భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే రెండు జట్ల మధ్య పోటీ ఎలా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. చాలా ఏళ్లుగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా సాగుతోంది.
అయితే కొందరు క్రికెటర్లు భారత్-పాకిస్థాన్ రెండు జట్ల తరఫున క్రికెట్ ఆడారు. ముగ్గురు పంజాబీ క్రికెటర్లు భారత్-పాకిస్థాన్ రెండు జట్ల తరుపున క్రికెట్ ఆడారు. అయితే ఆ ముగ్గురు క్రికెటర్లు ఎవరో? ఇప్పుడు చూద్దాం..
స్వాతంత్ర్యం మరియు రెండు దేశాల విభజన తరువాత నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పోటీతత్వం అనేక అంశాలలో కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఉన్న సమయంలో ఇటు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడతారు. అయితే ఈ రెండు జట్ల తరుపున ముగ్గురు పంజాబీ క్రికెటర్లు ఆడారనే విషయం చాలామందికి తెలియదు.
1.అబ్దుల్ హఫీజ్ కర్దార్
పాకిస్తాన్ క్రికెట్ పితామహుడు గాపిలువబడే అబ్దుల్ హఫీజ్ కర్దార్ అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ మరియు భారతదేశం రెండింటికీ ప్రాతినిధ్యం వహించిన వారిలో ఒకరు. అబ్దుల్ పాకిస్థాన్ జట్టుకు తొలి కెప్టెన్. దేశ స్వాతంత్ర్యానికి ముందు కర్దార్ భారత జట్టులో సభ్యుడు. ఆ తర్వాత పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాకుండా పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఎడమచేతి వాటం స్పిన్నర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.
2. అమీర్ ఎలాహి
అమీర్ ఎలాహి భారతదేశం తరపున ఒకసారి, 1947లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో మరియు ఐదుసార్లు 1952-53లో పాకిస్తాన్ తరపున ఆడాడు. కలకత్తాలో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు అతని వయస్సు 44 సంవత్సరాలు. మీడియం-పేస్ బౌలర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన, అమీర్ లెగ్-బ్రేక్‌లు మరియు గూగ్లీలకు పేరు పొందాడు.
3. గుల్ మహ్మద్:
గుల్ మహ్మద్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్, అలాగే గొప్ప ఫీల్డర్ మరియు బౌలర్. అతని గొప్ప దేశీయ ప్రదర్శన కారణంగా, అతను 1946లో అంతర్జాతీయ కాల్-అప్ అందుకున్నాడు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన గుల్ భారత్ తరఫున ఏడు టెస్టులు ఆడాడు.
1946 నుండి 1955 వరకు, అతను భారత క్రికెట్ జట్టులో సభ్యుడు. భారతదేశం తరఫున ఎనిమిది టెస్టులు ఆడిన తర్వాత, అతను లాహోర్‌కు వలస వెళ్లి అక్కడ నివసించాడు. గుల్ 1956లో కరాచీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఒక టెస్టులో పాకిస్థాన్ తరపున ఆడాడు.
Also Read: ఒక బౌలర్ వరసగా రెండు ఓవర్లు ఎప్పుడు వేయచ్చో తెలుసా.? రూల్ ప్రకారం అసలు ఎందుకు వేయకూడదు అంటే.?






#2
#3
#4
#5
#6
#7
#8
#9
గత మ్యాచ్ ల్లో పాకిస్థాన్ భారత జట్టుకు పోటీ ఇచ్చిన విధానంతో ఈసారి జరగబోయే మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండనుంది. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన ప్రతిసారి గట్టి పోటీనే ఇస్తున్నాయి. ఇక రోహిత్ శర్మ, బాబర్‌ల జట్లు రెండు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో అందరి దృష్టి సెప్టెంబర్ 2న జరగే మ్యాచ్ పై ఉంది. అయితే ఈ ఈ మ్యాచ్‌లో ఎవరి పై ఎవరు విజయం సాధిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
పాక్ ఆడబోయే జట్టును ఒక్క రోజు ముందే ప్రకటించింది. నేపాల్ పై విజయం సాధించిన జట్టు భారత్ తో తలపడనుంది. ఆ జట్టు సత్తాను బట్టి భారత జట్టును ఎంపిక చేయడంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ కు తేలికగా మారింది. అయితే భారత్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఒక్కరూ కూడా లేకుండానే ఆసియా కప్ ఆడడం కోసం వెళ్లింది. గతేడాది పాకిస్థాన్ టాప్ ఆర్డర్‌ను పడగొట్టి భారత జట్టు విజయానికి కారణం అయిన అర్ష్‌దీప్ సింగ్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నప్పటికీ అతను లేకుండానే ఆసియా కప్ 2023 ఆడేందుకు భారత జట్టు సిద్ధపడింది.
గత టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టును కూల్చేసిన ఆటగాడిని కోల్పోతే, భారత్ జట్టు సమస్యలు ఎదుర్కొవచ్చు. భారత్ జట్టులో ఒక్కరు కూడా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ లేని పరిస్థితుల్లో, పాక్ జట్టులో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అయిన షాహీన్ షా ఆఫ్రిది జట్టులో ఉన్నాడు. ఇది భారత జట్టుకు అతిపెద్ద సవాల్ అని అంటున్నారు.
