దేశంలో ఉండే ఆర్థిక పరిస్థితులను బట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. ఆర్బీఐ ముద్రించే ప్రతి ఒక నోటు పై ప్రత్యేకమైన గుర్తింపు నంబర్‌తో పాటుగా కొన్ని రకాల గుర్తులను కూడా ముద్రిస్తుంది. వీటి వల్లనే ఒక నోటు నిజమైనదా, నకిలీదా అనేది గుర్తిస్తారు.
ఆర్బీఐ ఇటీవలే 2000 రూపాయల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుండి నోట్ల గురించి అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలివనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నప్పటి నుండి నోట్ల పై చాలా వార్తలు వస్తున్నాయి. అలా 500 రూపాయల నోట్లను కూడా ఉపసంహరించుకుంటున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. ఆర్బీఐ దాని పై స్పందించి, అది నిజం కాదని తెలిపింది.
ప్రస్తుతం స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలివనే వార్త నెట్టింట్లో వైరల్ అవడంతో ఆర్బీఐ తాజాగా వాటి గురించి క్లారిటీ ఇచ్చింది. జులై 27 ఇచ్చిన ప్రకటనలో ప్రస్తుతం ఉన్ననోట్లతో సమానంగానే స్టార్ గుర్తు ఉన్న నోట్లు కూడా చెల్లుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ స్టార్ గుర్తు బ్యాంక్ సీరియల్ సంఖ్యలో ఉంటుంది. అయితే, ఇప్పుడు ముద్రిస్తున్న కొత్త నోట్లలో స్టార్ గుర్తు ఉండదు.
ఈ గుర్తుతో నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఎందుకు ముద్రిస్తుందంటే, ఆ నోట్లు ఇతర నోట్లను స్థానంలో వచ్చినవి లేదా రీప్రింటెండ్ అయిన బ్యాంక్ నోట్లుగా గుర్తించడం కోసమే. చిరిగిన, పాడైన నోట్ల ప్లేస్ లో ముద్రించే నోట్లకు మాత్రమే నంబర్ సిరీస్‌లో స్టార్ గుర్తును పెట్టామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
Also Read: దయనీయ స్థితిలో తెలంగాణ యువతి… మంత్రికి లేఖ రాసిన తల్లి..! కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!