తెలంగాణావ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ అప్సర హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటకి వస్తుండం అందరిని షాక్ కి గురిచేస్తోంది. నిందితుడు సాయికృష్ణ పరిచయం కాకముందే అప్సరకు వివాహం అయిన విషయం బయటకు వచ్చింది.
తాజాగా అప్సర, కార్తీక్ రాజాలపెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై హత్యకు గురైన అప్సర తల్లి మాట్లాడుతూ నిందితుడు సాయికృష్ణను కాపాడడం కోసమే తమ కూతురు పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కార్తీక్ రాజా తల్లి ఆడియోను రిలీజ్ చేసింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తాజాగా అప్సర భర్త కార్తీక్ తల్లి ధనలక్ష్మి ఆడియో విడుదల చేసింది. ఆ ఆడియో ధనలక్ష్మి పెళ్లి ఫోటోలు నిజమే అని వెల్లడించింది. అప్సర తమకు కొంచెం కూడా ఇష్టం లేదని, తన కుమారుడు కార్తీక్‌కి నచ్చడం వల్లనే ఇద్దరికీ వివాహం చేశాసామని ధనలక్ష్మి అన్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే అప్సర వేరుగా కాపురం పెట్టించిందని అన్నారు. అప్సర టూర్లు, లగ్జరీ జీవితాన్ని ఇష్టపడేదని, వాటి కోసం తన కుమారున్నీ టార్చర్ పెట్టేదని చెప్పారు.
అప్సర వేధింపులు తట్టుకోలేక తన కొడుకు కార్తీక్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ధనలక్ష్మి వెల్లడించారు. అప్సర, ఆమె తల్లి హైదరాబాద్ లో ఉన్నారనే విషయం తమకు తెలియదని అన్నారు. ఇక అప్సరకు తన కొడుకు కార్తీక్ రాజాతో వివాహం అయ్యిందని ధనలక్ష్మి కన్ఫామ్ చేయగా, అప్సర తల్లి పెళ్లి విషయం గురించి ఇప్పుడు అప్రస్తుతం, పోలీసులే తమ కూతురు అప్సర హత్య విషయంలో న్యాయం చేయాలని అడుగుతోంది.
మరోవైపు నిందితుడు సాయికృష్ణ తండ్రి పోలీసుల దర్యాప్తులో వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెబుతున్నారు. ఈ కేసులో నిందితుడు సాయికృష్ణకు 14 రోజులు రిమాండ్ ను కోర్టు విధించింది. మొత్తానికి అప్సర హత్య కేసు డైలీ సీరియల్ లా కంటిన్యూ అవుతోంది.
watch video :
Also Read: జస్ట్ మిస్… చివరి నిమిషంలో ప్రమాదం నుండి తప్పించుకుంది..! ఈ మహిళ కథ ఏంటో తెలుసా..?



























సాఫీగా సాగిపోతున్న రైలు ప్రయాణంలో తమ రైలు పట్టాలు తప్పిందని ప్రయాణికులు తెలుసుకునేలోగా ట్రైన్స్ ఢీ కొని కొందరిని మృత్యువు కబళించింది. కొందరు స్పాట్లోనే, మరికొందరు బోగీల్లో ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. ప్రమదస్థలం భయనకంగా మారింది. కోచ్‌లు 30 వరకు నుజ్జునుజ్జయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన విధానానికి మృతదేహాలు చెల్లాచెదురు అయిపోయాయి. బోగీల్లో చిక్కుకున్న బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లి పోయింది. అయితే ఈ ఇంత ఘోర ప్రమాదం జరగడానికి గల కారణం బయటకు వచ్చింది.
కానీ సిగ్నల్ ప్యానెల్ లో ఆ ట్రైన్ మెయిన్ లైన్ లోనే వెళ్తున్నట్టు చూపించింది. దాంతో మెయిన్ లైన్ వెళ్తుందనుకుని లూప్ లైన్లో వెళ్లి ఆ ట్రాక్ మీద ఉన్న గూడ్స్ ట్రైన్ ని ఢీకొట్టింది. దాంతో కోరమాండల్ భోగీలు కొన్ని గూడ్స్ భోగీల మీద ఎక్కాయి. కోరమాండల్ భోగీలు కొన్ని పక్కనే ఉన్న వేరే ట్రాక్ పై పడ్డాయి. కాసేపటికి పక్క ట్రాక్ పైకి వచ్చిన యశ్వంత్ పూర్ ట్రైన్ ట్రాక్ పై పడిన కోరమాండల్ భోగీలను ఢీకొట్టింది.|
ప్రస్తుతం ఓటీటీలకు ఉన్న క్రేజ్ ఏమిటో అందరికి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. ఓటీటీలు ప్రతివారం కొత్త చిత్రాలు, సిరీస్ లు విడుదల చేస్తూ వాటి స్పేస్ ను పెంచుకుంటున్నాయి. అయితే ఓటీటీలో ఇప్పటివరకు ధూమపానం మరియు మద్యపానం గురించిన చట్టం ఏది లేదు. దాంతో ఓటీటీలో వచ్చే కంటెంట్ లో విచ్చల విడిగా సిగరెట్ మరియు మద్యం తాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ప్రసారం అయ్యే కంటెంట్ లో ఇక పై ధూమపానంకు సంబంధించిన దృశ్యాలు వచ్చినపుడు స్కిన్ క్రింది భాగంలో కనిపించేలా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిపే హెచ్చరికను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ రూల్ ను అమలు చేయనట్లయితే కేంద్ర ఆరోగ్య, ప్రసార, సమాచార, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖలు ఆ ఓటీటీలకు నోటీసులు జారీ చేయడం జరుగుతుంది.
వివరణ ఇచ్చేందుకు, అలాగే మార్పులు చేయడానికి తగిన టైంను ఇస్తాయి. ఇక ఈ నిబంధనలు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఆడియో-విజువల్ ప్రోగ్రాములు, సీరియల్స్, టెలివిజన్ ప్రోగ్రాములు, వెబ్ సిరీస్, పాడ్‌కాస్ట్‌లు వంటి ఇతర కంటెంట్‌కు కూడా వర్తిస్తాయి.