శనివారం నాడు జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. చిరకాల ప్రత్యర్థులు మధ్య జరగబోయే ఉత్కంఠభరిత మ్యాచ్ కోసం అటు రోహిత్ శర్మ సారధ్యంలోని భారత్, ఇటు బాబర్ ఆజం సారధ్యంలోని పాకిస్థాన్ జట్లు శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 2న తలపడనున్నాయి. ఇక భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికే టిక్కెట్లన్ని సేల్ అయ్యాయి.
ఈ క్రమంలో అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే టెన్షన్ అభిమానులలో నెలకొంది. దానికి కారణం గురువారం కాండే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ జరిగే టైమ్ లో 90 శాతం వరకు వర్షం పడే ఛాన్స్ ఉందని అక్కడి వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దాంతో ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయితే రెండు జట్లకు 1-1 పాయింట్లు వస్తాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే లేదు.
రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చినట్లయితే పాకిస్తాన్ జట్టుకి అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్‌లో నేపాల్ పై గెలిచి పాక్, ఇప్పటికే 2 పాయింట్లు దక్కించుకుని ఆసియా కప్ పాయింట్ల టేబుల్ టాప్ ప్లేస్ లో ఉంది. భారత్ తో మ్యాచ్ రద్దయితే, వచ్చిన పాయింట్ తో పాక్ 3 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగే అవకాశం ఉంది. దాంతో డైరెక్ట్ గా సూపర్ ఫోర్ రౌండ్‌కి క్వాలిఫై అవుతుంది. కానీ టీంఇండియాకి ఒక పాయింట్ వచ్చినా, నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ భారీ రన్ రేట్‌తో విజయం సాధిస్తేనే సూపర్ ఫోర్ రౌండ్‌కి అవకాశం ఉంటుంది.


యోయో ఫిట్నెస్ టెస్ట్ మొదలుపెట్టిన వ్యక్తి శంకర్ బసు. ఆయన ఒకప్పడు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ గా పనిచేశారు. ఇండియన్ క్రికెట్లో అత్యున్నత ఫిట్నెస్ స్టాండర్డ్స్ ను నెలకొల్పిన విరాట్ కోహ్లి భారతజట్టు కెప్టెన్‌గా ఉండటం వల్ల యోయో టెస్ట్ కు తేలికగా ఆమోదం వచ్చింది. అప్పటి భారత జట్టు కోచ్ రవిశాస్త్రి ఈ టెస్ట్ ను సపోర్ట్ చేశాడు. 2018 నుంచి 3 ఏళ్ల పాటు యోయో టెస్ట్ లో పాస్ అవడం అనేది భారత ప్లేయర్స్ కు తప్పనసరి అయ్యింది.
అత్యుత్తమ ఫిట్నెస్ ఉన్నవారు మాత్రమే యోయోలో పాస్ అవగలరు. యువరాజ్ సింగ్, సురేశ్ రైనా వంటి సీనియర్ క్రికెటర్లు మాత్రమే కాకుండా పృథ్వీ షా, వాషింగ్టన్ సుందర్ లాంటి యంగ్ ప్లేయర్స్ కూడా ఈ టెస్ట్ ను పాస్ కాలేక ఇబ్బంది పడ్డారు. కోహ్లి టీం ఇండియా కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు ఈ టెస్ట్ ను కఠినంగా అమలు చేశారు. యోయో టెస్ట్ లో వచ్చిన స్కోరును బట్టే భారత క్రికెట్ జట్టులో స్థానం లభిస్తుంది. ఎంత పెద్ద క్రికెటర్ అయినా సరే ఈ పరీక్షలో ఫెయిలైతే అంతే.
ఇటీవల బీసీసీఐ యోయో టెస్ట్‌తో పాటుగా రెండు 2 కిలోమీటర్ల పరుగును కూడా అమలులోకి తెచ్చింది. ఈ రెండింటిలో ఏదో ఒక దానిలో క్రికెటర్లు తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ లో భాగంగా ఇరవై మీటర్ల ఎడంతో 2 కోన్లను ఏర్పాటు చేస్తారు. క్రికెటర్లు వీటి మధ్య పరుగెత్తాల్సి ఉంటుంది. దీనిలో ఉండే స్థాయిలను బట్టి, ప్రతి ఆటగాడు పరుగెత్తే వేగాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ఒక ఆటగాడు పరుగు మొదలుపెట్టే ముందు బీప్ సౌండ్ వస్తుంది. మళ్ళీ బీప్ సౌండ్ వచ్చేలోపు అవతలి ఎండ్‌కు ఆ ఆటగాడు వెళ్లాలి.
