సాధారణంగా ఎక్కడైనా సరే కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని కారణాలు అడగకుండా చాలా మంది ఆచరిస్తూ ఉంటారు. ఎన్నో తరతరాల నుండి ఆ పద్ధతులు వారి జీవితంలో నాటుకుపోయి ఉంటాయి. కొన్ని పద్ధతులు చూసేవారికి వింతగా కూడా అనిపిస్తాయి. అయినా కూడా ఆచారాల విషయంలో మన భారతీయులు చాలా గట్టిగా ఉంటారు. కాలం ఎంత మారుతున్నా కూడా మన సంస్కృతికి విలువ ఇస్తారు. అలా ఒక ప్రాంతంలో ఒక పద్ధతి ఉంది.
అది వినడానికి చాలా వింతగా అనిపిస్తుంది. కానీ అది వారి ఆచారం. ఎన్నో సంవత్సరాల నుండి వాళ్లు ఇది పాటిస్తున్నారు. సాధారణంగా ఒక భార్య ఒక భర్తని మెప్పించాలి అంటే మంచి ఆహారం వండి పెట్టాలి అని అంటారు. ఆహారం ఎంత బాగా వండితే మనుషుల మీద అంత ప్రేమ ఉన్నట్టు అని అంటూ ఉంటారు. కానీ థారు తెగలో మాత్రం ఇందుకు కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే, భార్య తన భర్తకి కాలితో ఆహారాన్ని వండించాలి. వినడానికి చాలా వింతగా ఉంది కదా? కానీ ఇది నిజం. ఇది వారి ఆచారం.
సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని, అత్తవారింటికి వెళ్ళిన కొత్తల్లో, మొదటి రోజు స్వీట్ వండుతూ ఉంటారు. ఇది చాలా చోట్ల పాటిస్తూ ఉంటారు. అయితే థారు తెగకి చెందిన అమ్మాయిలు మొదటిసారిగా అత్తారింటి వాళ్ల కోసం వంట చేసి, కుటుంబ సభ్యులందరికీ చేత్తో వడ్డించి, కేవలం భర్తకి మాత్రం కాలితో వడ్డిస్తారట. కొంత మంది అయితే వడ్డించడం మాత్రమే కాదు. తమ భర్త కోసం వంటని కూడా కాలితోనే వండుతారట. సాధారణంగా కాలితో వడ్డించడం కానీ, వంట చేయడం కానీ చాలా కష్టం.
కానీ ఇలా చేస్తే తమ భర్తలపై తమకి ఎంత ప్రేమ ఉంది అనే విషయాన్ని అందరికీ తెలియజేసినట్టు అవుతుంది. అందుకే ఈ పద్ధతిని ఆచరిస్తూ ఉంటారు. వారు ఈ పద్ధతిని ఛాలా అని పిలుస్తారు. ఇందాక పైన చెప్పినట్టుగా, కొన్ని ఆచారాలు వినడానికి, చూడడానికి వింతగా అనిపించినా కూడా వారి సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవం ఇస్తూ చాలా మంది వీటిని పాటిస్తారు. ఈ పద్ధతి కూడా చాలా కొత్తగా ఉంది.
ALSO READ : బర్రెలక్క పెళ్లి పత్రిక చూసారా.? అందులో ఏం రాసుందంటే.? కాబోయే భర్తతో మొదటి వీడియో కూడా.!