సాధారణంగా మనిషికి ఓర్పు తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఓర్పు ఎక్కువగా ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి తగ్గిపోతుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఓపికగా ఎదురు చూడాలి. అందులో ఒకటి ఏటీఎం. ఏటీఎం కి వెళ్లి డబ్బులు తీసుకురావడం ఒక్కొక్కసారి సులభంగా అయిపోయినా కూడా ఒక్కొక్కసారి చాలా సమయం పడుతుంది. దానికి కారణం జనాలు ఎక్కువ మంది ఉండటం అవ్వచ్చు. లేదా ఎటిఎం పని చేయకపోవడం లాంటి సమస్య వచ్చినప్పుడు వేరే ఎటిఎం కి వెళ్లాల్సి రావచ్చు.
ఇలా చాలా కారణాల వల్ల ఏటీఎం లో క్యాష్ విత్ డ్రా చేసుకోవడానికి, డిపాజిట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఏదేమైనా పని ముఖ్యం కాబట్టి కచ్చితంగా పని అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే. అయితే మనలో చాలా మంది డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత చేసే ఒక పని ఏంటంటే, రిసిప్ట్ ని పడేయడం. కానీ ఆ రిసిప్ట్ ని పడకుండా జాగ్రత్తగా దాచుకోవాలట. ఎందుకంటే.
కొన్ని కొన్ని సార్లు మనం డబ్బులు డ్రా చేసే ప్రాసెస్ అంతా అయిన తర్వాత డబ్బులు మన చేతికి రావు. కానీ మన అకౌంట్ లో బ్యాలెన్స్ కట్ అవుతుంది. అలాంటప్పుడు సమస్య పరిష్కరించుకోవడానికి బ్యాంకు కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్న ఈ రిసిప్ట్ తో మనం కంప్లైంట్ ఇవ్వచ్చు.
డబ్బులు డ్రా చేసిన తర్వాత వచ్చే రిసిప్ట్ మీద మన బ్యాంక్ డీటెయిల్స్ తో పాటు మన అకౌంట్ డీటెయిల్స్, మనం ఎంత డ్రా చేశాము, ఇంకా మన ఎకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయి అనే వివరాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కువ డబ్బులు డ్రా చేసిన తర్వాత మనం రిసిప్ట్ ఎక్కడైనా పడేస్తే ఎవరైనా దొంగలు చూసి మన దగ్గర ఉన్న డబ్బు కోసం ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి.
ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడి నుంచైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు హ్యాకర్స్. ఒకవేళ ఈ రిసిప్ట్ హ్యాకర్స్ కి దొరికితే, అందులో ఉన్న సమాచారాన్ని డీకోడ్ చేసి బ్యాంక్ ఎకౌంట్ కి సంబంధించిన వివరాలు అన్నీ తెలుసుకొని డబ్బులు తీసుకునే ప్రమాదం ఉంది. అందుకే రిసిప్ట్ ని పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి.
అంతే కాకుండా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కు మొబైల్ నెంబర్ లింక్ చేసే సౌకర్యం వచ్చింది కాబట్టి. పేపర్ రిసిప్ట్ ప్రిఫర్ చేయకుండా, మొబైల్ నెంబర్ ని ఎకౌంట్ కి లింక్ చేసుకుంటే బ్యాంక్ ఎకౌంట్ కి సంబంధించిన పనులు అంటే డబ్బులు విత్ డ్రా చేయడం, లేకపోతే డిపాజిట్ చేయడం లాంటివి చేసినప్పుడు ఆ వివరాలు అన్నీ మీ మొబైల్ కి వస్తాయి. వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి.