పునర్జన్మ ఉందా లేదా అనే దాని పై చాలా పరిశోధనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. కొందరు ఇది అపోహ కొట్టి పారేస్తే, మరి కొందరు ఇది నిజమే అని నమ్ముతున్నారు. మనిషి చనిపోయిన తరువాత ఆ ఆత్మ మరొక శరీరముతో మళ్ళీ జన్మిస్తుందని హిందువులు విశ్వాసం.
అయితే పునర్జన్మ ఉంటుంది అని సైన్స్ చెప్తోంది. దీని పై కొందరు శాస్త్రవేత్తల పరిశోధనలు జరిపారు. పునర్జన్మ ఉందని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనిషి గత జన్మకి సంబంధించిన గుర్తులు ఎలా ఉంటాయి? ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో ఎలా పుడతారు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మనిషి గత జన్మకి సంబంధించిన గుర్తులను కొంతమంది ఫిలాసఫికల్ సైంటిస్టులు కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి కనుగొన్నారు. వాటివల్ల పునర్జన్మ ఉందని చెబుతున్నారు.
1. డెజావు
ఏదైనా ఒక సంఘటన జరిగినపుడు మీరు కొత్తగా ఫిల్ అవడమో, లేదా ఏదైనా వాయిస్ విన్నప్పుడు లేదా మ్యూజిక్ విన్నప్పుడు లేదా కొత్త ప్రదేశాన్ని కానీ, కొత్త మనిషిని కానీ కలిసినపుడు మీ మనసులో ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ మొదలవుతుంది. ఈ ఫీలింగ్ నే డెజావు అంటారు. ఆ భావ కలిగితే మీకు గత జన్మ ఉందని అర్ధం.
2. విచిత్ర జ్ఞాపకాలు:
కొంతమంది పిల్లలకి కొన్ని విచిత్రమైన జ్ఞాపకాలు ఉంటాయి. కానీ వాళ్ళు వాటిని రాత్రిపూట వచ్చిన కలలుగా అనుకుంటారు. కానీ అవి వాళ్ళ గత జన్మకి సంబంధించిన గుర్తులు.
3. కలలు:
మీకు వచ్చే కలలలో అన్ని ఫాంటసీ కాదు. కొన్ని మీ గత జన్మకు సంబంధించిన క్లూస్.
4. ఫియర్స్ మరియు ఫోబియా:
అందరికి ఉండే సహజమైన భయాలు కాకుండా, కొందరు నీళ్లను, పక్షులను, నంబర్లను, మిర్రర్స్, మొక్కలను, కొన్ని రంగులను చూసి భయపడుతుంటారు. గత జన్మలో వాటివల్ల మరణం కలిగిందేమో అని అంటున్నారు.
5. విదేశీ కల్చర్ అంటే ఆకర్షణ:
కొంతమంది విదేశీ కల్చర్ కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. వారి దగ్గర డబ్బులు లేకపోయినా బ్రాండ్ వస్తువులు వాడుతూ, లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటారు. అంటే వీరు గత జన్మలో ఫారెన్ లో పుట్టి పెరిగి ఉండవచ్చు.
6. కోరికలు:
కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి. బుక్స్ చదవడం, కథలు రాయడం, సంగీతం అంటే ఇష్టపడుతారు. వాటిలో కొన్ని గత జన్మకు సంబంధించినవి కావచ్చు.
7. అన్ కంట్రోలబుల్ హాబిట్స్:
సాధారణంగా మనలో ఏదైనా బ్యాడ్ హాబిట్ ఉంటుంది. అది గోర్లు కొరకడం, కబుర్లు చెప్పడం, టీవి, ఫేస్ బుక్, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడడం. పునర్జన్మను నమ్మే వారు వీటిని గతజన్మకు సంబంధించినవిగా చెప్తారు.
8. బర్త్ మార్క్స్:
శరీరం మీద ఉండే కొన్ని మచ్చలు మనకు పునర్జన్మ ఉందని చెబుతాయని ఒక సంఘటన నిర్దారించింది. మహా రామ్ అనే అబ్బాయి తనను గత జన్మలో ఎవరో ఒక వ్యక్తి తనను గన్ తో కాల్చడని చెప్పాడు. దానికి గుర్తుగా ఆ అబ్బాయి చెస్ట్ పై ఒక మచ్చ ఉంది. ఆ స్టోరీ చెక్ చేసినపుడు మహా రామ్ అనే వ్యక్తి బుల్లెట్ తగిలి చనిపోయినట్టు ప్రూవ్ అయ్యింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు.
ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో ఎలా పుడతారంటే..
1. వివాహేతర సంబంధం:
ఎవరు అయితే ఇతరులతో అక్రమ సంబాధలు పెట్టుకుంటారో వాళ్ళని నరకలోకంలో బాగా శిక్షిస్తారు. ఆ తరువాత వారు వచ్చే జన్మలో తోడేలుగా, ఆ తరువాత రాబంధుగా, ఆ తరువాత పాముగా, ఆ తరువాత కొంగ పుడతారు.
2. పెద్దవారిని గౌరవించక పోవడం:
పెద్దవారిని గౌరవించని వారు వచ్చే జన్మలో కాకిగా పుడతారు. అలా కాకిగా పది ఏళ్లు బ్రతకాలి.
3. బంగారం దొంగిలించడం:
బంగారాన్ని దొంగతనం చేస్తే వ్యాస మహర్షి చెప్పినట్టుగా వచ్చే జన్మలో కీటకంగా పుడతారు. ఒకవేళ వెండిని దొంగతనం చేస్తే పావురంగా పుడతారు.
4. ఇతరుల వస్తువులు దొంగిలించడం:
ఇతరుల వస్తువులను దొంగతనం చేస్తే వచ్చే జన్మలో చిలుకగా పుడతారు. అలా వారి జీవితాంతం వరకు పంజరంలో ఉండాల్సి వస్తుంది.
5. ఇతరులను చంపడం:
ఇతరులను చంపితే వచ్చే జన్మలో గాడిదగా పుడతారు. వాళ్ళు జీవితాంతం వారి యజమానికి సేవ చేసుకుంటూ బ్రతకాలి.
మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే క్రింద ఉన్న వీడియోని చూడండి.
watch video:
Also Read: చంద్రయాన్-3 పంపడానికి ముహూర్తం ఎలా డిసైడ్ చేస్తారో తెలుసా..? దీని వెనుక ఉన్న కథ ఏంటంటే..?



















M సింబల్ లైఫ్ లైన్(జీవిత రేఖ), హెడ్ లైన్(తల రేఖ), మరియు హార్ట్ లైన్(హృదయ రేఖ) వల్ల ఏర్పడుతుంది. లైఫ్ లైన్ మణికట్టు నుండి పైకి విస్తరించి, హెడ్ లైన్ దాటి హార్ట్ లైన్ కు చేరుకుంటుంది, జీవిత రేఖ, తల రేఖ మరియు హృదయ రేఖతో వాలుగా ఉండే M సింబల్ ను ఏర్పరుస్తుంది. అరచేతి పై ఉండే M సింబల్ డబ్బు మరియు ప్రేమ అదృష్టాన్ని సూచిస్తుంది.
M సింబల్ ఉన్న వ్యక్తులు సాధారణంగా ఉన్నతమైన లక్ష్యం కలిగి ఉంటారు. తాము కన్న కలల కోసం కష్టపడి పని చేస్తారు. వారు అనుకుంటే తప్పక సాధిస్తారు. అందువల్ల, ఈ వ్యక్తులు తరచుగా విజయాన్ని సాధిస్తారు. అలాగే గుర్తింపును సంపాదించుకుంటారు. వీరు 40 ఏళ్ల లోపే పేరు ప్రతిష్టలను, డబ్బును పొందుతారు.
M గుర్తు ఉన్న వ్యక్తులు వ్యాపారంలో జన్మించిన మాస్టర్స్, వారు ఏమీ లేకుండా నిర్మించగలరు మరియు నాలుగు, ఐదు తరాలకు సరిపోయే గొప్ప సంపదను కూడబెట్టుకోగలరు మరియు మిలియనీర్స్ గా ఉంటారు. వీరు సహజంగా, ఉత్సాహంగా, కరుణతో, సృజనాత్మకంగా మరియు ఇతరులు విస్మరించిన సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటారు. వీరికి ఒక పనిని అప్పగిస్తే దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు.



