ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఇచ్చిన టార్గెట్ 375 పరుగులను చేధించడానికి ఫీల్డ్ లోకి వచ్చిన నెదర్లాండ్స్ చతికిలపడింది. ఆ సమయంలోనే యంగ్ క్రికెటర్ ఎంట్రీ ఇచ్చాడు.
22వ ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చి, 46వ ఓవర్ దాకా బ్యాటింగ్ చేస్తూ, 76 బాల్స్ లో 111 రన్స్ చేశాడు. దాంతో అతను ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఇక ఆ క్రికెటర్ ఎవరా ఆని నెట్టింట్లోఅంతా వెతకటం మొదలు పెట్టారు. అతనే తేజా నిడమనూరు, తెలుగు కుర్రాడు. తెలుగువాడు అయిన తేజా నిడమనూరు నెదర్లాండ్స్ కు ఎందుకు ఆడాడు అనేది ఇప్పుడు చూద్దాం..
తేజా నిడమనూరు సొంతూరు ఏపీలోని విజయవాడ. అతను 1994లో ఆగష్టు 22న విజయవాడలో జన్మించాడు. తేజా పూర్తి పేరు అనిల్ తేజాా నిడమనూరు. చిన్నతనంలోనే తేజ ఫ్యామిలీ న్యూజిలాండ్‌కు వెళ్లి, అక్కడే స్థిరపడింది. దాంతో అక్కడే తేజా క్రికెట్ నేర్చుకుని, ఆక్లాండ్ జట్టుకు డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. న్యూజిలాండ్‌లో చదువు పూర్తి చేసిన తేజాకు, నెదర్లాండ్స్ లో జాబ్ వచ్చింది. దాంతో అక్కడికి వెళ్ళాడు. నెదర్లాండ్స్ కి వచ్చినా, తాను ఇష్టపడే క్రికెట్ ఆడటం కోసం అక్కడే ఉట్రెక్ట్‌లోని కంపాంగ్ క్లబ్లో చేరాడు.
అలా నెదర్లాండ్స్ దేశవాళీ క్రికెట్ ఆడే తేజాకు జాతీయజట్టు తరుపున ఆడటం కోసం పిలుపు వచ్చింది. నెదర్లాండ్స్ జట్టులో బాగా ఆడుతున్న తేజా పై వేరే దేశాల క్రికెట్ క్లబ్స్ దృష్టి పడింది. దాంతో అవి తేజ కోసం పోటీపడ్డాయి. అలా తేజా ఇంగ్లాండ్ క్లబ్ తరుపున ఆడటం మొదలుపెట్టాడు. అక్కడే ఆసీస్ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌తో తేజాకు పరిచయమైంది. ఇద్దరూ ఒకే క్లబ్ తరుపున ఆడేవారు.
ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌కు కన్నా ముందు జరిగిన సీడబ్ల్యూసీ సూపర్ లీగ్ సిరీస్ లో నెదర్లాండ్స్ జట్టు జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడింది. తొలి వన్డేలో తేజా 110 బాల్స్ లో 96 రన్స్ చేసి నెదర్లాండ్స్ జట్టును గెలిపించాడు. 250 రన్స్ టార్గెట్ ఇచ్చిన జింబాబ్వే జట్టు గెలుస్తారని అందరు అనుకున్నారు. కానీ 7వ స్థానంలో బ్యాటింగ్ దిగిన తేజాా నెదర్లాండ్స్ జట్టును గెలిపించి సంచలనం సృష్టించాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ చేసి టాప్ స్కోరు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరియు అబ్దుల్ రజాక్ల రికార్డ్స్ ను తేజాా బ్రేక్ చేశాడు.
ఇటీవల వెస్టిండీస్‌పై తేజాా సెంచరీ చేయడంతో అందరి దృష్టి తేజా పై పడింది. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తేజాను ఎంత డబ్బు పెట్టడానికి అయినా సొంతం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా సన్‌రైజర్స్ ఓనర్ కావ్యాపాప తేజాాను ఎలాగైనా కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read: “ధోనీ.. మిస్టర్ కూల్ కాదు..!” అంటూ… “ఇషాంత్ శర్మ” కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

ఇషాంత్ శర్మ మాట్లాడుతూ, ధోనీ సైలెంట్ గా ఒక కార్నర్ లో కూర్చున్నాడంటే, సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు అర్ధం చేసుకోవాలని, ఆ టైంలో ఎవరైనా ధోనీని డిస్టర్బ్ చేసినట్లయితే అతడిని బూతులు తిట్టేవాడని, ధోనీని అందరు మిస్టర్ కూల్ అని పిలుస్తారు. కానీ అతను అంత కూల్ కాదని అన్నాడు.
