సాధారణంగా ఇండియా వాళ్లకి ఎవరితోనైనా కాంపిటీషన్ ఉంది అంటే అది అమెరికా వాళ్ళతో మాత్రమే. మనలో చాలా మందికి వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారో? వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందో? వాళ్ళు రోజు ఎలా ఉంటుందో? ఎలా ఆలోచిస్తారో? ఇలా చాలా మందికి వాళ్ల గురించి చాలా విషయాలు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. కానీ కొంత మంది మాత్రం “అవి కూడా వేరే దేశాలు అంతే. అక్కడ కూడా ఉండేది మనుషులే. మనుషులందరూ ఒకటే లాగా ప్రవర్తిస్తారు కాబట్టి వాళ్లు కూడా మన లాగానే ప్రవర్తిస్తారు”. అనే మైండ్ సెట్ తో ఉంటారు.

అసలు ఒకసారి చూసుకుంటే మనకి వాళ్ళకి పెద్ద తేడా ఉన్నట్టు అనిపించదు. ఇప్పుడు వాళ్ల వెబ్ సిరీస్, టీవీ సిరీస్ మనం కూడా చూస్తున్నాం. చాలా ఫేమస్ అమెరికన్ టీవీ షో అయిన ఫ్రెండ్స్ (F.R.I.E.N.D.S) కి ఇండియాలో కూడా అంతే పాపులారిటీ ఉంది. వాళ్ల సినిమాలను కూడా మనం ఎక్కువగానే చూస్తూ ఉంటాం. అలా టీవీ షోస్, సినిమాల ద్వారా, అలాగే అక్కడ ఉన్న మన ఫ్రెండ్స్ లేదా తెలిసినవాళ్లని అబ్జర్వ్ చేయడం ద్వారా, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మొత్తం కాకపోయినా కొంతవరకు ఐడియా ఉండే ఉంటుంది. అలా వాళ్లకి మనకి ఉన్న తేడా ఏంటో సరదాగా చెప్తూ, సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

#1

#2  #3 #4 #5 #6 #7 #8 #9 #10#11 #12