భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రయోగించి, దక్షిణ ధృవం పై అడుగుపెట్టిన తొలి దేశంగా ఇండియాను నిలిపింది. మరోసారి ప్రతిష్టాత్మక ప్రయోగానికి రెడీ అవుతోంది.
సూర్యగోళం యొక్క రహస్యాలను ఛేదించడం కోసం ఆదిత్య ఎల్1 ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి పరికరాలన్నీ శ్రీహరికోటకు చేరుకున్నాయి. ఈ క్రమంలో రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న రావడం సహజమే. మరి ఎందుకు శ్రీహరికోటను రాకెట్ ప్రయోగానికి ఎంచుకున్నారో ఇప్పుడు చూద్దాం..
ఇస్రో ప్రయోగం అని వినగానే, వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీహరి కోట. చంద్రయాన్1, 2, 3లతో పాటు ఎన్నో చారిత్రాత్మక ప్రయోగాలకు నెల్లూరులోని శ్రీహరి కోట వేదికగా మారింది. రాకెట్ ప్రయోగానికి శ్రీహరి కోటను ఎంచుకోవడానికి కారణం శ్రీహరి కోట స్పేస్ సెంటర్‌కు 5 ప్రత్యేకతలు ఉన్నాయి.
1. భూమధ్య రేఖకు సమీపంగా ఉండడం..
శ్రీహరికోట భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది. ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగించినపుడు సెకన్‌కు 0.4 కిలోమీటర్ల ఎక్స్ట్రా స్పీడ్ ను అందుకుంటుంది. భూభ్రమణం కారణంగా రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల మేర అదనపు స్పీడ్ కలిసొస్తుంది.
33. భూమి స్వభావం..
రాకెట్ ప్రయోగాలకి వాతావరణం అనేది ఎంత ముఖ్యమో, అలాగే భూమి స్వభావం ముఖ్యమే. ఎందుకంటే, రాకెట్ ప్రయోగించే టైమ్ లో భూమి తీవ్రంగా కంపిస్తుంది. అది తట్టుకునేలా భూమి చాలా ధృడంగా ఉండాలి. శ్రీహరికోట బండరాళ్లతో కూడి చాలా బలంగా ఉంటుంది.
2. సుదీర్ఘ తూర్పు తీరం ఉండడం..
రాకెట్ ప్రయోగాలన్నీ విజయవంతంగా నింగిలోకి వెళతాయనే గ్యారెంటీ లేదు. వాతావరణ లేదా సాంకేతిక కారణాలతో అవి నేలపై కూలిపోయే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో రాకెట్ శకలాలు జనావాసాల పై పడితే, చాలా ప్రాణనష్టం కలుగుతుంది. అయితే శ్రీహరికోట చుట్టూ నీరే ఉంది. అటు వైపు బంగాళాఖాతం, ఒక వైపు పులికాట్ సరస్సు. రాకెట్ ఒకవేళ కూలిపోయినా దాని శకలాలు సముద్రంలో పడిపోతాయి.
4. రవాణా సదుపాయం..
రాకెట్ ప్రయోగాలం కోసం అధునాతమైన మరియు భారీ యంత్రాలు అవసరం అవుతాయి. వీటిలో కొన్ని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు రవాణాకు చాలా అనుకూలమైన ప్లేస్ ను కోసమే రాకెట్ ప్రయోగాల కోసం ఎన్నుకుంటారు. అలా రవాణా సదుపాయంలో శ్రీహరికోట అనుకూలంగా ఉంది. శ్రీహరికోటకు రైలు, రోడ్డు, జల రవాణా మార్గాలు ఉన్నాయి.
5. ప్రయోగాలకు అనుకూలమైన వాతావరణం..
రాకెట్ ప్రయోగాలకు అనుకూల వాతావరణం ఉండడం అత్యంత కీలకమైన విషయం. ఎక్కువ ఎండలు కానీ, అధిక వర్షపాతం కానీ ఉండకూడదు.
ఇక శ్రీహరికోటలో సంవత్సరం పొడుగునా సాధారణమైన వాతావరణం ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలలో మాత్రమే భారీ వర్షాలు పడుతాయి. అందువల్ల మిగిలిన పది నెలలు శ్రీహరికోట ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుంది.
Also Read: 41 రోజులు 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన… “చంద్రయాన్-3” ఇప్పుడు ఏం చేయనుంది.?