అయితే ధోనీ తరుచూగా ఆగ్రహించేవాడు కాదు. మైదానంలో తప్పులు చేస్తే మాత్రం అరిచేవాడు. తనని కూడా ఎన్నో సార్లు తిట్టాడని అన్నారు. ఒకటి రెండు సార్లు అయితే ధోనీని చూసి భయపడినట్లుగా తెలిపాడు. ఫీల్డర్ వేసిన త్రో ధోనీ గ్లోవ్స్ వరకు వెళ్లకుంటే ధోనీకి చాలా కోపం వస్తుందని, చెయ్యికి ఇవ్వచ్చుగా అంటూ కొప్పడతాడని అన్నారు. 2013 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో తాను చేసిన ఒక మిస్టేక్ వల్ల ధోనీకి చాలా కోపం వచ్చింది.
ఇంగ్లండ్‌తో మ్యాచ్ లో క్రీజులో ఉన్న రవి బోపారా క్యాచ్ మిస్ చేయడం వల్ల ధోనీకి విపరీతమైన కోపం రావడంతో, ఫీల్డింగ్ చేయలేకపోతే అక్కడ నుండి వెళ్ళమని అరిచాడు. దాంతో తాను నిశబ్దంగా వెళ్లిపోయానని, తనను మాత్రమే కాకుండా కోహ్లీని కూడా ధోనీ చాలా సార్లు తిట్టాడు. ఆ తరువాత తమ్ముడిలా భావించి చెప్పానని అనేవాడు. ఎందుకిలా తిడతావని ధోనీ అడిగినపుడు, నువ్వంటే నాకు అంత ఇష్టం అని సమాధానం చెప్పేవాడు’ అని ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఆ వీడియోలో ధోనీ ఫ్లైట్‌లో కూర్చొని ట్యాబ్‌లో గేమ్ ఆడుతుంటే, ఒక ఎయిర్ హోస్టెస్ ధోనికి చాక్లెట్‌ని ఇచ్చింది. ధోనీ ఆమెను పలకరించి, మాట్లాడుతూ ఆ చాక్లెట్స్ తీసుకుంటాడు. ఇక ఆ సమయంలో ధోనీ ట్యాబ్‌లో ఆడుతున్న గేమ్ క్యాండీ క్రష్ అనేది వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది.
ధోనీ క్యాండీ క్రష్ ఆడటంతో ధోనీ ఫ్యాన్స్ తో సహా క్రీడాభిమానులలో ఇంట్రెస్ట్ ను కలిగించింది. ట్విట్టర్లో #Candycrush ను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ వీడియో పై నెటిజన్లు, ధోని ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘క్యాండీక్రష్ డౌన్లోడ్ ఇప్పుడు చేయాలనిపిస్తుంది’ అని ఒకరు, ‘ధోని దెబ్బతో క్యాండీక్రష్ డౌన్లోడ్స్ పెరుగుతాయి’ అని మరొకరు, ‘ధోని క్యాండిక్రష్‌లో ఏ లెవెల్లో ఉన్నాడో’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోతో కొన్ని గంటల్లోనే క్యాండీ క్రష్ గేమ్ డౌన్లోడ్స్ బాగా పెరిగాయి.
స్వయంగా క్యాండీ క్రష్ ఈ విషయాన్ని తమ అఫిషియల్ పేజీలో వెల్లడించింది. క్యాండీ క్రష్ మేనేజ్మెంట్ తమ గేమ్ ఆడుతున్నందుకు కృతజ్ఞతలు చెప్పింది. అనంతరం 3 గంటల్లో 30 లక్షలకు పైగా క్యాండీ క్రష్ గేమ్ ను డౌన్లోడ్ చేసుకున్నట్లుగా తెలిపింది. మహేంద్ర సింగ్ ధోనీ గేమ్ ఆడుతూ ఇలా కనిపించడం మొదటిసారి కాదు. గ్రౌండ్ లో క్రికెట్ ఆడే ధోనీ, మైదానం బయట ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడుతూ కనిపిస్తాడు. ధోనీ పబ్జీ, ఫిఫా, కాల్ ఆఫ్ డ్యూటీ ఎక్కువగా ఆడుతూ ఎంజాయ్ చేస్తాడు.
మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సీఎస్కే కెప్టెన్ గా ధోని ఇప్పటి దాకా సీఎస్కేను ఐదుసార్లు విజేతగా నిలిపాడు. ధోని భారత జట్టు ఫినిషర్‌గా ఎన్నో మరుపురాని విజయాలు అందించారు. ధోని కెరీర్లో అంతర్జాతీయంగా 90 టెస్ట్ మ్యాచులు, 350 వన్డే మ్యాచులు, 98 టీ20 మ్యాచులు ఆడాడు. ఇక టెస్టుల్లో 4876 పరుగులు, వన్డేల్లో 10773 పరుగులు, టీ20ల్లో 1617 పరుగులు చేశాడు. 2020లో ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టర్ కూల్, ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.
