చేతివేళ్లు ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా ఉంటాయి. కొందరికి చేతివేళ్లు పొడవుగా ఉంటే, మరికొందరికి పొట్టిగా ఉంటాయి. కొందరికి అదనంగా మరొక వేలు ఉంటుంది. చేతివేళ్ళ పొడవు మరియు ఆకారం కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రొఫెషనల్ హ్యాండ్ రీడర్‌ ల ప్రకారం చేతివేళ్ళు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, అభిరుచులను తెలుపుతాయని అంటున్నారు.

Video Advertisement

చేతివేళ్ళ మధ్యన ఉండే గ్యాప్ ఎన్నో విషయాలను తెలుపుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తున్నారు. ప్రొఫెషనల్ హ్యాండ్ రీడర్‌లు చేతివేళ్ళ మధ్య ఉండే ఖాళీలను ‘ఎథెరియల్ హ్యాండ్ స్పేస్‌లు’గా సూచిస్తారు. మరి చిటికెన వేలు, ఉంగరం వేలు మధ్య గ్యాప్ ఉన్న ఆడవారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
చిటికెన వేలు అయితే వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతలను ఎంతో క్లియర్ గా చెబుతుందని అంటున్నారు. చిటికెన వేలు, ఉంగరం వేలు మధ్య ఖాళీ ఉంటే, వీరు చేసే పనులలో చాలా స్వతంత్రంగా ఉంటారట. ఈ వేళ్ళ మధ్య గ్యాప్ వల్ల చిటికెన వేలు మిగతా నాలుగు వేళ్ళకు దూరంగా ఉంటుంది. అలాగే ఆ వ్యక్తులు కూడా అందరిలో ఒకరిగా కాకుండా స్వతంత్ర ఉండేట్టు నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి విషయాలలోనైనా ఈ వ్యక్తులు స్వంతంగా  ముందుకు వెళతారు.
ఈ వ్యక్తులు కొంత వ్యక్తిగత మరియు స్వతంత్ర మార్గంలో స్వీయ వ్యక్తీకరణకు బలమైన అంతర్గత అవసరాన్ని కలిగి ఉంటారు. అయితే చిటికెన వేలు ఉంగరపు వేలును తాకినట్లయితే అంటే గ్యాప్ ఎంత తక్కువగా ఉంటే, ఆ వ్యక్తి ఎదుగుదలను అతని పైన వారు అంత ఎక్కువగా నిరోధిస్తుంటారట. వీరు జీవితంలో ఏ విషయాన్ని అయినా వ్యక్తం చేయడానికి ఇబ్బంది పడుతుంటారట. అయితే ఆడవారికి చిటికెన వేలు మరియు ఉంగరం వేలు మధ్యన గ్యాప్ ఉంటే వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీరు అధికారం చెలాయించే పొజిషన్ లో ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

Also Read: బొటన వేలు ఇలా ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే ఏం అవుతుందో తెలుసా..?