తిరుమలలో 7వ కిలో మీటర్ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. చర్చలకు దారితీస్తోంది. దానికి కారణం తిరుమల నడకదారిలో చిన్నారులపై చిరుత పులి దాడి చేయడం. రెండు సంఘటనలు జులై, ఆగస్ట్ నెలలో జరిగాయి. మొదటి సంఘటనలో జులై 23న బాలుడు కౌశిక్ చిరుత దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి అరుపులకు భక్తులు వెళ్లడంతో చిరుత విడిచిపెట్టి వెళ్ళింది. ఆ బాలుడు చికిత్స తీసుకున్న తరువాత కోలుకున్నాడు.
ఇదే ప్రాంతంలో ఆ తరువాత ఆగస్ట్ 11న కుటుంబంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన చిన్నారి లక్షిత చిరుత దాడి చేయగా ప్రాణాలు కోల్పోయింది. ఆ తరువాత ఫారెస్ట్ అధికారులు చిరుతలను బంధించారు. టీటిడి అధికారులు దర్శనంలో కోసం నడకదారిలో వచ్చే భక్తుల భద్రత కోసం తగు చర్యలు చేపట్టారు. ఇక ఇదే ప్రాంతంలో 1980లో దారుణమైన సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.
తిరుమలలోని ఘాట్ రోడ్ 7 వ కిలోమీటర్ వద్ద ఒక మహిళను దారుణంగా హత్య చేశారట. ఆ మహిళ హత్య వల్ల కలిగే నష్ట నివారణ కోసం అక్కడ ఒక ఆంజనేయ విగ్రహాన్ని స్థాపించారు అప్పటి ఈవో పీవోఆర్కే ప్రసాద్. అప్పుడు మహిళా హత్య, ఇప్పుడు చిరుతపులి దాడి రెండు కూడా ఇదే 7వ కిలో మీటర్ సమీపంలోనే జరిగాయి.


కానీ దేవస్థాన కౌంటర్ సిబ్బంది ఆ రవికను చెత్తలో వేయమని చెప్పడంతో వారు షాకయ్యారు. సందేహం వచ్చి, రవిక ను పరిశీలించగా అది రవిక కాదని, దాన్ని రుమాలు అనికూడా చెప్పలేము అని హారిక తెలిపారు. అమ్మవారి రవికల పేరుతో గుడ్డ ముక్కలను అందంగా ఉండే ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నారని హారిక ఆరోపించారు.
అడిగినంత డబ్బు ఇస్తున్నా కూడా, గుడి అవరణలోనే భక్తులను మోసం చేయడం ఏంటని కౌంటర్ లో ఉన్న సిబ్బందిని నిలదీయగా వారు ఆలయ అధికారులకు కంప్లైంట్ చేయమని సూచించినట్లుగా ఆమె తెలిపారు. అక్కడ ఇదంతా సాధారణంగా జరిగే విషయమే అని ఆలయ అధికారి చెప్పారని అన్నారు. దాంతో దేవాలయ ఈవో భ్రమరాంబను కలవడానికి ప్రయత్నించగా, ఆ టైమ్ లో ఈవో అందుబాటులో లేకపోవడంతో వెనక్కు వచ్చామని హారిక వెల్లడించారు.
ప్రముఖ మలేసియా బిజినెస్ టైకూన్ ఖూ కే పెంగ్ మరియు మాజీ మిస్ మలేసియా అయిన పాలైన్ ఛాయ్ ల కూతురు ఏంజెలినా ఫ్రాన్సిస్. ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంది. ఆ సమయంలోనే ఆమె జెడియా అనే ఫ్రెండ్ ని ప్రేమించింది. వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత ఏంజెలినా తన తల్లిదండ్రులకు ప్రేమ విషయాన్ని తెలిపింది. అయితే ఆమె తల్లిదండ్రులు వారి పెళ్ళికి నిరాకరించారు.
ఆర్థికపరంగా ఇద్దరి కుటుంబాల్లో చాలా తేడా ఉండడంతో వారు ప్రేమించిన వాడికి దూరం కావడమో లేదా కుటుంబ వారసత్వాన్ని వదులుకోవడమో రెండిటింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోమని ఆదేశించారు. అయితే ఏంజెలినా ప్రేమించినవాడితో జీవితం పంచుకోవడం కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి, 2008లో పెళ్లి చేసుకొని తాను కోరుకున్నవాడితో కొత్త లైఫ్ ను మొదలుపెట్టింది. ఈ క్రమంలో మేకు వారసత్వంగా రావలసిన దాదాపు రెండు వేల కోట్ల ఆస్తినీ వదిలేసింది.
