మంచి అలవాట్లను అలవాటు చేసుకోవడం చాలా కష్టం. అదే చెడు అలవాటు చేసుకోవాలంటే చాలా సులువుగా అలవాటు అయిపోతుంది. ఒక్కోసారి మనం కొన్ని చెడు అలవాట్లకు బానిస అయిపోతాం . అది మానసిక ఒత్తిడి వలన కావచ్చు, ఇతర సమస్యల వలన కావచ్చు. ఆ చెడు అలవాటు నుంచి బయటపడటానికి ఎంతో కష్టపడుకుంటాం.
మెరిసేదంతా బంగారం కాదు అన్నది ఎంత నిజమో.. చెడు అలవాట్లు అన్ని చెడునే కలిగించావు అనేది కూడా అంతే నిజం. మనం తెలుసుకునే విషయం ఏమిటంటే ఈ 10 చెడు అలవాట్లు నిజానికి మంచి చేస్తాయి. మరి మంచి చేసే చెడు అలవాట్లు ఏంటో మీరు కూడా ఒకసారి తెలుసుకోండి..
#1. గోళ్ళు కొరకడం :

గోళ్ళు కొరకడం అనే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఒక్కోసారి మానసిక ఒత్తిడి వలన వాళ్లకు తెలియకుండానే గోళ్ళు కొరికేస్తుంటారు. కానీ గోళ్ళు కొరకడం వల్ల కూడా మంచి జరుగుతుందని మీకు తెలుసా.. కొన్ని పరిశోధనల ప్రకారం గోళ్ళు కొరకడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలియజేస్తున్నారు వైద్యనిపుణులు.
#2 ముక్కులో వేలు పెట్టి తిప్పడం:

కొందరు ప్రతిసారీ ముక్కులో వేలు పెట్టి తిప్పుతుంటారు. ఇది చూడటానికి చాలా అసహ్యంగా ఉండే చెడు అలవాటు. దీనివలన మంచి జరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అవి ఏమిటంటే ఎలర్జీలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయని వెల్లడించారు.
#3.అటు ఇటు కదలడం :

ప్రస్తుతకాలంలో ఉరుకుల పరుగుల జీవితాలు మనుషులవి. స్థిరంగా ఒక గంట కూడా కదలకుండా ఉండలేరు. కానీ ఇదే మనకు మంచి చేస్తుంది. అటూ ఇటూ కదలడం వల్ల శరీరంలో న్యూరో కెమికల్స్ ను ప్రేరేపించి జీవక్రియను వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా పని ఒత్తిడి తగ్గించుకోడానికి కూడా ఉపయోగపడుతుంది.
#4. వీడియో గేమ్స్ ఆడటం :

నూటికి 90 శాతం వీడియోగేమ్స్ ఆడనివారు అంటే ఉండరు. వీడియో గేమ్స్ ఆడటం వల్ల చేతికి కంటికి మధ్య కోఆర్డినేషన్ పెరుగుతుంది. వీడియో గేమ్స్ ఆడే వారిలో ఎలాంటి చాలెంజ్ నైనా స్వీకరించే శక్తి కలిగి ఉంటారు. మొదలుపెట్టిన పనిని విజయం సాధించే వరకు వదలరు. వీడియో గేమ్స్ ఆడే వాళ్ళు ఆలోచన శక్తి మామూలు వ్యక్తి కన్నా చాలా వేగంగా ఉంటుంది.
#5. గ్యాస్ వదలడం :

ఇది మనం ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్న ఆపుకోలేని చెడు అలవాట్లలో ఒకటి. గ్యాస్ వదలడం అనేది అదుపు చేసుకోవడం వలన మన ఆరోగ్యంపై ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుంది. గ్యాస్ అదుపులో పెట్టుకోవడం హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన పొట్టలో ఏర్పడిన గ్యాస్ ఎప్పటికప్పుడే వదిలేయడం మంచిది. దీనివలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
#6. మెటికలు విరవడం :

ప్రతి ఒక్కరు లో ఎక్కువగా ఉండే అలవాటు చేతి వేళ్లను విరవడం. చేతి వేలు విరగడం వలన కీళ్ల నొప్పులు అనేవి తగ్గుతాయి.
#7. చూయింగ్ గమ్ నమలడం:

కొంతమంది ఎక్కువగా చూయింగ్ గమ్ నములుతుంటారు. ఆ అలవాటు అనేది ఎదుటివారికి అసహ్యంగా అనిపిస్తుంది. కానీ ఈ అలవాటు అనేది మనకి మంచి చేస్తుంది. చూయింగ్ గమ్ నమలడం వలన బ్రెయిన్ పవర్ మెరుగవుతుంది. అంతే కాకుండా ఆకలిని అదుపు చేస్తుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. చూయింగ్ గమ్ నవ్వడం వలన బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి.
#8. పగటి కలలు కనడం :

చాలా మంది పగటిపూట నిద్రపోతూ కలలుకంటుంటారు. ఇలా చేయడం వల్ల మీ సమయం వృధా అవుతుంది అని అంటూ ఉంటారు. కానీ దీని వలన మనకు ఈ దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఎందుకంటే పగలా పూట నిద్రపోయేవారిలో బ్రెయిన్ సెల్స్ ఎంతో యాక్టివ్ గా ఉంటాయి.
#9. ఆలస్యంగా నిద్రలేవడం :

మనలో చాలా మందికి ఉదయాన్నే లేచి అలవాటు తక్కువ. ఆలస్యంగా నిద్రలేవడం అనేది చెడు అలవాటు. కానీ ఈ సరిపోయినంత నిద్ర పోవడం అనే అలవాటు మనసులోని టెన్షన్ ను తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంచడానికి, మనిషి ఆయుష్షును పెంచుకోవడానికి సహాయపడుతుంది. నిద్ర అనేది సరిగ్గా లేకపోతే అనవసరమైన ఒత్తిడి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి.
#10. గాసిప్స్ వినడం :

మనలో చాలా మందికి గాసిప్స్ వినడం అంటే ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అన్నిటికంటే అతి పెద్ద చెడ్డ అలవాటు ఇదే. ఇది కూడా ఒక విధంగా మనకు మంచి చేసే చెడు అలవాటు. ఎందుకంటే గాసిప్స్ వినడం ద్వారా తోటి వ్యక్తులతో స్నేహం కుదురుతుంది. గ్రూప్ కమ్యూనికేషన్ అనేది మెరుగవుతుంది. ఒత్తిడి, టెన్షన్ వంటివి తగ్గిస్తుంది.














































 ఓ సారి సత్రాజిత్తు వద్ద ఉన్న శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు చూస్తాడు. అది బాగుందని.. తనకు ఇవ్వమని అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. దీనితో.. కృష్ణుడు దాని గురించి మరిచిపోతాడు. ఓ రోజు సత్రాజిత్తు కు తెలియకుండా.. అతని తమ్ముడు ఆ మణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు. కానీ తిరిగి రాలేకపోతాడు. ఈ క్రమం లో మణి కోసమే శ్రీ కృష్ణుడు తన తమ్ముడిని హత్య చేయించి ఉంటాడు అని సత్రాజిత్తు భావిస్తాడు. ఇది క్రమం గా ప్రచారం అయ్యి కృష్ణుడి చెవిన పడుతుంది. వినాయక చవితి రోజున చంద్రుని చూడడం వల్లనే తనపై ఇటువంటి నీలాపనింద వచ్చిందని కృష్ణుడు తలుస్తాడు.
















