సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్లకు అవకాశాలు ఎలా ఉంటాయో చెప్పలేం.. ఒక్కోసారి అవకాశాలు బాగా వచ్చినపుడు టాప్ పొజిషన్ కు చేరుకుంటారు. అయితే, కొత్త హీరోయిన్లు వస్తున్న కొద్దీ అవకాశాలు తగ్గుతుంటాయి. అయితే, సినిమా రంగం లోనే కాకుండా, బయటి ప్రపంచం లో కూడా చక్రం తిప్పి టాప్ పొజిషన్ కు చేరుకున్న హీరోయిన్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Video Advertisement

కొందరు హీరోయిన్లు పెళ్లి అయ్యాక వ్యాపార రంగం లోకి వెళ్లిపోవడం, మరికొందరు తమకు నచ్చిన రంగాల్లో రాణిస్తూ వచ్చారు. అయితే, కొందరు మాత్రం సినిమా రంగాన్ని వదిలేసి వరల్డ్ బెస్ట్ ఆర్గనైజషన్ లలో ఉద్యోగాలు చేస్తూ..కేవలం నటన మాత్రమే కాదు, చదువుకుని మంచిగా స్థిరపడగలం అని కూడా నిరూపించుకున్నారు. వారి లిస్ట్ ను మీరు కూడా ఓ లుక్ వేయండి.

1.మాన్య

మాన్య “సీతారామరాజు” సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. ఆమె ప్రతిభతో మంచి అవకాశాలను, అభిమానులను కూడా సంపాదించుకున్నారు. అయితే, పెళ్లి అయిన తరువాత మాన్య న్యూ యార్క్ లో సెటిల్ అయ్యారు. ఆమె నాలుగేళ్ళ పాపకి తల్లి. పెళ్లి అయ్యాక, మాన్య ఇంటికే పరిమితం కాలేదు. పేరు ప్రఖ్యాతలు కలిగిన జేఆర్ మోర్గాన్ చేస్ అండ్ కో కంపెనీ లో ఆమె ఓ కీలక కొలువు లో విధులు నిర్వర్తిస్తున్నారు.

2. మయూరి కాంగో

మయూరి కూడా ఇదే కోవలో పయనిస్తోంది. మహేష్ బాబు “వంశి” సినిమాలో మయూరి సెకండ్ హీరోయిన్ నటించింది. ఆ తరువాత, బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది. ఐఐటి ఖరగ్ పూర్ లో చదువుకున్న మయూరి కాంగో సినిమాలపై ఇంటరెస్ట్ తోనే చదువుని పక్కన పెట్టి సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. పలు బాలీవుడ్ సినిమాలలో నటించారు. ఆ తరువాత, సినిమాల్లో అవకాశాలు తగ్గడం తో జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (Zicklin School of business ) లో విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఆమె గూగుల్ ఇండియా లో కీలక బాధ్యతలు నిర్వహహిస్తున్నారు.

3. అపర్ణ

వెంకటేష్ నటించిన సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలలో 1992లో వచ్చిన సుందరకాండ ఒకటి.ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మీనా నటించగా, వెంకటేష్ ను ఇష్టపడే స్టూడెంట్ పాత్రలో అపర్ణ నటించారు. ఆ తరువాత ఆమెకి చాలా ఆఫర్లు వచ్చాయట. కానీ, చదువు మీద దృష్టి పెట్టడం కోసం అపర్ణ మరే ఇతర సినిమాలోనూ నటించలేదు.

aparna

2002 లో వివాహం చేసుకున్న అపర్ణ ఆ తరువాత అమెరికా కు వెళ్లిపోయారు. ప్రస్తుతం కాలిఫోర్నియా లో ఉంటున్నారు. ఇండియా లో ఉండగానే ఆమె సైకాలజీ డిగ్రీ చేసారు. ఆ తరువాత యూఎస్ వెళ్లి ఒక ప్రముఖ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో గత ఏడేళ్లు గా ఎంతో మందిని తీర్చి దిద్దుతున్నారు.

4. యామిని శ్వేత

చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మొదటి సినిమా తో పాపులర్ అయిన వాళ్లలో యామిని శ్వేత ఒకరు. శ్వేత కి జయం సినిమా తరువాత చాలా అవకాశాలు వచ్చాయి. కానీ శ్వేత కి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలి అని లక్ష్యం అట.

అందుకే డిగ్రీ పూర్తి చేసిన విదేశాలకి తర్వాత వెళ్లి మాస్టర్స్ చేసి ఒక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారట శ్వేత. శ్వేత కి ఇటీవల పెళ్లయింది. ప్రస్తుతం, ఆమె తన కుటుంబ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు.

ఇలా తెర పైన నటించే అవకాశం ఉన్నా, వీరు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని అందులో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఏది ఏమైనా కానీ ఇలా తెరపై వారి ప్రతిభ నిరూపించుకున్న వారు, వారికి నచ్చిన రంగంలో కూడా అలాగే వాళ్లు అనుకున్నది సాధించాలి అని ఆశిద్దాం.