ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఫాన్స్ ఏ లెవెల్ లో ఎదురు చూస్తారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందునా అది వరల్డ్ కప్ మ్యాచ్ అయితే ఇక క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఈసారి ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరగబోయే వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ అక్టోబర్ 15 న అహ్మదాబాద్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ని చూడడం కోసం అభిమానులు ఎగబడుతున్నారు.
దూర ప్రదేశాల నుంచి రావడానికి కూడా వెనుకాడని వారు ఎందరో ఈ మ్యాచ్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. మార్చుకో ఇంకా ఎంతో టైం ఉంది అయినా ఇప్పటికే హోటల్ రూమ్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు అహ్మదాబాద్ హోటల్ యజమానులు కూడా బుకింగ్ రేట్స్ విపరీతంగా పెంచేశారు. ఆవరేజ్ హోటల్ కి కూడా 50,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్టార్ హోటల్స్ అయితే ఏకంగా ఒక్క రోజుకి లక్ష రూపాయలు వరకు డిమాండ్ చేస్తున్నాయి. పరిస్థితి అలా ఉన్నప్పటికీ చాలా వరకు హోటల్లో బుకింగ్ ఫుల్ అయిపోయింది. ఇక ఏం చేయాలో తెలియని అభిమానులు తగ్గేదే లేదని ఆల్టర్నేట్ గా నరేంద్ర మోడీ స్టేడియం దగ్గరలో ఉన్న హాస్పిటల్లో బెడ్స్ ను కూడా బుక్ చేయడానికి ట్రై చేస్తున్నారు.

బుకింగ్ కోసం ఇప్పటికే తమ దగ్గరకు ఎన్నో రిక్వెస్ట్‌లు వచ్చినట్లు స్టేడియం చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ యజమానులు తెలియజేస్తున్నారు. కొందరు హాస్పిటల్లో బెడ్ ఇవ్వడానికి సుమారు రోజుకు మూడు నుంచి 25000 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్డు తో పాటు పూర్తి మెడికల్ చెక్ అప్ లాంటి వసతులు కూడా ఇవ్వడంతో అనవసరంగా హోటల్ గదులకు వేలకు వేలు పోసి వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చాలామంది హ్యాపీగా హోటల్స్ బదులు హాస్పిటల్స్ బుక్ చేసుకుంటున్నారు.

ఒకే ఖర్చుతో ఎంటర్టైన్మెంట్ తో పాటు హెల్త్ చెకప్ కూడా పూర్తవుతుంది అని భావిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ కోసం రెండు మ్యాచ్‌లు ఉన్నప్పటికీ అవి శ్రీలంకలో జరుగుతున్నాయి. ఇండియా వేదికగా జరిగే ఒకే ఒక మ్యాచ్ ఇదే కావడంతో అహ్మదాబాద్ హాస్పిటల్స్ కూడా వచ్చే అభిమానులకు విడిదిగా మారబోతున్నాయి.

