టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి చంద్రబాబు అరెస్టు 53 రోజులు పైనే గడిచింది. ఇన్ని రోజుల నుండి చంద్రబాబు తరపు న్యాయవాదులు చంద్రబాబుకి బెయిల్ కోసం కోర్టులో వాదనలు వినిపిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు వారి వాదనలకు ఉపశమనం కల్పించే లాగా టిడిపి శ్రేణులకు ఆనందం కలిగించే వార్త చంద్రబాబు కి బెయిల్ మంజూరు కావడం. ఇది కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే. ఈరోజు ఉదయం హైకోర్టులో వాదనలు అనంతరం హైకోర్టు బెంచ్ చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

అయితే కేవలం నాలుగు వారాల పాటు మాత్రమే బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తెలిపింది. నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేవలం చంద్రబాబు ఆరోగ్య కారణాలు దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా తెలిపింది.
బెయిల్ కండిషన్స్:
1.ఒక లక్ష చెప్పున రెండు షురిటిలు సమర్పించాలి .
2.సొంత ఖర్చులతో చికిత్స చేయించుకోవాలి.
3.చికిత్స, ఆసుపత్రి వివరాలు జైలుకు సమర్పించాలి.
4.కేసును ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రభావితం చేయకూడదు.
5.నవంబర్ 28 సాయంత్రం 5 గంటల లోపు సరెండర్ కావాలి.

అయితే ఈ 53 రోజుల నుండి జైలులో ఉన్న చంద్రబాబు పలు అనారోగ్యాలకు గురయ్యారు. చంద్రబాబుకి స్కిన్ సంబంధిత ఎలర్జీ వచ్చినట్లుగా ప్రభుత్వ వైద్యులు ప్రకటించారు. బాగా డిహైడ్రేషన్ కి గురి అవుతున్నారని వయసు కూడా ఎక్కువ కావడంతో జైలులో ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. మధ్య మధ్యలో ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు కూడా నిర్వహించారు.

చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రతివారం వెళ్లి మూలాఖత్ నిర్వహించి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబుకి బెయిల్ రావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సంతోషం కలిగించినట్లే. అయితే నవంబర్ 24 తర్వాత ఏం జరుగుతుందనేది సస్పెన్స్.నవంబర్ 24 తర్వాత చంద్రబాబు మళ్ళీ జైలుకు వెళ్తారా లేక కోర్టుబెయిల్ పొడిగిస్తుందా అనేది వేచి చూడాల్సిన అంశం.





2.
3.
4.
5.
7.
8.
9.
10.
11.
12.
13
14
15.








విచారణ చేయమని సిబిఐ ని ఆదేశించింది. సిబిఐ ఈ కేసును విచారించి పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎంపీలు కొన్న విషయాన్ని నిరూపించారు.అయితే ఈ కేసులో కోర్టులో వాదన నడిచి చివరికి 2000 సంవత్సరంలో పీవీ నరసింహారావు కి కోర్టు మూడు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా విధించింది. అయితే ఈ జడ్జ్మెంట్ తర్వాత పివి నరసింహారావు ఢిల్లీ హైకోర్టులో ఆపిల్ చేయగా కోర్టు బెయిల్ ఇచ్చింది. 2002 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు పివి నరసింహారావుని నిర్దోషిగా ప్రకటించింది.








ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపించడంతో పవన్ కళ్యాణ్ జనసేన విజయకేతనం బలంగా ఉండే విధంగా అసెంబ్లీలో ఉండి పని చేయాలనే ఆత్రుతతో కసిగా కనిపిస్తున్నారు. తాజాగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశంతో పొత్తు ప్రకటించి అధికార వైసీపీకి పెద్ద షాక్ నే ఇచ్చారు.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూరా తిరుగుతున్నాయి.
తాజాగా ఆయన జనసేన నాయకులతో మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… తెలుగుదేశంతో మనం కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, కేవలం జనాధారనతోనే ఇంతవరకు జనసేన నడిచిందని అన్నారు. ఆరున్నర లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని, ప్రజల భవిష్యత్తును బంగారమయం చేసే విధంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో వైసిపి పోవాలి, జనసేన-టిడిపి ప్రభుత్వం ఏర్పడే విధంగా ముందుకు వెళ్దాం అన్నారు. “సీఎం స్థానం వద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు.కానీ దానికోసం వెంపర్లాడను, నాకు సీఎంగా అవకాశం వస్తే తప్పకుండా తీసుకుంటాం. ప్రజల కోసం ఆదర్శ పాలన అందిద్దామని” పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనతో జనసేన నాయకుల్లోనూ, జనసైనికుల్లోనూ ఫుల్ జోష్ వచ్చింది.

