృతి చెందినట్లు డాక్టర్స్ వెల్లడించారు. తీవ్రమైన గుండెజబ్బుతో గద్దర్ జూలై 20న హస్పటల్ చేరగా, ఆగస్టు 3వ తారీఖు ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. అది సక్సెస్ అయినా కానీ, గతంలో గద్దర్ కు ఉన్న లంగ్స్ సమస్య వల్ల ఆయన, కోలుకోలేక కన్నుమూసినట్లు వైద్యులు బులెటిన్‌లో ప్రకటించారు.
గద్దర్ అంత్యక్రియలను నేడు ఆల్వాల్ లోని మహా బోధా స్కూల్లో నిర్వహిస్తారని తెలుస్తోంది. గద్దర్ కు నివాళులు అర్పించడం కోసం ప్రజలతో పాటుగా, రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజాసంఘాల నేతలు ఎల్బీ స్టేడియానికి తరలివస్తున్నారు. గద్దర్ తో తమకున్న ఙ్ఞాపకాలను, అనుబంధాన్ని తల్చుకుంటూ వారు భావోద్వేగానికి లోనవుతున్నారు. జన సేనాని పవన్ కళ్యాణ్ గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిన వెంటనే వచ్చి, గద్దర్ బౌతీక కాయాన్ని సందర్శించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించాడు.
విశాఖలోని వన్‌టౌన్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ మర్డర్ కేసులో వీడియో లభించిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియో చూసిన పోలీసులు, రమేష్ వైఫ్ తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. లవర్ రామారావుతో కలిసి రమేష్ భార్య మంగళవారం రాత్రి భర్తను ఊపిరాడకుండా చేసి చంపేసిన సంగతి తెలిసిందే. అయితే రమేష్ ను చంపడం కోసం ముందుగానే తన లవర్ తో కలిసి శివాని కుట్ర పన్నింది. హత్య విషయంలో తన పై సందేహం రాకుండా హత్య చేయకముందే రమేష్ తో చాలా ప్రేమగా ఉన్నట్లు వీడియో తీసింది.
మంగళవారం నాడు రాత్రి మటన్ కర్రీ చేసి, భర్తకు పెట్టి, మద్యం తాగించింది. తాను చాలా మంచిదని, మై వైఫ్, మై లైఫ్ అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డు చేసింది. ఆ తరువాత మద్యం మత్తులో ఉన్న భర్తను తీసుకెళ్ళి బెడ్ పై పడుకోబెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మర్దర్ కేసు తనపై పడకుండా ఉండడం కోసమే, తాను మంచిదాన్ని అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డ్ చేసినట్లు శివాని పోలీసులు ఎదుట ఒప్పుకుంది. దీంతో శివాని తెలివితేటలకు అందరూ షాక్ అవుతున్నారు.
విచారణలో శివాని తనకు పెద్దమ్మ కూతురు పైడమ్మ వల్లే రామారావుతో పరిచయం అయ్యిందని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో రమేష్ మర్డర్ ఈ హత్య కేసులో పైడమ్మ హస్తం కూడా ఉందని శివాని పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించిందని సమాచారం. ఇక ఈ కేసులో ప్రస్తుతం రమేష్ భార్య శివాని, ఆమె లవర్ రామారావు, మరియు అతని ఫ్రెండ్ నీలా మీద మాత్రమే కేసును నమోదు చేశామని పోలీసులు తెలిపినట్లు సమాచారం.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంజుకు పాకిస్తాన్ కి చెందిన నస్రుల్లాతో ఫేస్ బుక్ లో పరిచయం కావడం, ఆ తరువాత అది ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో లవర్ ను కలుసుకోవడం కోసం అంజు దేశ సరిహద్దులను దాటి పాకిస్తాన్ కు వెళ్లింది. అక్కడ ఇస్లాం మతంలోకి మారి, పేరు సైతం ఫాతిమా మార్చుకుని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మరో వారి పెళ్లి విషయం తెలిసిన అంజు ఆమె భర్త వారి పెళ్లి చెల్లదని చెబుతున్నారు. కానీ ఫాతిమా గా మారిన అంజు మాత్రం ఇక్కడి సంప్రదాయాలను మర్చిపోయి, అక్కడి వాటిని నేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ఫాతిమా, నస్రుల్లా పెళ్లి చేసుకోవడంతో బంధువులే కాకుండా అక్కడి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా వారి ఇంటికి వెళ్ళి మరి బహుమతులు ఇస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ బిజినెస్ మెన్ మహమ్మద్ ఖాన్ అబ్బాసీ అంజుకి బహుమతుల అందచేశారు. ఆమెకు ఇల్లు కట్టుకోవడం కోసం స్థలం మరియు డబ్బును కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఇతర మతాల నుండి తమ మతంలోకి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. ప్రస్తుతం అతను చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
శోభు యార్లగడ్డ తన ట్వీట్లో ఇలా రాసుకొచ్చాడు. ‘ఈ మధ్య కాలంలో విజయాన్ని అందుకున్న ఒక యంగ్ హీరో తన ఆటిట్యూడ్ కారణంగా హిట్ చిత్రాన్ని వదులుకున్నాడు. సక్సెస్ వచ్చిన అనంతరం, దానిని ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని, ఒక కొత్త దర్శకుడు స్క్రిప్ట్ చెప్పడం కోసం సదరు హీరో దగ్గరికి వెళ్ళిన సమయంలో అతను ఆటిట్యూడ్‌తో గౌరవం ఇవ్వలేదని, ఇలాంటి విధానం ఆ హీరో కెరీర్‌కు ఎంత మాత్రం కూడా మంచిది కాదు.
