Ads
క్రికెట్‌లో ‘సర్’అనే బిరుదు గురించి వింటుంటాం. క్రికెట్ లో రాణించిన కొంతమంది దిగ్గజ క్రికెటర్లను వారి పేరుకు ముందు ‘సర్’ అని చేర్చి పిలిచేవారు. సర్ డాన్ బ్రాడ్‌మన్, సర్ వివ్ రిచర్డ్స్,సర్ గార్ఫీల్డ్ సోబర్స్ లాంటి లెజెండరీ క్రికెటర్ల పేర్లకి ముందు సర్ బిరుదు కనిపిస్తుంది.
Video Advertisement
సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వసీం అక్రమ్, ముత్తయ్య మురళీధరన్ లాంటి లెజెండరీ క్రికెటర్లకు ‘సర్’ బిరుదు ఇవ్వలేదు. మరి ఆ బిరుదు ఎవరికి ఇస్తారు? సర్ బిరుదు వెనుక కథ ఏమిటి? ఎందుకు కొంతమంది క్రికెటర్లకి మాత్రమే ఆ బిరుదు ఇచ్చారు అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం..
క్రికెట్ పుట్టిన ఇంగ్లండ్‌లో ‘సర్’ బిరుదును స్థాపించారు. ఇంగ్లండ్ రాణి వారి రాజ్యంలో ఉండేవారిలో దేశానికి లేదా రాజ్యానికి సేవ చేసినందుకు గానూ ఈ బిరుదును ప్రధానం చేస్తారు. దీనిని నైట్‌హుడ్ అంటారు. కళలు, క్రీడలు, ప్రజాసేవలో దేశానికి చేసిన సేవకు గానూ బ్రిటిష్ రాణి ఈ గౌరవాన్ని ప్రధానం చేస్తుంది. అలా బ్రిటీష్ రాణి దేశానికి సేవ చేసిన కొందరికి ఈ నైట్‌హుడ్‌ను ప్రదానం చేసింది. అప్పటి నుండి వారి పేరు ముందు “సర్” అనే బిరుదుతో పిలుస్తారు. ఇక సర్ అనే బిరుదు కొందరికి మాత్రమే దక్కింది.
1926 నుండి బ్రిటిష్ పాలనలో నివసిస్తున్న కొందరు క్రికెటర్లకు సర్ బిరుదును ఇచ్చారు. ఆ సమయంలో అనేక దేశాలు బ్రిటిష్ పాలనలో ఉండేవి. ప్రస్తుతం ఉన్న కామన్వెల్త్ దేశాలన్నీ ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉండేవి. అందువల్ల ఇంగ్లండ్ దేశ సంప్రదాయం అయినా సర్ బిరుదు వేరే దేశాల క్రికెటర్లకు కూడా ప్రధానం చేశారు. ఈ బిరుదు ఇవ్వడానికి ప్రత్యేకంగా ప్రమాణాలు ఏమి లేవు. అప్పుడున్న అత్యుత్తమ క్రికెటర్లలో కొందరిని సెలెక్ట్ చేసి, వారికి అధికారికంగా సర్ బిరుదును ఇచ్చారు.
1926 నుండి 29 మంది క్రికెటర్లకు సర్ బిరుదు ప్రదానం చేశారు. అయితే 29 మంది క్రికెటర్లలో పద్నాలుగు మంది ఇంగ్లండ్ క్రికెటర్లు, పదమూడు మంది వెస్టిండీస్ క్రికెటర్లు. ఒకరు ఆస్ట్రేలియా క్రికెటర్, మరొకరు న్యూజిలాండ్ క్రికెటర్. అయితే వీరిలో 27 మంది క్రికెటర్లకు సర్ బిరుదు ఉండగా, ఇద్దరికి ‘ది లార్డ్’ అనే బిరుదును ఇచ్చారు.