మళ్ళీ బీప్ వినిపించేలోపు మళ్లీ మొదలుపెట్టిన చోటుకి రావాలి. ఒకసారి ఇలా చేస్తే ఒక షటిల్ కంప్లీట్ అయినట్టుగా పరిగణిస్తారు. ఒక షటిల్లో ఒక ఆటగాడు 40 మీటర్లు రన్ చేస్తాడు. క్రికెటర్లు పూర్తి చేసిన షటిళ్లను బట్టి స్కోరును లెక్కిస్తారు. షటిల్ కు షటిల్ కు మధ్య 5- నుండి 10 సెకన్ల వరకు విరామం ఉంటుంది. బీప్ సౌండ్ ను ఎవరూ కంట్రోల్ చేయలేరు. టెస్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుంది.
షటిల్ కంప్లీట్ చేసే టైమ్ లో మొత్తం 3 బీప్స్ వస్తాయి. షటిల్ మొదలవడానికి ముందు ఒక బీప్, ఆ తరువాత 20 మీటర్ల దూరానికి ఒక బీప్, మళ్ళీ 20 మీటర్లకు ఒక బీప్ వస్తుంది. ఈ బీప్ శబ్దం వినిపించేలోపే ఆటగాడు తన లక్ష్యాన్ని చేరుకోవాలి. ఒక బీప్ కానుక మిస్సయితే కోచ్, ట్రైనర్ ఆ ఆటగాడికి వార్నింగ్ ఇస్తారు. 2 బీప్స్ మిస్సయితే ఆ ఆటగాడి పరీక్ష ముగిసినట్లే. ఆ ఆటగాడు యోయో టెస్ట్‌లో ఫెయిలయ్యాడని అర్ధం.

ప్రజ్ఞానంద పూర్తి పేరు రమేష్‌బాబు ప్రజ్ఞానంద. తమిళనాడులోని చెన్నైలో ప్రజ్ఞానంద 2005లో ఆగస్టు 10 న జన్మించారు. అతని తండ్రి పేరు రమేష్‌బాబు. ఆయన టీఎన్ఎస్సీ బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రజ్ఞానంద తల్లి పేరు నాగలక్ష్మి. ఆమె గృహిణి. అతనికి ఒక అక్క ఉంది. ఆమె పేరు వైశాలి. ఆమె ఉమెన్ గ్రాండ్ మాస్టర్ మరియు ఇంటర్నేషనల్ మాస్టర్.
ప్రజ్ఞానంద ఐదేళ్ల నుంచి చెస్ ఆడుతున్నాడు. మొదట్లో చెస్ అంటే ఆసక్తిలేనప్పటికి, అతని ఫ్యామిలీ సహాయంతో చెస్ నేర్చుకుని, అనేక పోటీలలో పాల్గొని విజయం సాధించాడు. ఏడేళ్ల వయసులోనే ప్రజ్ఞానంద ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. ఈ విజయం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఎచెక్స్ మాస్టర్ అనే బిరుదును వచ్చేలా చేసింది. 2015లో ఛాంపియన్షిప్ లో అండర్-10 కేటగిరీలో కూడా విజేతగా నిలిచాడు. 10ఏళ్ల వయస్సులో ప్రజ్ఞానంద చెస్ లో అతి చిన్న వయస్కుడైన అంతర్జాతీయ మాస్టర్‌గా పేరు సంపాదించాడు.
ప్రజ్ఞానంద 2016లో చెస్ లో అతి చిన్న వయస్కుడైన ‘ఇంటర్నేషనల్ మాస్టర్’ గా చరిత్ర సృష్టించాడు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఎచెక్స్ గేమ్‌లో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించే ప్లేయర్స్ కి ‘ఇంటర్నేషనల్ మాస్టర్’ బిరుదును ఇస్తారు. చరిత్రలో ఈ బిరుదును సాధించిన అతి పిన్న వయస్కుడైన ఇండియన్ గా కూడా ప్రజ్ఞానంద నిలిచాడు.
18 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రపంచకప్ చెస్ టోర్నీలో ఫైనల్ లో ప్రస్తుత ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్సెన్ తో పోటీపడ్డాడు. ఈ గేమ్‌లో ప్రజ్ఞానంద తెల్ల పావులతో ఆడాడు. 35 ఎత్తుల అనంతరం రిజల్ట్ తేలే ఛాన్స్ లేకపోవడంతో వీరిద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. ఈ మాగ్నస్ కార్ల్సెన్ పై విజయం సాధించి, ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించడానికి అతి చేరువలో ఉన్నాడు.
ఇంగ్లండ్ లో జరుగుతున్న వన్డే కప్ టోర్నీలో ఓపెనర్ పృథ్వీ షా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 23వ మ్యాచ్‌లో సోమర్సెట్ పై డబుల్ సెంచరీ చేసిన షా, అనంతరం డర్హామ్ పై కూడా సెంచరీ కొట్టాడు. డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ ఓపెనర్ గా వచ్చిన పృథ్వీ, 76 బంతుల్లో 7 సిక్సర్లు, 15 ఫోర్లతో 125 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ 125 రన్స్ తో పృథ్వీ షా ‘లిస్ట్ ఏ’ క్రికెట్లో మూడు వేల పరుగులను చేశాడు.
పృథ్వీ షా సాధించిన రికార్డులు..