మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే పెద్దల సభకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం ఆకర్ష్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. జనసేన తో కలిసి పొత్తులో ఉన్న బిజెపి తమ సొంత బలాన్ని పెంచుకోవాలని ఆశిస్తుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు ఎన్నిక చేయాలనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
త్వరలోనే 15 రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూలు కూడా విడుదలైంది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుండి పది రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. యూపీ నుండి చిరంజీవిని రాజ్యసభకు పంపాలని బిజెపి అధిష్టానం భావిస్తుందట. ఇప్పటికే అక్కడ తెలంగాణ బిజెపి నాయకుడు లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవికి కూడా అక్కడ నుండి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.
గతంలో చిరంజీవి కాంగ్రెస్ నుండి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కేంద్ర పర్యటక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా చిరంజీవికి ఉంది. తర్వాత రాజకీయాలకు దూరమై సినిమాల్లో బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు చిరంజీవి బిజెపి ఆఫర్ ను ఒప్పుకుంటారా లేదా అనేది తెలియదు. తాజాగా చిరంజీవి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.