ఇక లెజెండరీ క్రికెటర్లందరికీ ఎందుకు ఇవ్వలేదు అంటే 1926 నుండి బ్రిటిష్ పాలనలో ఉన్న కొన్ని దేశాల క్రికెటర్లకు మాత్రమే ఆ బిరుదును ఇచ్చారు. ఆ కాలంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లు బ్రిటిష్ పాలనలో ఉండేవి. అందువల్ల ఆ దేశ క్రికెటర్లకు ఇచ్చారు. అయితే కాలక్రమేణా, ఆ దేశాలకు స్వాతంత్రం రావడంతో కొన్ని దేశాలు ఈ బిరుదును ఇవ్వడం ఆపేశారు. కొన్ని దేశాలు మరొక బిరుదుతో దానిని భర్తీ చేశాయి. దాంతో ఇంగ్లండ్, వెస్టిండీస్ మాత్రమే తమ లెజెండరీ క్రికెటర్లకు సర్ బిరుదును ఇస్తున్నాయి.
ఇక ఇండియా విషయానికి వచ్చినట్లయితే 1947 కి ముందు, ఇండియాలో చెప్పుకోదగిన క్రికెటర్లు అప్పటికి తయారు కాలేదు. దాంతో ఇంగ్లండ్ ఏ భారత క్రికెటర్లుకు ‘సర్’ బిరుదును ఇవ్వలేదు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రికెట్‌లో సర్ బిరుదును ఇవ్వడానికి భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారంగా అనుమతి లేదు. ఆ స్థానంలో లెజెండరీ క్రికెటర్లను పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న లాంటి బిరుదులను ఇస్తున్నారు.బదులుగా, భారతదేశంలోని గొప్ప వ్యక్తులు ఇప్పుడు పద్మశ్రీ, పద్మవిభూషణ్ మరియు భారతరత్న వంటి ఇతర బిరుదులతో గౌరవించారు. సచిన్ టెండూల్కర్ ఇండియాలో జన్మించాడు, కాబట్టి అతని పేరుకు ముందు భారతరత్న సచిన్ టెండూల్కర్. ఇంగ్లండ్‌లో దేశంలో జన్మించి ఉంటే సర్ సచిన్ టెండూల్కర్ అని పిలిచేవారు. ఏ దేశంలో అయినా క్రికెటర్ రిటైర్ అయిన కొన్నేళ్ల తర్వాతనే గౌరవాలు పొందుతారు.
జడేజా విషయానికి వస్తే 2009 T20 ప్రపంచకప్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు. దాంతో క్రికెట్ ఫ్యాన్స్ అప్పట్లో ‘సర్ జడేజా’ అని ట్రోల్ చేశారు. అలా సర్ జడేజా పేరు పాపులర్ అయ్యింది. ఆ తరువాత దేశవాళీ క్రికెట్‌లో 2 ట్రిపుల్ సెంచరీలు చేసి జడేజా మళ్ళీ భరత్ జట్టులోకి వచ్చాడు. ఆ తరువాత జరిగిన మ్యాచ్ లలో రాణించాడు. దాంతో నెగెటివ్ సర్ కాస్తా పాజిటివ్ సర్ గా మారింది. కానీ ఇది జడేజాకు ఫ్యాన్స్ ఇచ్చింది. అధికారికంగా వచ్చినది కాదు. ఈ పేరు పాపులర్ కావడానికి మరో కారణం ధోని. అతను ఎప్పుడు ట్వీట్ చేసిన “సర్ రవీంద్ర జడేజా” అని ఉపయోగించేవాడు.
When you give Sir Ravindra Jadeja one ball to get 2 runs he will win it with one ball to spare !!
— Mahendra Singh Dhoni (@msdhoni) April 13, 2013
ఇక శార్దూల్ ఠాకూర్ పేరుకు ముందుండే ది లార్డ్ గురించి చెప్పాలంటే, ఇంగ్లండ్ తో ఆడిన సిరీస్‌లో శార్దూల్ ప్రదర్శనకు గానూ అతని ఫ్యాన్స్ శార్దూల్ కి ‘ది లార్డ్ శార్దూల్’ అనే బిరుదును ఇచ్చారు. ఆ విధంగా అతను ది లార్డ్ గా పాపులర్ అయ్యాడు. అధికారికంగా అతనికి ఆ బిరుదు రాలేదు.
Shardul Thakur (in Press) said "I have only two nicknames, Lord is just a meme started in social media but I am pretty happy that I am getting lots of love from the teammates & fans across the world".
— Johns. (@CricCrazyJohns) September 3, 2021
End of Article