రైలు ప్రయాణం లో మనలో చాలా మంది విండో సీట్ కావాలని అనుకుంటాం. అందుకే ఒకవేళ మళ్లీ ఆలస్యమైతే దొరకదేమో అని ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాం. కానీ బుక్ చేసిన తర్వాత మనకు విండో సీట్ రాదు. ఇలా మీ ఒక్కరికే అవుతుంది అనుకుంటే పొరపాటే. మనలో చాలామందికి మనం బుక్ చేసుకున్న సీట్ రాదు. ఎందుకంటే.
విండో సీట్ లోయర్ బెర్త్ ని సూచిస్తుంది. మధ్యలో ఉన్న సీట్ మధ్యలో ఉన్న బెర్త్ ని సూచిస్తుంది. అదేవిధంగా అన్నిటికంటే పైన ఉన్న సీట్ మొదటి బెర్త్ ని సూచిస్తుంది. కాబట్టి ఎవరైనా రైల్వే వెబ్సైట్ నుంచి టికెట్ బుకింగ్ చేసుకుంటే లోయర్ బెర్త్ వృద్ధులకు కేటాయిస్తుంది.
అలా వృద్ధులకు కింద ఉన్న బెర్త్ కేటాయించడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే సాధారణంగా చాలావరకు వృద్ధులు కొంచెం ఎక్కువ బరువు ఉంటారట. బరువు కలవారు లోయర్ బెర్త్ లో కూర్చుంటే ట్రైను చక్రాల కి భూమికి మధ్య గ్రావిటీ అనేది సరిగ్గా ఉంటుందట.
సెంటర్ ఆఫ్ గ్రావిటీ కరెక్ట్ గా ఉండడంతో తో చక్రాల కి రైలు పట్టాల కి మధ్య గ్యాప్ అనేది రాదట. అప్పుడు ట్రైన్ లో బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ సమంగా ఉంటుంది. అందుకే లోయర్ బెర్త్ లో ఉన్న వాళ్ళ కంటే అప్పర్ బెర్త్ లో ఉన్న వాళ్ళ వయస్సు ఇంకా బరువు తక్కువ ఉండేలా చూసుకుంటారట.
మనకి ట్రైన్లో కూర్చున్నప్పుడు ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకంటే ట్రైన్ల లో ఉన్న కోచ్ ల యొక్క రెసొనన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సస్పెన్షన్ 1.2 హెర్ట్జ్ ఉండేలా తయారు చేశారట. ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ లో మానవ శరీరానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందట. అందుకే ట్రైన్ ఎక్కంగానే మనుషులు సౌకర్యంగా ఫీల్ అయ్యి నిద్ర పోతారట.