ఇండియాలో చదువుకుంటున్న ఎంతోమంది యువతీ యువకులకు అమెరికాకు వెళ్లి మాస్టర్స్ చేయడం అనేది ఒక అందమైన డ్రీమ్. చాలామంది మాస్టర్స్ కోసం పుట్టిన ఊరును కన్న తల్లిదండ్రులను అన్నిటిని వదులుకొని ఎన్నో ఇబ్బందులను సైతం ఎదుర్కొంటారు.
అయితే తెలంగాణ నుంచి అమెరికాలో మాస్టర్స్ చేయాలి అని ఎంతో ఆశతో వెళ్లిన ఒక యువతి ప్రస్తుతం అక్కడ నిస్సహాయ స్థితిలో చికాగో రోడ్లపై అతి దయనీయమైన పరిస్థితిలో ఉంది.

డిప్రెషన్ , ఒంటరితనంతో బాధపడుతూ ఆకలికి అలమటిస్తూ రోడ్లపై తిరుగుతున్న తమ కూతురిని తమ వద్దకు చేర్చమని ఆ తల్లి విదేశాంగ మంత్రిని వేడుకుంటూ లేఖ రాశారు. ప్రస్తుతం ఆ లేఖ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయింది. అయితే అసలు ఆ అమ్మాయి ఆ పరిస్థితికి ఎలా వచ్చింది అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.

రోడ్డు మీద తిరుగుతున్న అమ్మాయిని చూసి గుర్తుపట్టిన ఇద్దరు హైదరాబాద్ యువకులు ఆమె తల్లికి విషయాన్ని తెలియజేశారు. అది తెలుసుకున్న ఆమె తల్లి తన కుమార్తెను ఎలాగైనా ఇండియాకు తీసుకువచ్చే దానికి సహాయం చేయమని విదేశాంగ మంత్రి అయిన ఎస్ జైశంకర్ కు లెటర్ రాశారు. 2021 వ సంవత్సరం మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం హైదరాబాద్ లోని మౌలాలి కి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ డెట్రాయిట్ వెళ్లింది.

అక్కడ ట్రైన్ ( TRINE) యూనివర్సిటీలో ఆమె చేరిన తరువాత కూడా ఫ్యామిలీతో బాగానే టచ్ లో ఉండేది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ గత రెండు నెలలుగా ఆమె తన ఫ్యామిలీతో అస్సలు టచ్లో లేకుండా పోయింది. ఆమెకు ఏమైపోయింది అని ఆమె ఫ్యామిలీ ఎంతో కంగారు పడుతున్నారు. అయితే ఇన్ని రోజులకు ఆమె సామాన్లు దొంగలించబడ్డాయని, డిప్రెషన్ తో ఆకలితో అలమటిస్తూ ప్రస్తుత ఆమె చికాగోలో రోడ్లపై కనిపించిందని తెలుసుకున్న ఆమె తల్లి ఆవేదనతో అలమటిస్తోంది.
ALSO READ : ముగ్గురు ఆడపిల్లలు… బాధ్యతల భారం… కానీ..! ఈ మహిళ గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!


భార్యను పూలమాలతో, శాలువాతో సత్కరించాడు. ఆ తరువాత కేక్ కట్ చేయించి, స్వీట్లు పంచిపెట్టాడు. భర్త చేసిన ఏర్పాట్లను చూసి దీనా ఆనంద భాష్పాలు రాల్చింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన వారు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఆడదాని సక్సెస్ వెనుక ఒక అర్థం చేసుకునే భర్త ఉంటాడని ఒకరు కామెంట్ చేశారు. అంతగా ప్రేమించి భార్య కోసం ఎఫర్ట్ పెట్టే వాళ్లు దొరకాలంటే రాసి పెట్టి ఉండాలని ఒకరు కామెంట్ చేశారు.



తాము ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్న విషయం కోర్టుకు చెప్పడంతో అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కంపెనీలో పనిచేస్తోన్న ఈ జంట అప్పటి నుండి కలిసి జీవించడం మొదలుపెట్టారు. కానీ, అఫిఫా తల్లిదండ్రులు, బంధువులు వారు పని చేసే దగ్గరికి వెళ్ళి అఫిఫాను బలవంతంగా తీసుకెళ్లారు. దాంతో సుమాయా పోలీసు స్టేషన్లలో కంప్లైంట్ చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు వారు తీసుకోలేదు. ఆ తర్వాత కేరళ హైకోర్టులో సుమాయా ఒక పిటిషన్ దాఖలు చేసింది. అఫిఫాను కోర్టు ముందు హాజరు పర్చాలని ఆదేశించింది.
అయితే వారు కోర్టు ఆర్డర్ పాటించకుండా తమకు టైమ్ కావాలని అడిగారు. ఆ తర్వాత జూన్ 10 రోజులకు అఫిఫాను కోర్టుకు ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు బెదిరిచడంతో అఫిఫా కోర్టులో సుమాయాతో కలిసి ఉండాలనుకోవడం లేదని తెలిపారు. అలాగే తన తల్లిదండ్రులతో ఉండాలనుకున్నట్లు అఫిఫా చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అఫిఫా సుమాయాకు ఫోన్ చేసి, కోర్టు ముందు చెప్పిందంతా కావాలని మాట్లాడింది కాదని, తన తల్లిదండ్రులు వైద్య చికిత్స చేయించారని తెలిపింది.
వనజా కలెక్టివ్ సంస్థ ద్వారా సుమాయా పోలీసుల సహాయంతో అఫిఫాను తన తల్లిదండ్రుల నుంచి రక్షించారు. కోర్టులో సుమాయాతో వెళ్లలేనని చెప్పిన పరిస్థితులను అఫిఫా బీబీసీకి వివరించారు. శారీరక సంబంధం కోసం మాత్రమే తాము కలిసి ఉండాలని అనుకుంటున్నామని అనేవారని, ఇలా ఆలోచించే వారితో మాట్లాడటం కూడా అర్థరహితం. తమను అర్థం చేసుకునే విధంగా వారిని మార్చలేం’’ అన్నారు. డాక్టర్లే మా బంధాన్ని అర్థం చేసుకోలేదని, సొసైటీ, తల్లిదండ్రులు ఎలా అర్థం చేసుకుంటారని సుమాయా, అఫిఫా చెప్పుకొచ్చారు.