టీమిండియా మేనేజ్మెంట్ తెలుగు ప్లేయర్ కేఎస్ భరత్ ను వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ కు పక్కనపెట్టింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల్లో కేఎస్ భరత్‌కు వికెట్ కీపర్‌గా ఛాన్స్ ఇచ్చింది. కానీ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ కు భరత్ స్థానంలో యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు మొదటిసారి టెస్టుల్లో అవకాశాన్ని ఇచ్చింది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీ ఫైనల్లో కేఎస్ భరత్‌కు వికెట్ కీపర్‌గా భారత జట్టు తరఫున ఆడే ఛాన్స్ లభించింది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భరత్ వికెట్ కీపింగ్‌లో సత్తా చాటినా, బ్యాటింగ్‌లో తడబడ్డాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ లలో ఎవరిని ఆడించాలనే చర్చ జరిగింది. వికెట్ కీపింగ్‌లో సత్తా చాటిన భరత్ నే మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ముఖ్యమైన మ్యాచ్‌లలో వికెట్ కీపర్‌గా భరత్ రాణించినా, బ్యాటింగ్‌లో తడబడ్డాడు. వెస్టిండీస్ టూర్ కు భరత్ ను సెలెక్ట్ చేసినప్పటికీ, తుది జట్టులో స్థానం దక్కలేదు.
భరత్ ను తప్పించడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చి, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టులో తప్పించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భరత్‌ను తప్పించి ముంబై ఇండియన్స్ జట్టు ఇషాన్ కిషన్‌కు ఛాన్స్ ఇచ్చావా అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ పై సెటైర్లు వేస్తున్నారు. భరత్ బ్యాటర్‌గా మెరుగైన ఛాయిస్ కాకపోవచ్చు. అయితే వికెట్ కీపర్‌గా ఇషాన్ కంటే అతడే బెటర్ అని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
కోహ్లీ కెప్టెన్సీలో ధోనీ కుట్ర చేశాడని యోగ్రాజ్ సింగ్ ఆరోపించారు. తాను తప్ప భారతజట్టు తరఫున ఇంకొకరు వరల్డ్ కప్ గెలవకూడదనే దురాలోచనతో ధోనీ కావాలనే రన్ అవుట్ అయ్యాడని అన్నారు. ఈ మేరకు యోగ్రాజ్ సింగ్ తన ట్విటర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ఇలా చెప్పుకొచ్చాడు.
‘ఆ ఇన్సిడెంట్ ను తలుచుకుంటే ఇప్పటికీ నా రక్తం మరుగుతోంది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో మహేంద్ర సింగ్ ధోనీ ఉద్దేశ్యపూర్వకంగా బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. టీమిండియా తరఫున ఇంకో కెప్టెన్ వరల్డ్ కప్ గెలవడం అనేది ధోనీ ఇష్ట పడలేదు. అందువల్ల ఒకవైపు రవీంద్ర జడేజా గెలవాలనే తపనతో బాగా ఆడుతున్నా, ధోనీ జడేజాకు సహకరించలేదు. జిడ్డు బ్యాటింగ్‌తో అతని పై ఒత్తిడి పెంచి అతను ఔటయ్యేలా చేశాడు.
తన ప్రతిభకు తగిన విధంగా బ్యాటింగ్ చేయకుండా చివర్లో కావాలనే రన్ అవుట్ అయ్యాడు. ధోనీలో మ్యాచ్ గెలవాలన్న కసి ఏమాత్రం ఉన్నా, తన సామర్థ్యంలో 40 శాతం వినియోగించినా కూడా టీమిండియా 48వ ఓవర్లోనే గెలిచి ఉండేది’ అని యోగ్రాజ్ సింగ్ వెల్లడించారు. ఈ వీడియోను విరాట్ కోహ్లీ కోసం ప్రతి అభిమాని చూడాలని యోగ్రాజ్ సింగ్ అభ్యర్థించారు.


















భారత్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్ 2011 ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు శ్రీలంకతో తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో ధోని తీసుకున్న నిర్ణయం క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచింది. చేజింగ్ టైంలో బ్యాటింగ్ ఆర్డర్ లో పెద్ద మార్పు చేశాడు. ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చేయాల్సిన 5 వ స్థానంలో ధోని వచ్చాడు.
అసలు ధోని ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడనేది ఇప్పటికీ మిస్టరీనే. తాజాగా ముత్తయ్య మురళీధరన్ వరల్డ్‌కప్ 2011 ఫైనల్ లో ధోని ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడో తనకు తెలుసు అని అన్నారు. మురళీధరణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘ధోని యువరాజ్ సింగ్ కన్నా ముందుగా బ్యాటింగ్ చేయడానికి కారణం నేనే. దానికి కారణం యువరాజ్‌కి నా బౌలింగ్‌లో రికార్డ్ పెద్దగా లేదు. అయితే ధోనికి ఉంది.
అది మాత్రమే కాకుండా ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. దాంతో నేను వేసే బంతులను ఆడిన ఎక్స్పీరియన్స్ ధోనికి ఎక్కువగా ఉంది. అందువల్లే బ్యాటింగ్ ఆర్డర్లో ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నాడు’ అని అన్నారు. అయితే దీనిలో వాస్తవం ఎంతవరకు ఉందో ధోని చెప్తేనే తెలుస్తుంది.
