మనిషి అన్న తరవాత సహజంగా వచ్చే ఎమోషన్ ఏడవడం. ఒక మనిషికి ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా కానీ కంటిలో నుండి నీరు వస్తుంది. కొంత మంది అందరి ముందు ఏడవడం పెద్దగా ఇష్టపడరు. అలా ఎవరి ముందు అయినా ఏడిస్తే వాళ్ళు బలహీనులు అని అనుకుంటారు ఏమో అన్న భయం ఉంటుంది. అందుకే వారు ఒక్కరే ఉన్నప్పుడు ఏడుస్తారు.
కొంత మంది మాత్రం ఏడుపుని కూడా నవ్వు లాగానే ఒక ఎమోషన్ లాగా అనుకొని అందరి ముందు ఏడ్చినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే కళ్ళలో నుంచి నీళ్లు వచ్చిన ప్రతిసారి అది బాధ వలనే వస్తాయి అని అనుకోలేము. ఇది మనలో చాలా మందికి తెలుసు.
అయితే, మనం ఎలాగైతే వేరు వేరు ఎమోషన్స్ వచ్చినప్పుడు ఏడుస్తామో, అలా అలా ఆ ఎమోషన్ కి తగ్గట్టు కళ్ళలోంచి నీళ్ళు వచ్చే విధానం కూడా మారుతుంది. అంటే ఒక వ్యక్తి ఒక వేళ బాధలో ఉన్నప్పుడు మొదట వారి ఎడమ కంటి నుంచి కన్నీరు కారుతుంది.
అదే ఒకవేళ ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి ఆనందం భాష్పాలు వచ్చినప్పుడు మొదట కుడి కంట్లో నుండి కన్నీరు వస్తుంది. అదే ఒకవేళ వ్యక్తి కోపం లో ఉన్నప్పుడు మాత్రం రెండు కళ్ళలో నుండి కన్నీరు వస్తుంది. ఇలా సందర్భానికి తగ్గట్టుగా కంట్లో నుండి వచ్చే కన్నీరు కూడా వేరేగా ఉంటుంది.