చిరంజీవి, నాగబాబు, పవన్ అన్నదమ్ములు.. రాంచరణ్ చిరు కొడుకు, వరుణ్,నిహారిక  నాగబాబు పిల్లలు .. అల్లు అర్జున్, శిరీశ్ చిరు అల్లుల్లు, సాయిధరమ్ తేజ్ చిరు మేనల్లుడు , కళ్యాణ్ తేజ్ చిరు చిన్నల్లుడు ఇలా మెగాస్టార్ ఫ్యామిలి గురించి లిస్టు మొత్తం తెలుసు, అదే విధంగా బాలకృష్ణ ఫ్యామిలిలో ఇండస్ట్రీలో ఉన్న వారు, అక్కినేని కుటుంబ సబ్యులు కూడా తెలుసు..కాని మనకి తెలిసిన కొందరు నటుల మధ్య ఉన్న బంధాల గురించి మనకు చాలా తక్కువ తెలుసు.. సడన్ గా తెలియగానే అర్రే అవునా అనుకుంటాం..కొంతమంది నటులు వారిమధ్య బంధాలు గురించి చదవండి.

Video Advertisement

Also Read: ఒకప్పటి ఈ నలుగురు నటులు…ఇప్పుడు టాప్ MNC కంపెనీల్లో మంచి పొజిషన్ లో ఉన్నారని మీకు తెలుసా.?

ఐశ్వర్య రాజేష్   –  శ్రీలక్ష్మి

ఐశ్వర్య రాజేశ్ -  శ్రీలక్ష్మి

ఐశ్వర్య రాజేశ్ –  శ్రీలక్ష్మి

ఇటీవల కౌసల్యా క్రిష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ఐశ్వర్య అలనాటి నటుడు రాజేశ్ కూతురు..ఇంతకీ ఈ రాజేశ్ ఎవరో తెలుసా హాస్యనటి శ్రీలక్ష్మికి స్వయంగా తమ్ముడు..అంటే శ్రీలక్ష్మికి ఐశ్వర్య మేనకోడలు..

సుహాసిని – కమలహాసన్

సుహాసిని – కమలహాసన్

సుహాసిని – కమలహాసన్

నటి సుహాసినికి కమలహాసన్ స్వయానా బాబాయ్. సుహాసిని తండ్రి చారు హాసన్ కమల్ హాసన్ వాళ్ల పెద్దన్నయ్య. చారుహాసన్ కూడా నటుడిగా సుపరిచితమే.  సుహాసిని – మణిరత్నం భార్యాభర్తలు ఆ విషయం తెలిసిందే కదా.

రేఖ – సావిత్రి

రేఖ – సావిత్రి

రేఖ – సావిత్రి

రేఖకి సావిత్రి సవతి తల్లి అవుతారు. జెమిని గణేశన్, సావిత్రిల ప్రేమ, పెళ్లికంటే ముందే పుష్పవల్లి అనే మరోనటితో జెమిని గణేశన్ కి రిలేషన్ ఉంది. వారిద్దరికి పుట్టిన కూతురే రేఖ.

జివి ప్రకాశ్ – ఎఆర్ రెహమాన్

జివి ప్రకాశ్ – ఎఆర్ రెహమాన్

జివి ప్రకాశ్ – ఎఆర్ రెహమాన్

జివి ప్రకాశ్ , ఎఆర్ రెహమాన్ కి స్వయానా మేనల్లుడు. ఎఆర్ రెహమాన్ పెద్దక్క ఎఆర్ రెయ్హానా వాళ్ల కొడుకే జివిప్రకాశ్. జి.వెంకటేశ్ –ప్లేబాక్ సింగర్ ఎఆర్ రెయ్హానా వీరిద్దరి ఏకైక కొడుకు జివి ప్రకాశ్.

అరుణ్ విజయ్ – ప్రీతా- శ్రీదేవి

అరుణ్ విజయ్ – ప్రీతా- శ్రీదేవి

అరుణ్ విజయ్ – ప్రీతా- శ్రీదేవి

రుక్మిణి ,క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాల్లో నటించిన ప్రీతా మనకి ప్రీతిగా పరిచయం, ఈశ్వర్ సినిమా ద్వారా పరిచయం అయిన శ్రీదేవి, నటుడు అరుణ్ విజయ్ ముగ్గురు అన్నా చెల్లెల్లు.సీనియర్ యాక్టర్ విజయ్ కుమార్ పిల్లలు. మొదటి భార్య కొడుకే అరుణ్ విజయ్. మొదటి భార్య ముత్తుకున్ను చనిపోయాక నటి మంజులను వివాహం చేసుకున్నారు విజయ్ కుమార్. మంజులా- విజయ్ కుమార్ లకు పుట్టిన పిల్లలే ప్రీతా, శ్రీదేవి. వీరి మరో సిస్టర్ వనితా కూడా నటిగా పరిచయమే. దేవి సినిమాలో భాను చందర్ సరసన నటించిన వనిత కూడా విజయ్ కుమార్ – మంజులల కూతురే.

