Ads
యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ప్రపంచకప్ చెస్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. సెమీఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంకర్ ఫాబియానో కరువానా పై 18 సంవత్సరాల ప్రజ్ఞానంద 3.5–2.5తో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఫైనల్ వెళ్ళిన ప్రజ్ఞానంద వచ్చే సంవత్సరం జరిగబోయే క్యాండిడేట్ టోర్నీకి అఫిషియల్ గా అర్హత సాధించాడు.
Video Advertisement
చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అనంతరం ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ కు వెళ్ళిన రెండవ ఇండియన్ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద రికార్డ్ సృష్టించాడు. మరి అతను ఎవరు? అతని కుటుంబం గురించి ఇప్పుడు చూద్దాం..
ప్రజ్ఞానంద పూర్తి పేరు రమేష్‌బాబు ప్రజ్ఞానంద. తమిళనాడులోని చెన్నైలో ప్రజ్ఞానంద 2005లో ఆగస్టు 10 న జన్మించారు. అతని తండ్రి పేరు రమేష్‌బాబు. ఆయన టీఎన్ఎస్సీ బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రజ్ఞానంద తల్లి పేరు నాగలక్ష్మి. ఆమె గృహిణి. అతనికి ఒక అక్క ఉంది. ఆమె పేరు వైశాలి. ఆమె ఉమెన్ గ్రాండ్ మాస్టర్ మరియు ఇంటర్నేషనల్ మాస్టర్.
ప్రజ్ఞానంద ఐదేళ్ల నుంచి చెస్ ఆడుతున్నాడు. మొదట్లో చెస్ అంటే ఆసక్తిలేనప్పటికి, అతని ఫ్యామిలీ సహాయంతో చెస్ నేర్చుకుని, అనేక పోటీలలో పాల్గొని విజయం సాధించాడు. ఏడేళ్ల వయసులోనే ప్రజ్ఞానంద ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. ఈ విజయం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఎచెక్స్ మాస్టర్ అనే బిరుదును వచ్చేలా చేసింది. 2015లో ఛాంపియన్‌షిప్ లో అండర్-10 కేటగిరీలో కూడా విజేతగా నిలిచాడు. 10ఏళ్ల వయస్సులో ప్రజ్ఞానంద చెస్ లో అతి చిన్న వయస్కుడైన అంతర్జాతీయ మాస్టర్‌గా పేరు సంపాదించాడు.ప్రజ్ఞానంద 2016లో చెస్ లో అతి చిన్న వయస్కుడైన ‘ఇంటర్నేషనల్ మాస్టర్’ గా చరిత్ర సృష్టించాడు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఎచెక్స్ గేమ్‌లో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించే ప్లేయర్స్ కి ‘ఇంటర్నేషనల్ మాస్టర్’ బిరుదును ఇస్తారు. చరిత్రలో ఈ బిరుదును సాధించిన అతి పిన్న వయస్కుడైన ఇండియన్ గా కూడా ప్రజ్ఞానంద నిలిచాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రపంచకప్ చెస్ టోర్నీలో ఫైనల్ లో ప్రస్తుత ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్‌సెన్ తో పోటీపడ్డాడు. ఈ గేమ్‌లో ప్రజ్ఞానంద తెల్ల పావులతో ఆడాడు. 35 ఎత్తుల అనంతరం రిజల్ట్ తేలే ఛాన్స్ లేకపోవడంతో వీరిద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. ఈ మాగ్నస్ కార్ల్‌సెన్ పై విజయం సాధించి, ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించడానికి అతి చేరువలో ఉన్నాడు.
End of Article