ఆ రోడ్లు స్ట్రెయిట్ గా వేయచ్చుగా.? అన్ని మలుపులు ఉండడానికి వెనకున్న కారణం ఇదే.!

ఆ రోడ్లు స్ట్రెయిట్ గా వేయచ్చుగా.? అన్ని మలుపులు ఉండడానికి వెనకున్న కారణం ఇదే.!

by Mohana Priya

Ads

సాధారణంగా రోడ్ అంటే స్ట్రైట్ గానే ఉంటుంది. అంటే మధ్యలో స్పీడ్ బ్రేకర్లు, టర్న్స్ ఉంటాయి. కానీ ఎక్కువ శాతం రోడ్డు మామూలుగానే ఉంటుంది. అలా అయితేనే రోడ్డు మీద వాహనాలు జాగ్రత్తగా వెళ్ళగలుగుతాయి. కానీ కొన్ని స్ట్రీట్స్ మాత్రం పెద్ద కర్వ్ తిరిగి ఉంటాయి. అంటే ఒకవేళ ఆ మలుపు మీద నుండి వెళ్ళాలి అంటే వాహనాన్ని 180 డిగ్రీస్ లేదా మామూలుగా టర్న్ చేసిన దానికంటే ఎక్కువగా టర్న్  చేయాల్సి వస్తుంది. అలాంటి వాటిని హెయిర్ పిన్ టర్న్స్ అంటారు.

Video Advertisement

అలా ఒక చోట 8 హెయిర్ పిన్ టర్న్స్ ఉన్నాయి. దాని పేరే లొంబార్డ్ స్ట్రీట్. ఇది శాన్ఫ్రాన్సిస్కోలో ఉంది.  ఈ లొంబార్డ్ స్ట్రీట్ లో ఉండే రోడ్ చాలా ఫేమస్. ప్రపంచం మొత్తంలో ఇలా ఒంపులు తిరిగి, ఎనిమిది షార్ప్ టర్న్స్ ఉన్న రోడ్ ఇదే. దూరం నుంచి చూస్తే అదేదో పజిల్  మధ్యలో ఉండే దారి లాగా అనిపిస్తుంది. కొంతమందికి అయితే సడన్ గా చూసినప్పుడు ఒక రకమైన ఫోబియా లాంటిది కూడా వస్తుంది. అసలు ఇలాంటి రోడ్ మీద వాహనాలు వెళ్తాయా అని అనిపిస్తుంది.

కానీ లొంబార్డ్ స్ట్రీట్ అలా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే. ఇది ఒక వన్ వే బ్లాక్ రోడ్. దీనిని రష్యన్ హిల్ మీద  1922 లో నిర్మించారు. కార్ల్ హెన్రీ దీని డిజైన్ ని సజెస్ట్ చేశారు. రోడ్ నిర్మించే క్రమంలో కొండలోని 27% తగ్గించారు. ఈ బ్లాక్ పొడవు 600 ఫీట్ ఉంటుంది. లొంబార్డ్ స్ట్రీట్ చాలా ఎత్తు మీద నిర్మించడంతో రోడ్ చాలా నిటారుగా ఉంటుంది.

అలాగే రోడ్ మలుపు ఉండే యాంగిల్ కూడా చాలా షార్ప్ గా ఉంటుంది. అందుకే వాహనాలు కంట్రోల్ స్పీడ్ లో వెళ్లడానికి వీలుగా రోడ్ ఇలా నిర్మించారు. ఈ కారణం చేత అలా నిర్మించిన లొంబార్డ్ స్ట్రీట్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో లైట్ల వెలుగులో ఈ స్ట్రీట్ ఇంకా అందంగా కనిపిస్తుంది.


End of Article

You may also like