IRCTC, దాని అనుబంధ సంస్థలు నిర్వహిస్తున్న సెంట్రల్ మెగా కిచెన్లలో ఒకటైన నోయిడా లోని కిచెన్ లో రోజుకు 10,000 భోజనాలు సిద్ధం అవుతున్నాయి . రైళ్లలో మాత్రమే కాకుండా ఢిల్లీ లోని పలు కార్పొరేట్ సంస్థలకు కూడా ఇక్కడి నుంచి ఆహారాన్ని అందిస్తారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
నాలుగు అంతస్తుల్లో నెలకొని ఉన్న ఈ కిచెన్ లో రోజుకు 10,000 భోజనం, 6,000 స్నాక్ ప్యాకెట్లను తయారు చేస్తారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఆర్డర్లను సరఫరా చేయడానికి 120 మంది రాత్రి 11 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టులలో పని చేస్తారు. వారిలో 67 మంది మాత్రమే వంటగది లో ఉంటారు. ఉదయం 4:30 గంటలకే అల్పాహారాన్ని తయారు చేస్తారు. ఆ తర్వాత 6:30 గంటలకు కూరలు వండి సిద్ధం గా ఉంటాయి. అయితే ఈ ఆర్డర్లను తగిన సమయం లో అందించేందుకు యూరోపియన్ మెషిన్లు ముఖ్య పాత్రని పోషిస్తాయి.

కూరగాయలను ముక్కలు చేసేందుకు, బియ్యం, పప్పును ఉడికించేందుకు ఫిన్లాండ్ నుండి వచ్చిన స్టీమ్ కెటిల్స్ 150 లీటర్ల బియ్యం, పప్పు లేదా సూప్‌ను కేవలం 40 నిమిషాల్లో చేస్తాయి. అలాగే సబ్జి ని వండేదుకు ఫ్రాన్స్ నుంచి ఒక యంత్రం, చపాతీ పిండిని పిసికి, కలిపేందుకు ఇటాలియన్ డౌ మేకర్ ఒకేసారి 25 కిలోల గోధుమ పిండిని పిసికి కలుపుతుంది.. తర్వాత రోటీలను చేసేందుకు భారత్ లో తయారు చేసిన రోటి మేకర్ ఉంది. ఇది మొదట పిండిని 50 గ్రాముల బంతులుగా కట్ చేసి, ఆపై వాటిని ఫ్లాట్‌గా రోలింగ్ చేసిన తర్వాత ప్రతి గంటకు 1,400 బ్రౌన్డ్ చపాతీలను చేస్తుంది.

వీటన్నిటిని ఆపరేటర్లు నిర్వహిస్తారు. చపాతీలు కూడా వెన్నతో చేసి ఫాయిల్స్ లో చుడతారు. అలాగే ఒక యంత్రం లో శాండ్విచ్ లు చేస్తారు. బ్రాడ్ ముక్కలు చేయడానికి, వెన్నను వేయడానికి, చీజ్ ముక్కలు వేయడానికి, శాండ్విచ్లను కత్తిరించడానికి మరియు వాటిని ప్యాక్ చేయడానికి స్టేషన్లు ఉన్నాయి. అలాగే 6,000 స్నాక్స్, స్వీట్స్ ని తయారు చేస్తారు. వీటిలో కచోరీలు, లడ్డూలు, బ్రెడ్‌స్టిక్‌లు, మాల్పువాలు, రసగుల్లాలు గులాబ్ జామూన్లు ఉన్నాయి.

అలాగే తయారు చేసిన ఆహార పదార్థాలను చెక్ చేసేందుకు ల్యాబ్ ఉంది. ఏదైనా తప్పుగా కనిపిస్తే, మొత్తం బ్యాచ్‌ని వెంటనే రీకాల్ చేస్తారు అని IRCTC మార్కెటింగ్ మేనేజర్ తెలిపారు. ఇక్కడ తయారు చేసిన భోజనం సాధారణం గా 50-70 రూపాయలు ఉంటుంది. ట్రైన్స్ లో ముందుగా సెట్ చేసిన మెనూ నే తయారు చేస్తారు. కానీ కార్పొరేట్ సంస్థల మెనూ వారానికొకసారి మారుస్తారని అధికారులు తెలిపారు. చైనీస్, కాంటినెంటల్, సౌత్ ఇండియన్ బోజనాలను వారికి అందిస్తారు. అలాగే ముడి పదార్థాలు గ్రౌండ్ ఫ్లోర్‌లోని స్టోర్ రూమ్‌లో నిల్వ చేస్తారు. కూరగాయలు మరియు పండ్లు వంటి వాటిని ముందుగా శుభ్రం చేసి పై అంతస్తుకి పంపుతారు. వీటిని శుభ్రం చేసేందుకు క్లోరిన్ ని వాడతారు.



ఇంకొందరు ఇంట్లో ఉన్నా కొన్నిసార్లు రెస్టారెంట్స్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని తింటున్నారు. వేలకు వేలు బిల్లులు అయినా కూడా కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి తింటుంటారు. కాగా, డిల్లీలోని లజపత్ నగర్ లో ఉండే లజీజ్ రెస్టారెంట్ 1985 డిసెంబర్ 20 నాటి బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ బిల్లును చూసిన వారు షాక్ అవుతున్నారు.
ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే, అది ఒక రెస్టారెంట్ బిల్లు, అందులో ఓ కస్టమర్ ఒక ప్లేట్ దాల్ మఖనీ,షాహిపన్నీర్, రైతా మరియు కొన్ని చపాతీలు ఆర్డర్ చేసారు. అయితే మొదటి రెండు వంటకాలకు(దాల్ మఖనీ, షాహిపన్నీర్) 8 రూపాయలు, మిగతా రెండింటికీ 5, 6 రూపాయలు. ఆశ్చర్యానికి గురి చేసేటు వంటి విషయం మొత్తం బిల్లు కేవలం 26 రూపాయలు. అంటే అప్పట్లో బిల్లులు చాలా తక్కువ. ప్రస్తుత ధరతో పోలిస్తే ఒక చిప్స్ ప్యాకెట్ రేటుకి సమానం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ పోస్ట్ 2013 ఆగస్టు 12న ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరలయ్యింది.




























