మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన ఒక మహిళ, ఆ తరువాత తాను పనిచేసే కంపెనీ ఓనర్ ను ప్రేమించి, వివాహం చేసుకుంది. ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడంతో తన వైవాహిక జీవితం ఇకపై సంతోషంగా ఉంటుందని ఆ మహిళా కలల కంది. అయితే ఆమె అనుకున్నటుగానే ప్రారంభంలో అంతా సంతోషంగానే సాగింది.
కానీ, ఆమె భర్త ఆమెకు ఊహించని విధంగా షాక్ ఇచ్చాడు. అతను మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆ విషయం తెలిసి కుంగిపోయిన సదరు మహిళ, బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
హెగ్గనహళ్లికి చెందిన పవిత్ర అనే మహిళా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసేది. ఈక్రమంలో పవిత్ర ఆ కంపెనీ ఓనర్ చేతన్‌గౌడను ప్రేమించింది. ఆ తరువాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొన్నాళ్ళ వరకు సజావుగా సాగింది. ఇటీవల చేతన్‌గౌడకు మరో మహిళతో సంబంధం ఏర్పడింది. దాంతో పవిత్ర, చేతన్‌గౌడ ల మధ్య గొడవలు జరిగేవి. పవిత్ర పిల్లలు కావాలని అనుకోగా, ఆమె భర్త అందుకు నిరాకరించాడు.
అప్పటి నుండి భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు మరింతగా పెరిగాయి. తాను ఉండగా మరో యువతితో వివాహేతర సంబంధం ఎందుకు పెట్టుకున్నావని పవిత్ర చేతన్‌గౌడను నిలదీసింది. తాను మగాడినని, ఏదైనా చేస్తానని, పవిత్ర తల్లి ముందే పవిత్ర పై దాడి చేశాడు. తీవ్ర మనోవేదన పడ్డ పవిత్ర, తాను భర్తతో గొడవపడిన వీడియోను, తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు రాసిన డెత్‌నోట్‌ను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టింది.
ఆ స్టేటస్ చూసిన పవిత్ర తల్లి చూసి, వెంటనే కూతురి ఇంటికి వచ్చింది. అయితే పవిత్ర అప్పటికే ఉరి వేసుకుని, మరణించింది. దాంతో పవిత్ర తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు చేతన్‌గౌడ, అతని ప్రేయసి పై కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు చేపట్టారు.
Also Read: సినిమాని తలపిస్తున్న సంఘటన..! ఈ అమ్మాయి ఏం చేసిందంటే..?

వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంకి చెందిన అనూష మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా పెళ్లి చేసుకోవాలనుకునే యువకులను పెళ్లి పేరుతో మోసం చేస్తుంది. ఒకరితో వివాహం అయిన తరువాత కొన్నాళ్ళు కాపురం చేసి, ఆపైన ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాన్ని ఎత్తుకెళ్లడం. ఆ తరువాత మరొకరిని పెళ్లి చేసుకోవడం. ఇలా అనూష ఇప్పటిదాకా నలుగురిని పెళ్లి చేసుకుంది. అయితే ఆమెను పెళ్లి చేసుకుని మోసపోయిన సుద్దాల రేవంత్ అనే బాధితుడు అనూష పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాంతో అనూష బండారం బయటికి వచ్చింది. పెద్దపల్లికి చెందిన రేవంత్‌కు మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా అనూషతో పరిచయం కలిగింది. పరిచయం పెరగడంతో వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే పెళ్లి జరగక ముందే అనూష అవసరం ఉందని అడగడంతో రేవంత్ రెండు లక్షల రూపాయలు ఆన్లైన్ లో పంపించాడు. 2022లో డిసెంబర్ 14న అనూష – రేవంత్ ల పెళ్లి జరిగింది. 70 వేల రూపాయల నగదు, నాలుగు తులాల బంగారం అనూషకు ఇచ్చాడు.
పెళ్లి అయిన తరువాత రేవంత్ తో 2 నెలలు కాపురం చేసిన తరువాత అనూష ఇంట్లోని డబ్బు, బంగారు నగలను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో అనుషను వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్లడంతో ఆమెకు ఇదివరకే 3 పెళ్లిళ్లు అయినట్లు తెలియడంతో రేవంత్ షాక్ అయ్యిమోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.