అయితే ఆ ప్రొడక్షన్ హౌజ్ కు సీఈఓ బాధ్యతను ధోనీ తన అత్తగారికి అప్పగించారు. ఆమె ధోనీ భార్య సాక్షి సింగ్ తల్లి షీలా సింగ్. తన నిర్మాణ సంస్థలో ఫ్యామిలీ మెంబర్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కోసం భార్య సాక్షి సింగ్, అత్తగారు షీలా సింగ్‌కు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించాడని తెలుస్తోంది. ఇక ఈ సంస్థ విలువ సుమారు 800 కోట్లని అంచనా వేస్తున్నారు. ఈ సంస్థలో సాక్షి సింగ్ అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్ సంవత్సర కాలంగా జట్టు బజ్‌బాల్ క్రికెట్‌తో మంచి ఫలితాలను సాధించింది. ఇంగ్లండ్ జట్టు బెన్‌స్టోక్స్ సారధ్యంలో కొత్తగా కనిపించింది. ఈ జట్టు బజ్‌బాల్ తో సౌతాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి సిరీస్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం జరుగుతున్నది సిరీస్ ప్రతిష్టాత్మక యాషెస్, రీసెంట్ గా ప్రపంచ టెస్టు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను బజ్‌బాల్ టెక్నిక్ తో ఎదుర్కొని మొదటి మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలవలేకపోయింది.
‘బజ్‌బాల్’ అంటే..
పేరు ఎలా వచ్చిందంటే..
ఇక ఈ ఆలోచన కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌ది అందువల్ల ఈ విధానానికి ‘బజ్‌బాల్’ పేరు వచ్చిందనుకోవచ్చు. అయితే పాపులర్ క్రికెట్ పోర్టల్ జర్నలిస్టు తొలిసారిగా ఈ పేరును వాడాడు. ఆ తర్వాత ఇది అలాగే పాపులర్ అయ్యిందని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టును నడిపించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు. ప్రధానంగా అశ్విన్ విషయంలో మిస్టేక్ చేశాడు. భారత జట్టు ద్వైపాక్షిక ఈవెంట్స్ లో గెలిచినప్పటికీ, ఐసీసీ ట్రోఫీ విషయంలో మాత్రం విజయం సాధించలేకపోతుంది. చెప్పాలంటే ధోని వంటి కెప్టెన్ భారత జట్టు మళ్లీ దొరకలేదని చెప్పవచ్చు. ఇక ఈ నెలలో జరిగిన డబ్య్లూటీసీ ఫైనల్లో భారత జట్టు ఓటమి కెప్టెన్ గా రోహిత్ శర్మ భవితవ్యం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.




ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ, సెలెక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారని, ఆ సభ్యులతో పాటు జట్టు కెప్టెన్ ఉంటాడు. అందులో ఒక్కరి నిర్ణయాన్ని అందరు ఎలా ఒప్పుకుంటారు? అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఎవరో ఒక్కరు మాత్రమే నిర్ణయం తీసుకుంటే, కమిటీలో ఐదుగురు సెలెక్టర్లు ఎందుకు? అని ప్రశ్నించాడు. సెలెక్షన్ కమిటీ ఒప్పుకోకుండా ఏ డీసీషన్ తీసుకోలేమని చెప్పారు. నేను ఏదైనా చెప్పవచ్చు. కానీ మిగతా సభ్యులు దాన్ని అంగీకరించాలి. సెలెక్షన్ కమిటీలో ఎవరో ఒక్కరి డీసీషన్ నిలవదని వెల్లడించాడు.
రాయుడును సెలెక్ట్ చేయకపోవడం అనేది కమిటీ మొత్తం కలిసి తీసుకున్న డీసీషన్ అని చెప్పాడు. ఇక ఆంధ్రా జట్టుకు ఆడే టైమ్ లో రాయుడితో ఉన్న విభేదాల గురించి ఎమ్మెస్కే ప్రస్తావించాడు. ఒక జట్టులో చాలా రోజులు ఆడినప్పుడు ప్లేయర్స్ మద్య చిన్న చిన్న విబేధాలు సాధారణంగా జరుగుతుంటాయి. అన్నదమ్ముల మధ్యలో సైతం అభిప్రాయభేదాలు వస్తాయి. టీంఇండియాకు సెలెక్ట్ చేయడం లాంటి పెద్ద విషయంలో చిన్న చిన్న గొడవలను పట్టించుకోవాల్సింది ఏముంటుందని అన్నాడు.
అలాగే వరల్డ్ కప్ ముందు జరిగిన మ్యాచ్ లలో రాయుడిని ఎంపిక చేసిన సంగతిని గుర్తు చేశాడు. వరల్డ్ కప్ ముందు ఆడిన మ్యాచ్ లన్నింటికి రాయుడిని సెలెక్ట్ చేశాం. అప్పుడు లేని సమస్య, వరల్డ్ కప్ ఎంపికలో ఏముంటుందని అన్నారు. ఎంపిక ప్రక్రియ కమిటీ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం. వరల్డ్ కప్ సెలెక్షన్ లో తనపై వచ్చిన ఆరోపణల గురించి క్లారిటీ ఇవ్వడానికే వచ్చానని ఎమ్మెస్కే ప్రసాద్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

