ప్రపంచ దేశాలన్ని అగ్రదేశాలకు భయపడితే, అగ్రదేశాలని కూడా భయపెట్టగల సత్తా ఉన్నది ఆ దేశం.. కాదు కాదు ఆ దేశ అధ్యక్షుడు.. అతనే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్.. అతడి గురించి, అతడి నియంత పరిపాలన గురించి చదువుతుంటేనే మనకు వెన్నులో వణుకొస్తుంటుంది. అలాంటి ఆ దేశ ప్రజలు ఎంత బిక్కుబిక్కు మంటు బతుకుతూ ఉండుంటారో.. సరే వారి గురించి వదిలేద్దాం.. అతడు ఎలా బతుకుతాడో తెలుసా.. ఐ మీన్ అతడి లైఫ్ స్టైల్ తెలిస్తే ఔరా అని ముక్కున వేలేసుకుంటాం..
ఎవరి లైఫ్ స్టైల్ గురించైనా మాట్లాడుకోవాల్సి వస్తే ఖరీదైన బంగ్లాల గురించో, తను తిరిగే లగ్జరీ కార్ల గురించో మాట్లాడుకుంటాం కాని కిమ్ లైఫ్ స్టైల్ కి వస్తే తిని తిండే, తాగే సిగరెట్ , మందు కూడా చాలా స్పెషలే.. ఉదయాన్నే లేచి కాఫీ తాగే అలవాటుందా..కాఫీ అంటే మీకు పిచ్చా.. మీరు తాగే కాఫీ రేటెంటుంది మహా అయితే పది ఇరవై రూపాయలకు మించి ఉండదు. ఏడాదికి ఒక వెయ్యి రెండు వేలేసుకోండి..కాని మనోడు తాగే కాఫీ ఖర్చు ఏడాదికి అక్షరాల ఆరు కోట్లు(6 కోట్లు). అది కూడా బ్రెజిల్ నుండి తెప్పించింది మాత్రమే.
కాఫీకే కోట్లు ఖర్చు చేసేవాడు భోజనం మామూలుది తింటాడా.. మనోడు భోజనం చేయాలంటే డెన్మార్క్ నుండి ఫ్రెష్ పంది మాంసం, ఇరాన్ నుండి చేపజన(గుడ్లు) ఉండాల్సిందే. ఆ చేప జన ఖరీదు 23 లక్షలు. కిమ్ భోజనప్రియుడే కాదు మందు ప్రియుడు కూడా.. అమెరికా రమ్ము, జర్మనీ వైన్ అవి కూడా కాస్ట్లీవి. ఒక్క బాటిల్ ధర 3లక్షలు.. ఈ లెక్కన నెలకి మందుకోసం పెట్టే ఖర్చు కోటిరూపాయలు.
కిమ్ కాల్చే సిగరెట్ ప్యాకెట్ ధర రూ. 3000 అయితే.. ఆ ప్యాకెట్ డిజైన్ చేయడానికి అయ్యే ఖర్చు 12000 .. ఆ ప్యాకెట్ ని ఆయన తన కొరకు మాత్రమే స్పెషల్ గా డిజైన్ చేయించుకుంటారు.. ఎవరైనా బట్టలు డిజైన్ చేయించుకుంటారు.. సిగరెట్ ప్యాకెట్ డిజైన్ చేయించుకోవడం ఏంటి అనిపిస్తుందా.. మరి అక్కడున్నది కిమ్..
ఖరీదైన గడియారాలు పెట్టుకోవడం ఈయన అలవాటు . ఒకసారి వాడింది మరో సారి వాడడు.దాంతో ఖరీదైన వాచెస్ ను ఎగుమతి చేసే స్విస్ సైతం ఉత్తర కొరియా కు వాచెస్ ను ఎగుమతి చేయడం ఆపేసిందట .ఎందుకంటే వాటి విలువను కిమ్ తగ్గిస్తున్నాడని వారి ఫీలింగ్. .. 100 కు పైగా లగ్జరీ కార్లు, ఒక ప్రైవేట్ జెట్ , 60 కోట్ల విలువ చేసే యాచ్ , 17 పెద్ద పెద్ద భవంతులు , ఒక ద్వీపం ఇవన్ని మనోడి ఖాతాలో ఉన్నవే.
కిమ్ కి ఉన్న మరో ప్రత్యేక అలవాటు ఖరీదైన గిప్ట్స్ ఇవ్వడం, ఇప్పటివరకు కిమ్ తన భార్యకు గిఫ్ట్ ఇవ్వడానికి కొన్న ప్రతి గిఫ్ట్ ఖరీదు పదిలక్షల పైనే. తన అవసరాలు తీర్చిన వారికి సైతం విలువైన గిఫ్ట్స్ ఇస్తుంటాడు. తన కంటూ స్పెషల్ గా ప్లెజర్ స్క్వాడ్ పేరుతో అందమైన అమ్మాయిల సైన్యం.. వీటన్నింటితో పాటు మనోడితో ఎప్పుడూ 130 మంది డాక్టర్స్ బృందం ఉంటుంది. డాక్టర్సెందుకు అనేనా మీ డౌట్ ఇన్ని అసాధారణ అలవాట్లున్నోడికి ఎప్పుడు ఏమవుతోంది తెలియదు కదా..