1720, 1820 , 1920 , 2020…ప్రతి 100 సంవత్సరాలకి ఓ సారి ప్రపంచాన్ని పీడించిన వ్యాధులు ఇవే.!

1720, 1820 , 1920 , 2020…ప్రతి 100 సంవత్సరాలకి ఓ సారి ప్రపంచాన్ని పీడించిన వ్యాధులు ఇవే.!

by Anudeep

Ads

2019 వరకు అంతా బాగుంది..బాగుంది అంటే కరోనా వైరస్ కలవరం లేదు.2020 జనవరిలో మెళ్లిగా స్టార్ట్ అయిన కరోనా వ్యాప్తి రెండు నెలల్లో ఒక్కసారిగా ప్రపంచం అంతా వ్యాపించింది. దాంతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. అయితే సోషల్ మీడియాలో వైరలవుతున్న ఒక టాపిక్ మాత్రం చాలా ఆసక్తిదాయకంగా ఉంది.. అదేంటంటే ప్రతి వందేళ్లకి ఒకసారి ఏదో ఒక మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది అన్నది విషయం..

Video Advertisement

ఇది యాధృచ్చికమో మరేదైనా కారణమో కాని , సరిగ్గా వంద సంవత్సరాలకు ఒక సారి ఒక్కో వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. దాని మూలంగా లక్షలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఒక్కో రకమైన వ్యాధి వెనుక వేరువేరు కారణాలున్నప్పటికి సరిగ్గా వందేళ్లకే రావడం అనేది చాలా మిస్టీరియస్గా  ఉంది. 2020లో కరోనా మాదిరిగానే 1720,1820,1920 సంవత్సరాల్లో ప్రపంచాన్ని పట్టిపీడించిన మహమ్మారుల గురించి చదవండి.

1720 – ప్లేగు వ్యాధి:

1720 వ సంవత్సరంలో మొదటిసారి ప్లేగు వ్యాధి ప్రపంచాన్ని చిన్నాబిన్నం చేసింది. ఈ వ్యాధి కారణంగా లక్షమందికి పైగా ప్రజలు మరణించారు.  ఎలుకల నుంచి వచ్చే ఈ వ్యాధి మొదటగా ప్రాన్స్ లో బయటపడింది. కేవలం ప్రాన్స్ నగరంలోనే 50 వేలమంది ప్లేగు వ్యాది బారిన పడి మరణించారు.సుమారు సంవత్సరం పాటు ఈ వ్యాధి దాని ప్రభావాన్ని చూపింది. ప్లేగు వ్యాది ప్రపంచాన్ని ఎంతలా భయపెట్టిందంటే ఊర్లకు ఊర్లే ప్లేగు వ్యాధి దాటికి కొట్టుకుపోయాయి. పూడ్చడానికి కష్టం అయి సామూహికంగా దహనాలు చేశారు.

1820 – కలరా

ఆ తరువాత అంటే వందేళ్ల తర్వాత 1820 వ సంవత్సరంలో కలరా సోకింది.  కలరా అనే మాట ఇప్పటికి మీరు వింటూనే ఉంటారు అప్పుడప్పుడు. మన దేశంలో కూడా కలరా ధాటికి వేలమంది చనిపోయారు.మొదటిసారిగా కలకత్తాలో కలరా కేసు బయటపడింది. కలరా కూడ లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నది.

1920-స్పానిష్ ఫ్లూ

1920 వ సంవత్సరంలో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని వణికించింది . సుమారు వందకోట్ల మంది ఈ ప్లూ బారిన పడితే కోటిమంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే అత్యధికమంది ప్రాణాలు తీసిన వైరస్ స్పానిష్ ప్లూనే..

2020-కరోనా

ఇప్పుడు 2020 కరోనా కరాళ నృత్యం చేస్తున్న విషయం మనకు తెలిసిందే.. 2019 చివర్లో చైనాలో స్టార్ట్ అయిన ఈ వ్యాది 2020జనవరిలో ఊపందుకుంది. ఇటలీ , అమెరికాల్లో లెక్కకు మించి మరణాలు. ప్రపంచదేశాలు అన్ని షట్ డౌన్ అయ్యాయి. కరోనాకి వ్యాక్సిన్ కనుగొనడంలో ప్రపంచ దేశాలన్ని తలమునకలయి ఉన్నాయి. వ్యాక్సిన్ ఇప్పట్లో వస్తుందనే నమ్మకం లేదు..కరోనా ఇంకెన్ని రోజులు విలయతాండవం చేస్తుందో అంతు చిక్కడం లేదు..

ఇదండీ ప్రతి వందేళ్లకి ఒకసారి వచ్చే మహమ్మారుల కథ..ఎలాగు మనం ప్రకృతికి అనుగునంగా నడుచుకోవట్లే అని ప్రకృతి తనంతన తానే బ్యాలెన్స్ చేస్తుందన్నమాట..


End of Article

You may also like