జయసుధ- విజయ నిర్మల

జయసుధ- విజయ నిర్మల

జయసుధ- విజయ నిర్మల

జయసుధకి విజయనిర్మల అత్త అవుతారు. క్రిష్ణ – విజయనిర్మల జంటగా నటించిన పండంటి కాపురం సినిమా ఎంత సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. ఆ సినిమా ద్వారానే జయసుధని చైల్డ్ ఆర్టిస్ట్ గా తీస్కొచ్చారు విజయనిర్మల. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు జయసుధ.

చంద్రమోహన్ – కె . విశ్వనాధ్

చంద్రమోహన్ – కె . విశ్వనాధ్

చంద్రమోహన్ – కె . విశ్వనాధ్

నటుడు చంద్రమోహన్ మరియు వెటరన్ డైరెక్టర్ కె. విశ్వనాధ్ ఇద్దరూ కజిన్ బ్రదర్స్.

ప్రియమణి – విద్యాబాలన్

ప్రియమణి – విద్యాబాలన్

విద్యాబాలన్ -ప్రియమణి

ప్రియమణి – విధ్యాబాలన్ ఇద్దరూ కజిన్ సిస్టర్స్..అంతేకాదు ప్రముఖ ప్లేబాక్ సింగర్ మాల్గుఢి శుభకి ప్రియమణి మేనకోడలు.

ఆర్ బి చౌదరీ – జీవా

ఆర్ బి చౌదరీ – జీవా

ఆర్ బి చౌదరీ – జీవా

నిర్మాత , సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బీ చౌదరీ , నటుడు జీవా ఇద్దరూ తండ్రీ కొడుకులు. సూపర్ గుడ్ ఫిలిమ్స్  ఆద్వర్యంలో ఎన్నో సూపర్ హిట్ తెలుగు చిత్రాలను నిర్మించారు ఆర్బీ చౌదరి. జీవా కూడా ఈ, రంగం తదితర చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

సుధీర్ బాబు – మహేశ్ బాబు

సుధీర్ బాబు – మహేశ్ బాబు బావాబామర్దులు. మహేశ్ బాబు సోధరి ప్రియదర్శిని ఘట్టమనేనిని పెళ్లి చేసుకున్నారు సుధీర్. ప్రియదర్శినితో పెళ్లి తర్వాతే సినిమాల్లోకి అడుగుపెట్టారు.

నగ్మా – జ్యోతిక – రోషిణి

నగ్మా , జ్యోతిక ,రోషిణి ముగ్గురు అక్కా చెల్లెల్లు. షమా ఖాజి (సీమా), మొరార్జి ల కూతురు నగ్మ.  మొరార్జి తో విడాకుల తర్వాత చందేర్ ని వివాహం చేసుకున్నారు సీమ. వారి పిల్లలే జ్యోతిక , రోషిణి. చిరంజీవి సరసన మాస్టార్ సినిమాలో నటించారు రోషిణి.

విద్యుల్లేక రామన్ – సెల్వరాఘవన్

విద్యుల్లేక రామన్ – సెల్వరాఘవన్

విద్యుల్లేక రామన్ – సెల్వరాఘవన్

దర్శకుడు సెల్వరాఘవన్ హాస్యనటి విద్యుల్లేఖ రామన్ కి బావ అవుతారు. 7జి బృందావన్ కాలని హీరోయిన్ సోనియా అగర్వాల్ తో విడాకుల తర్వాత గీతా రామన్ ని వివాహం చేసుకున్నారు సెల్వ రాఘవన్. గీతా రామన్, విద్యుల్లేక రామన్ అక్కాచెల్లెల్లు. విద్యుల్లేక రామన్ తండ్రి మోహన్ రామన్ కూడా ప్రముఖ నటుడే.

రజినికాంత్ – అనిరుధ్ రవిచందర్

సూపర్ స్టార్ రజినికాంత్ , మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ కి మామ అవుతారు. రజిని భార్య లత, అనిరుద్ తండ్రి రవి రాఘవేంద్ర ఇద్దరూ అన్నాచెల్లెల్లు.

టబు – షబానా ఆజ్మి

టబు – షబానా ఆజ్మి

టబు – షబానా ఆజ్మి

టబు , షబానా అజ్మికి మేనకోడలు. టబు తండ్రి జమాల్ హష్మి షబానా కి అన్నయ్య.

ఇదండి సినిమా నటుల మధ్య ఉన్న బంధాలు.. అనుబంధాలు..మీకు తెలిసి ఇంకొంత మంది ఉంటారు కదా వారెవరో కామెంట్ చేయండి.

Also Read: వైరల్ అవుతున్న ఈ ఫోటోల వెనకున్న “కథ” ఏంటో తెలుసా.?