కోరాలో “తెనాలికి ఆంధ్రా పారిస్ అనే పేరు ఎందుకు వచ్చింది?” అడిగిన ప్రశ్నకు
ఆరోజుల్లో ఈ విషయం గమనించిన ఆంధ్రాలో ఉండే బ్రిటిష్ కళాప్రియులు తెనాలిని ‘ఆంధ్రా పారిస్’ అని పిలిచే వారని అర్ధం అయ్యింది. తెనాలి ఒక ప్రాచీన చారిత్రక నగరం. తెనాలి పూర్వం కాలం నుండి కళలకు పుట్టిల్లు. ఎందరో కవులను, పండితులను, కళాకారులను ఇచ్చిన కళాకేంద్రం. శ్రీకృష్ణదేవరాయలవారి అష్టదిగ్గజ కవులలో ఒకరిగా ప్రసిద్ది చెందిన వికటకవి తెనాలి రామకృష్ణుడి గురించి అందరికి తెలిసిందే.
తెలుగు సినీ పరిశ్రమలో తొలి హీరో గోవిందరాజుల సుబ్బారావుగారు, తొలి హీరోయిన్ కాంచనమాల కూడా తెనాలి వారే. కృష్ణ, సావిత్రి, గుమ్మడి వెంకటేశ్వరరావు, జమున, శారద, జగ్గయ్య, రమాప్రభ, దివ్యవాణి, ఎవియస్, శివపార్వతి లాంటివారు చాలా మంది తెనాలి, తెనాలి చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి వచ్చినవారే’ అని వివరించారు.
1. ఎర్త్ హ్యాండ్:
2. ఫైర్ హ్యాండ్:
3. ఎయిర్ హ్యాండ్:
4. వాటర్ హ్యాండ్:
ఈ నాలుగు హ్యాండ్స్ లో ఎవరు బెస్ట్ అంటే అరచేయి ఎయిర్ మరియు ఫైర్ రకాలకు చెందినవారు. వీరికి చేసే పనుల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అర్ధం. వీరి శక్తి సామర్ధ్యాలకు తిరుగు ఉండదు. ఎంతో ఉన్నతమైన విజయాలను అందుకుంటారు.
ఒక ఆరేళ్ల బాబు రోజు తాను చేయాలనుకున్న పనులతో ఒక టైం టేబుల్ ను తయారుచేసుకున్నాడు. దానిలో ఆడుకోవడానికి, చదువుకోవడానికి, తినడానికి ఇలా అన్ని పనులకి సమయం కేటాయిస్తూ రాసుకున్న టైం టేబుల్ ను ఆ పిల్లాడి బంధువు ఒకరు సామాజిక మాధ్యమంలో షేర్ చేయడంతో ఆ టైం టేబుల్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
లైబా అనే ట్విటర్ యూజర్ తన ఖాతాలో ఆ పిల్లాడి టైం టేబుల్ ను పోస్టు షేర్ చేశారు. టైం టేబుల్ ను చూసిన వారు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఆ ఆరేళ్ల పిల్లాడు తన క్రియేటివీటితో 24 గంటల దినచర్యకు సంబంధించిన టైమ్ టేబుల్ తయారుచేసుకున్నాడు. అందులో ఈ పిల్లాడు చేయాల్సిన అన్ని పనులకు ఎక్కువ సమయంను కేటాయించాడు. కానీ చదువుకునేందుకు మాత్రం 15 నిముషాలే కేటాయించాడు. ఈ విషయమే అందరిని నవ్విస్తోంది.
ఆ పిల్లాడు టైమ్ టేబుల్లో నిద్ర లేచిన దగ్గర నుండి వాష్రూమ్, బ్రేక్ఫాస్ట్, స్నానం చేసే సమయం, టీవీ టైమ్, లంచ్, ప్లే విత్ రెడ్ కార్, అత్త ఇంటికి వెళ్లే సమయం నిద్రించే సమయం అంటూ అన్నింటికీ ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. కానీ చదువుకునేందుకు 15 నిముషాలు మాత్రమే కేటాయించాడు. ఇక ఈ పోస్టుకు ఇప్పటి దాకా 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.