అయితే ఈ విషయాన్ని ఆ హీరో త్వరలోనే గ్రహిస్తాడని ఆశిస్తున్నాను అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసినవారు ఆ యంగ్ హీరో విశ్వక్ సేన్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే బేబీ మూవీ కథను చెప్పడానికి విశ్వక్ సేన్ వద్దకి వెళ్తే, కనీసం కథ కూడా వినకుండా రిజెక్ట్ చేశాడని దర్శకుడు సాయి రాజేష్ పరోక్షంగా తెలిపాడు.
దాని పై విశ్వక్ స్క్రిప్ట్ విని రిజెక్ట్ చేయడం కన్నా ముందే నో అని చెబితే బెటర్ అని ఇప్పటికే కౌంటర్ ఇచ్చాడు. దాంతో ఆ హీరో విశ్వక్ సేన్ అని భావించారు. అయితే శోభు యార్లగడ్డ విశ్వక్ సేన్ గురించి ఆ ట్వీట్ పెట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. ఆ ట్వీట్ తో ఆ చర్చ ముగిసింది. మరి శోభు యార్లగడ్డ చెప్పిన ఆ హీరో ఎవరా అని నెటిజెన్లు మళ్ళీ వెతుకుతున్నారు.
వెంకన్న ప్రసాదాల్లో లడ్డు ముఖ్యమైనది. అన్ని హిందువుల పుణ్యక్షేత్రాల్లో దొరికే లడ్డుల కన్నా తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత వేరే దేనికి లేదని చెప్పవచ్చు. తిరుపతిలో దొరికే లడ్డు యొక్క రుచి, సువాసన వేరే లడ్డుకు ఉండదు. అందుకే తిరుపతి లడ్డుకు జియోగ్రాఫికల్ పేటెంట్ కూడా లభించింది. దాని ప్రకారం ఈ లడ్డు తయారీ పద్ధతి ఎవ్వరూ అనుకరించకూడదు.
మధురమైన తిరుపతి లడ్డుల తయారీ కోసం గత యాబై సంవత్సరాల నుండి నందిని నెయ్యిని ఉపయోగిస్తున్నారు. తిరుమలలో నిత్యం దాదాపు 3 లక్షల లడ్లు తయారు చేస్తారని తెలుస్తోంది. ఈ లడ్డుల తయారీలో సుమారు 700 మంది పోటు కార్మికులు పని చేస్తున్నారు. తాజాగా టీటీడీ అధికారులు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. లడ్డు తయారీలో నందిని నెయ్యిని ఉపయోగించకూడదని నిర్ణయాన్ని తీసుకున్నారు.
నందిని నెయ్యిని కేఎంఎఫ్ (కర్ణాటక మిల్క్ ఫెడరేషన్) తయారు చేస్తుంది. ఈ నెయ్యిని వాడకూడదని నిర్ణయించారు. ఈ మేరకు కేఎంఎఫ్‌తో ఇన్నాళ్ళూ ఉన్న కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేయకూడదనే డిసైడ్ అయ్యారు. దీనికి కారణం కేఎంఎఫ్ నందిని నెయ్యి ధరను పెంచడమే. ఇక ఈ విషయాన్ని కేఎంఎఫ్ ఛైర్మన్ ధ్రువీకరించారు. టీటీడీ చెప్పిన ధరకు నందిని నెయ్యిని సరఫరా చేయలేమని తెలిపారు. నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేసే టెండర్ల విధానంలో పాల్గొనట్లేదని వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లాకు చెందిన జానకీ దేవి భర్త కొన్నేళ్ళ క్రితం కనిపించకుండా పోయాడు. అప్పటి నుండి ఆమె తన భర్త కోసం వెతుకుతూనే ఉంది. ఇటీవల బల్లియాలోని జిల్లా హాస్పటల్ ముందు చాలా దయనీయంగా ఉన్న ఒక దివ్యాంగుడిని చూసింది. ఆ వ్యక్తి కనిపించకుండా పోయిన తన భర్తగా భావించి ఇంటికి తీసుకెళ్లింది. అతని గడ్డం మరియు జుట్టు అచ్చం తన భర్త వలె ఉండడంతో పొరబాటు పడింది. అతన్ని చిరిగిన బట్టలలో చూసి బాధపడిపోయింది.
ఆసుపత్రి బయట అతన్ని చూసి ఇన్నేళ్ల నుండి ఎక్కడికి వెళ్లిపోయావు? ఇంతకాలం ఎక్కడున్నావు? అని జానకీ దేవి అడిగింది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏం మాట్లాడలేదు. జానకీ దేవి అతన్ని ఇంటికి తీసుకొచ్చి, అతనికి షేవింగ్ చేయించిన తరువాత చూసి షాక్ అయ్యింది. ఆ తరవాత అతని పుట్టు మచ్చలు చూసి భర్త కాదో గుర్తు పట్టడం కోసం ప్రయత్నించింది. కానీ పుట్టు మచ్చలు కూడా కనిపించలేదు. దాంతో ఇంటికి తీసుకువచ్చిన వ్యక్తి తన భర్త కాదని గ్రహించింది.
అంతకు ముందు “నాన్న వచ్చాడు” అని తన పిల్లలతో ఆనందంగా చెప్పింది. ఒక కొత్త కుర్తాను తీసుకురమ్మని డబ్బులిచ్చి పిల్లలను పంపింది. కానీ చివరికి అతను తన భర్త కాదని, తప్పు తెలుసుకుని అతనికి క్షమాపణలు చెప్పి, అ వ్యక్తిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించింది. ఇదంతా చూసిన స్థానికులందరు ఆశ్చర్యపోయారు.

