ఏదో చేద్దాం అనుకున్నాడు… ఏదో అయ్యింది..? అసలు ఏం జరిగిందంటే..?

ఏదో చేద్దాం అనుకున్నాడు… ఏదో అయ్యింది..? అసలు ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

హైదరాబాద్‌ లోని ఒక ఇంటి యజమాని రోడ్డు ఎత్తు అవడంతో తన బిల్డింగ్ ను కొంచెం పైకి లేపాలని భావించాడు. అయితే ఆ ఇంటి యజమాని అనుకున్నది జరగలేదు సరికదా, మొత్తం ఇంటినే కూల్చేయాలని జీహెచ్ ఏంసి అధికారులు నిర్ణయించారు.

Video Advertisement

భవనం ఎత్తు పెంచడం కోసం చేసిన ప్రయత్నంలో ఆ బిల్డింగ్ గ్రౌండ్‌ ఫ్లోర్‌ దెబ్బతిని పక్కనే ఉన్న మరో బిల్డింగ్ పై వాలింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని చింతల్‌ లోని శ్రీనివాసనగర్‌ లో శనివారం నాడు రాత్రి జరిగింది. స్థానికుల నుండి  సమాచారం అందడంతో జీహెచ్ ఏంసి అధికారులు భవనాన్ని పరిశీలించి, ఇంటినే కూల్చేయాలని  నిర్ణయించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నాగేశ్వరరావు అనే వ్యక్తి 25 సంవత్సరాల క్రితం శ్రీనివాస్‌నగర్‌ లో ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే ఆ ఇంటి ముందు రోడ్డు ఎత్తు పెరగడం వల్ల వర్షాకాలంలో వరద నీళ్లు నాగేశ్వరరావు ఇంట్లోకి వస్తున్నాయి. దాంతో ఈ సంవత్సరం వరద నీళ్ళు తన ఇంట్లోకి రాకుండా అతను చర్యలు తీసుకోవాలను కున్నాడు. అందులో భాగంగా తన ఇంటిని ఎత్తును కొన్ని అడుగులు పెంచాలని భావించాడు. ఈ పనులను ఒక  కాంట్రాక్టర్ కు అప్పగించాడు.  హైడ్రాలిక్ జాకీలను ఉపయోగించి నాగేశ్వరరావు ఇంటిని మెల్లగా పైకి లేపడం ప్రారంభించారు. ఈ క్రమంలో హైడ్రాలిక్ జాకీలు పక్కకు జరిగాయి. దాంతో ఆ ఇల్లు పక్కనే ఉన్న మరో బిల్డింగ్ పైన  వాలింది.ఈ బిల్డింగ్ మొత్తం పక్కనే ఉన్న బిల్డింగ్ పైన వాలడంతో పక్క బిల్డింగ్ లో ఉన్న వారంతా భయంతో బయటకు పరుగెత్తారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన జీహెచ్ఎంసీ ఆఫీసర్లు నాగేశ్వరరావు ఇంటిని పరిశీలించారు. జాకీలు పక్కకు జరగడం వల్ల బిల్డింగ్ పక్కేన ఉన్న బిల్డింగ్ పైన వాలిందని ఆఫీసర్లు తెలిపారు. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే మరమ్మతులు చేపట్టడంతో పోలీసులు నాగేశ్వరరావు పై కేసు రిజిస్టర్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు నాగేశ్వరరావు బిల్డింగ్ ని కూల్చేయాలని నిర్ణయించారు.

Also Read: తెలంగాణ రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేసిన బట్టి పాదయాత్ర ! 100 రోజులు పూర్తి !


End of Article

You may also like