తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి బాగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించేసాయి. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించిన జనసేన బిజెపితో పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ తరపున నిలబడే 8 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. దీనిలో భాగంగా సెటిలర్స్ ఎక్కువగా ఉండే కూకట్ పల్లి స్థానం జనసేన తీసుకుంది.
అయితే జనసేన తరఫున ఎవరు ఊహించని విధంగా హైదరాబాదుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, వెస్ట్ జోన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ను పవన్ కళ్యాణ్ ప్రకటించారు.ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు సామాజిక వర్గ పరంగా కూడా ప్రేమ్ కుమార్ కు కూకట్ పల్లి వంటి కీలక టికెట్ ఇవ్వడంతో జనసేనలో జోష్ పెరిగిందని వాదన వినిపిస్తుంది. నిన్న మంగళవారం చాలామంది ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు.
సినీనటుడు సాగర్, భద్రాద్రి కొత్తగూడెం కి చెందిన వ్యాపారవేత్త లక్కినేని సురేంద్రరావు తదితరులు చేరిన వారిలో ఉన్నారు. అయితే కూకట్ పల్లి లో ఆంధ్ర ప్రజలు కూడా ఎక్కువగా ఉండడంతో వారందరూ జనసేన వైపే మొగ్గు చూపుతారని అంటున్నారు. జనసేన కచ్చితంగా గెలిచే సీట్లలో కూకట్ పల్లి ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి ప్రేమ్ కుమార్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అనూహ్యంగా ప్రేమ్ కుమార్ జనసేన సీటు తెచ్చుకోవడం వెనక పవన్ కళ్యాణ్ తో తనకు ఉన్న స్నేహమే కారణమని చెబుతున్నారు.
ఇక మిగిలిన స్థానాల విషయానికొస్తే తాండూరు నియోజకవర్గంలో వేమూరి శంకర్ గౌడ్ ని జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. కోదాడ మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూల్ వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం మిరియాల రామకృష్ణ, కొత్తగూడెం లక్కినేని సురేందర్ రావు, వైరా సంపత్ నాయక్, అశ్వరావుపేట మూయబోయిన ఉమాదేవి పేర్లను జనసేన అధినేత ప్రకటించారు.
Also Read:పవన్ కళ్యాణ్” తన స్నేహితుడికి రాసిన ఈ లెటర్ చూశారా..? ఆ స్నేహితుడు ఎవరంటే..?