పెళ్లి తరువాత ఇద్దరు కూడా కూడా ఇరు కుటుంబాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ, చాలారోజులు తరువాత ఏంజెలినా తన పేరెంట్స్ ను కలవాల్సి వచ్చింది. దానికి కారణం ఏంజెలినా తల్లిదండ్రులు డైవర్స్ తీసుకున్నారు. కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి ఆమె కోర్టుకు వెళ్లింది. తన తల్లి పాలైన్ ఛాయ్ గురించి గొప్పగా చెప్పిన ఆమె తండ్రిపై విమర్శలు చేసింది. ప్రస్తుతం ఏంజెలినా లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం, 3 – 18 సంవత్సరాల వరకు అందరికీ చదువు తప్పనిసరి చేసింది. 2030 వరకు అందరికీ విద్య అందించడమే ఈ విధానం యొక్క లక్ష్యం. 5వ తరగతి వరకు మాతృ భాషలోనే పాఠాలను బోధిస్తారు. ఆరవ తరగతి నుండి కోడింగ్, ప్రోగ్రామింగ్ కరిక్యులమ్ ఉండేలా చర్యలు. అలాగే 6వ తరగతి నుండే వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు అమలులోకి వస్తాయి. ఎంఫిల్ కోర్సును పూర్తిగా తొలిగించనున్నారు. ప్రస్తుతం ఉన్న 10+2+3( టెన్త్, ఇంటర్, డిగ్రీ) విధానం, ఇక పై 5+3+3+4 విధానంలోకి మారనుంది. డిగ్రీ మూడు నుండి నాలుగు సంవత్సరాలు.
పీజీ సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు. ఇంటర్ చదువు ఉండదు. ఇంటిగ్రేటెడ్ పీజీ మరియు యూజీ ఐదు సంవత్సరాలు. దేశం మొత్తం ప్రాథమిక చదువుకు ఒకటే కరిక్యులమ్ ఉండనుంది. పాఠ్యాంశాల భారాన్ని తగ్గించి, కాన్సెప్ట్ ను విధ్యార్ధులకు నేర్పే ప్రయత్నం దిశగా మారనుంది. ఇక పై కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయ పన్నెండవ తరగతి వరకు మాత్రమే.
టీచింగ్ ఇంటెన్సివ్ లేదా రీసెర్చ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీలు, మోడల్ మల్టీ డిస్సిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజీలను ఆమోదించనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో నాలుగు ఏళ్ల మల్టీ-డిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీని ప్రతిపాదించింది. ఈ డిగ్రీలో వృత్తిపరమైన రంగాలకు చెంది ఉంటాయి. 1 ఏడాది రీసెర్చ్ పూర్తి అయ్యాక ఒక సర్టిఫికేట్, రెండు ఏళ్ల చదువు పూర్తి అయ్యాక డిప్లొమా సర్టిఫికెట్, మూడేళ్ళ ప్రోగ్రామ్ పూర్తి అయ్యాక బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్, నాలుగేళ్ళ మల్టీడిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి అయ్యాక సర్టిఫికెట్ లు ఇస్తారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.





చంద్రయాన్ 3 సుమారు 41 రోజుల పాటు భూమి నుండి చంద్రుడి వైపు ప్రయాణించి ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’ ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లి పై అడుగుపెట్టింది. చందమామ పై అడుగిడాలనే భారత్ ఎన్నో ఏళ్ల కల సాకారం అయ్యింది. చంద్రయాన్-3 వల్ల దేశానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 గత నెల బయలుదేరి, ఎట్టకేలకు ఆఖరి అంకానికి చేరుకుంది. కొన్ని గంటల్లో ల్యాండర్ చంద్రుని దక్షిణధ్రువం తొలి అడుగు పెట్టడానికి సిద్ధమైంది. ఆ క్షణం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. దేశం మొత్తం ఇస్రో జయహో అని నినదిస్తోంది. ఈరోజు సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ మొదలుకాబోతుంది. సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు చందమామ ఉపరితలం పై ల్యాండర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లన్నిటిని పూర్తి చేశారు.