కొన్ని కార్లపై 4×4 అని ఉంటుంది… ఎప్పుడైనా గమనించారా.? దాని అర్ధం ఏంటో తెలుసా.?

కొన్ని కార్లపై 4×4 అని ఉంటుంది… ఎప్పుడైనా గమనించారా.? దాని అర్ధం ఏంటో తెలుసా.?

by Mounika Singaluri

Ads

మనలో చాలామందికి సొంత కారులు ఉంటాయి. ప్రస్తుతం ప్రతి ఇంటికి ఒక కారు ఉండే పరిస్థితి వచ్చేసింది. అయితే చాలామందికి కారులో ఉండే స్పెసిఫికేషన్స్ గురించి తెలియకపోవచ్చు. కేవలం కారులో ప్రయాణించి జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుకున్నామ అని మాత్రమే చూస్తారు తప్ప మన కారు యొక్క పనితీరు గురించి, దాని విధివిధానాల గురించి ఎవరూ పట్టించుకోరు.

Video Advertisement

అయితే చాలా కార్లు వెనకాల మనం 4×4 అని రాసి ఉండడాన్ని చూస్తూ ఉంటాం. అయితే చాలామందికి ఇది ఎందుకు రాస్తారో తెలియదు. కొంతమంది అయితే కారుకి నాలుగు చక్రాలు ఉంటాయి కాబట్టి ఇలా రాస్తారని, లేదా 16 మంది కూర్చోవచ్చు అని పొరపాటుగా అనుకుంటారు. ఇప్పుడు వస్తున్న చాలా మట్టుకి suv కార్ల వెనకాల ఈ సంఖ్య ఉంటుంది. అయితే కొన్ని కార్లకి 4X2 అని కూడా ఉంటుంది. ఈ నెంబర్ల వెనకాల ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం…!

చాలా మటుకు చిన్నచిన్న కార్లకి టూ వీల్ డ్రైవింగ్ సిస్టం ఇస్తారు అంటే ఇంజన్ పవర్ కేవలం రెండు చక్రాలకు మాత్రమే అందుతుంది. వాటి వెనకాల మాత్రమే 4X2 అని ఉంటుంది. అయితే హై పవర్ కార్లకి పెద్దపెద్ద వాహనాలకు మాత్రం 4×4 అని ఉంటుంది. మనం తాజాగా వచ్చిన మహేంద్ర థార్ వెనకాల ఈ సంఖ్యను చూడవచ్చు. అంటే ఇటువంటి వాహనాలకి ఇంజన్ పవర్ నాలుగు చక్రాలకి సమానంగా అందుతుంది. ఇది ఎందుకంటే పెద్ద పెద్ద ఘాట్ రోడ్లు ఎక్కేటప్పుడు కొండ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు నాలుగు చక్రాల సపోర్ట్ అనేది చాలా అవసరం. అందుమూలంగా కార్ల శక్తిని తెలియజేసేందుకు గుర్తుగా ఈ నెంబర్ ను వెనకాల ఉంచుతారు.


End of Article

You may also like