ఇంక “సౌందర్య” పాత్ర లేనట్టేనా..? అర్చన అనంత్ “కార్తీకదీపం”లో కనిపించకపోవడానికి కారణం ఇదేనా..?

ఇంక “సౌందర్య” పాత్ర లేనట్టేనా..? అర్చన అనంత్ “కార్తీకదీపం”లో కనిపించకపోవడానికి కారణం ఇదేనా..?

by Mohana Priya

Ads

ప్రస్తుతం టాప్ సీరియల్ ఏది అంటే అందరూ ఆలోచించకుండా చెప్పే సమాధానం కార్తీకదీపం. గత మూడు నాలుగు సంవత్సరాలుగా వస్తున్న ఈ సీరియల్ తెలుగు సీరియల్స్ లో టాప్ గా నిలిచింది. కార్తీకదీపం సీరియల్ లో హీరో హీరోయిన్ కి ఎంత క్రేజ్ ఉందో వారి తర్వాత అంత క్రేజ్ ఉన్నది సౌందర్య పాత్ర పోషించే అర్చన అనంత్ కి.

Video Advertisement

Karthika Deepam Soundarya real images

అర్చన ఈ సీరియల్లో కార్తీక్ కి తల్లి గా నటిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుండి అర్చన సీరియల్ లో కనిపించడం లేదు. అందుకు కారణం ఏంటో అని తెలియక సౌందర్య పాత్ర కనిపించడం లేదు ఏంటి అని సీరియల్ ప్రోమో విడుదల అయినప్పుడు యూట్యూబ్ లో కామెంట్స్ పెడుతున్నారు ప్రేక్షకులు.

Reason behind Archana Ananth not seen in Karthika deepam serial

అర్చన పాత్ర లేని లోటుని భర్తీ చేయడానికి క్యారెక్టర్ గా జ్యోతి రెడ్డి ని పరిచయం చేశారు సీరియల్ బృందం. ఈ పాత్ర కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.అయితే అర్చన కొంత కాలం విరామం తీసుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఏంటంటే అర్చనకి సినిమాల్లో అవకాశాలు రావడం.

Reason behind Archana Ananth not seen in Karthika deepam serial

కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అర్చన ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారట. ఈ కారణంగానే అర్చన కొన్నాళ్లు సీరియల్ కి దూరంగా ఉంటారు. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే అర్చన అనంత్ పోషిస్తున్న సౌందర్య పాత్ర లేకుండానే సీరియల్ నడుస్తోంది.


End of Article

You may also like