ఆ నియోజకవర్గంలో కెసిఆర్ మీద పోటికి సై అన్న ఈ అభ్యర్థి గురించి తెలుసా.?

ఆ నియోజకవర్గంలో కెసిఆర్ మీద పోటికి సై అన్న ఈ అభ్యర్థి గురించి తెలుసా.?

by Mounika Singaluri

Ads

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ అభ్యర్థుల పేర్లు ప్రకటించడం పైన దృష్టి పెట్టాయి. ఏ అభ్యర్థి అయితే గెలుపు గుర్రం గా భావిస్తున్నారో వారికే పార్టీలు సీట్లు కేటాయిస్తున్నాయి. ఎవరు ఎక్కడ నుండి పోటీ చేస్తున్నారని అంశం పైన కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి.

Video Advertisement

ముఖ్యమంత్రి కెసిఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారని తెలిపారు. అయితే ఆయన మీదకి పోటీగా బీజేపీ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపుతారని చర్చ జరుగుతుంది. కెసిఆర్ ని ఓడించాలని గట్టి పట్టుదలతో బీజేపీ కాంగ్రెస్ పార్టీని కనిపిస్తున్నాయి.


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసిఆర్ కి వ్యతిరేకంగా పోటీ చేసే ఛాన్స్ లేదని తెలుస్తుంది. విజయశాంతిని గాని, లేదా ధర్మపురి అరవింద్ గాని కెసిఆర్ మీదకి పోటీకి దింపుతారని అందరు అనుకున్నారు. అయితే అనూహ్యంగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. అతనే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. స్థానికంగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు జనాల్లో ఫాలోయింగ్ కూడా ఉంది.

vijayasanthi 2

గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఈయన ప్రీతిపాత్రుడు.కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటివరకు 60 కోట్ల రూపాయల సొంత డబ్బు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశారు. గెలిచిన ఓడిన పట్టించుకోనీ ఇయాన ఎవరిని ఓట్లు కూడా అడగడు.తన తండ్రి పేరు మీద సేవ కార్యక్రమాలు చేసుకుంటూ పోతే తప్ప ఎవరిని సాయం కూడా అడగడు.


అయితే కామారెడ్డి నుండి కేసీఆర్ పోటీ చేయాలని గతంలోనే అనుకున్నారట. అక్కడ గుళ్లను డెవలప్ చెయ్యాలని ఉద్దేశంతో నిధులు విడుదల కూడా చేశారు. ఈ ఆదేశాలపై వ్యతిరేకత వ్యక్తం అవడంతో ఆదేశాలను క్యాన్సల్ కూడా చేశారట కానీ వెంకటరమణారెడ్డి మాత్రం ఎప్పటినుండో తన సొంత ఖర్చులతో గుళ్లను అభివృద్ధి చేస్తున్నారు.పార్టీలు మేనిఫెస్టో పక్కన పెడితే ఆయనకంటూ ప్రత్యేకమైన మేనిఫెస్టో ఉంది.

ఇందులో నా కామారెడ్డి నియోజకవర్గ కోసం 150 కోట్ల బడ్జెట్ కేటాయించుకున్నారని తెలిపారు. అందుకు సంబంధించిన కార్యకలాపాల లిస్టు కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు. పదవితో సంబంధం లేకుండా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఆర్థిక కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ అభినందించక మానరు.

Also Read:తెలంగాణలో టిడిపి పోటీ చేయకపోతే కాంగ్రెస్ కి లాభమా.? లేక బీజేపీ కా.?


End of Article

You may also like