ఎన్నో శాస్త్రాలు, అనేక రకాల పద్ధతులు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి అనేక మార్గాలను చూపిస్తుంది. వాటి ఆధారంగా మనిషిలోని లక్షణాలను, వారి భవిష్యత్తును అంచనా వేస్తూ ఉంటారు.

Video Advertisement

మనిషి బొటనవేలును బట్టి ఆ వ్యక్తి ఎలాంటివరో తెలుసుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బొటనవేలును గమనించినట్లయితే అది ముడు రకాల ఆకారాలలో ఉంటుంది. అవి ఏమిటో? వారి వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక మనిషి యొక్క బొటనవేలు ఉన్న ఆకారం మరియు దాని పరిమాణం వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మరియు లక్షణాల గురించి చెబుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరి వేళ్ళ ఆకారం, పరిమాణం భిన్నంగా ఉంటుంది. బొటనవేలు మూడు రకాలుగా ఉంటుంది. బొటన వేలు ఆకారాన్ని బట్టి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో నిపుణులు చెబుతున్నారు.
1. నిటారుగా ఉండే బొటనవేలు: 

నిటారుగా ఉండే బొటనవేలు, లేదా ఒక వంపు లేకుండా పొడవుగా ఉంటుందో వారు వంద శాతం ప్రొఫెషనల్ గా ఉంటారట. అయితే వీరికి ఇగో కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తులు వారు అనుకున్న రంగంలో ఎంతో క్రమశిక్షణతో విజయాన్ని సాధిస్తారు. వీరికి తాము చేసే పని పై ఎంతో అంకితభావం, తపన ఉంటుంది.  ఇవి వీరికి ఉన్నంతగా మరెవరికి ఉండవు. వీరి ముఖ్య లక్షణం ఏమిటంటే సంఘంలో పేరు ప్రతిష్టలు, డబ్బుని సంపాదించడం. ఈ వ్యక్తులు తమ గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించరు.

జీవితంలో అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు. వీరు కెరీర్ లో ఉన్నతమైన సంస్థలలో, ఉన్నతమైన పదవులను పొందుతారు. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. వీరు పిల్లలను ఎంతో క్రమశిక్షణతో పెంచుతారు. అయితే బంధువులతో కానీ, సన్నిహితులతో కానీ మంచి సంబంధాలు ఉండవు.

2. వెనుక భాగం వక్రంగా ఉండే బొటనవేలు: 

మీ బొటనవేలు వంకరగా ఉంటే, వీళ్ళు ఎవర్ గ్రీన్ గా ఉంటారు. జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటే ఇలాంటి వ్యక్తులతో స్నేహం అయినా, పెళ్లి అయినా చేసుకోవచ్చు. వీరు ఇంద్రియాలను నియంత్రించడంలో  ప్రత్యేక నైపుణ్యం ఉంటుందట. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటికి అనుగుణంగా మారుతారు. సమస్యలను పరిషకరిస్తూనే మరో వైపు కొత్త దారులను వెతికే ధోరణి కలిగి ఉంటారు.
వీరు చాలా నేర్పుగా ఫ్యామిలీ లైఫ్ ను , చాలా తెలివిగా ప్రొఫెషనల్ లైఫ్ ను సాగిస్తారు. వీరు ఏ పని చేసిన ఇతరులు ఆకర్షితులు అవుతారు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళతారు. ఎంతో నిజాయితీగా ఉంటారు.

3. ఎక్కువగా వంగి ఉన్న బొటనవేలు: 

వీరికి ఇగో కానీ గర్వం కానీ ఏమాత్రం ఉండవు. కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి క్లిష్టపరిస్థితిని అయిన వీరు ఎదుర్కొంటారు. మొదటి రెండు రకాల వారిలా ఉండకుండా చాలా గంభీరంగా ఉంటారు. వీరికి సిక్స్త్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పరిస్థితిని ముందుగానే అంచనా వేయగలుగుతారు.
ప్రపంచాన్ని వీరు డీఫెరెంట్ కోణంలో చూస్తారు. వీరి ముఖ్య లక్షణం జీవితంలో డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా అవార్డులు, రివార్డులు సాధించడం కూడా. ఇతరులకు సహాయ చేసినా కూడా గోప్యంగా ఉంచుతారు. వీరిని ప్రేమించినవారికి ప్రాణం కూడా పెడతారు. వీరికి దైవ భక్తి ఎక్కువ.

Also Read: కాలి బొటన వేలు కంటే రెండో వేలు పొడుగ్గా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా.?