సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కి సొంతగడ్డ పై కూడా అదృష్టం కలిసిరాలేదు. 145 పరుగుల తక్కువ లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఏడు పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేతిలో ఓడిపోయింది.

Video Advertisement

ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకి ఇది వరుసగా ౩వ ఓటమి. ఐదు వరుస ఓటముల తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ అందుకున్న విజయమిది. వరుసగా 2 విజయాలతో ఢిల్లీ జట్టు మళ్లీ పుంజుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసింది.
ఆ తరువాత లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ జాట్ట్టు 6 వికెట్ల నష్టానికి 137 రన్స్ మాత్రమే చేసి, అపజయం పాలైంది. హైదరాబాద్ జట్టులో మయాంక్ అగర్వాల్ 49 రన్స్ చేశాడు. ఆఖరి బంతి వరకు రెండు జట్ల మధ్య హోరాహోరీగా ఆట కొనసాగింది. ఆఖరి ఓవర్లో హైదరాబాద్ జట్టు గెలుపు కోసం 6 బాల్స్ 13 రన్స్ చేయాల్సి ఉంది. సుందర్ దూకుడుగా ఆడినప్పటికీ ముఖేష్ కుమార్ ఆఖరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ జట్టు ఓటమి తప్పలేదు. సుందర్ 15 బాల్స్ లో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్ మయాంక్ 49, హారీ బ్రూక్ 7, రాహుల్ త్రిపాఠి 15, అభిషేక్ శర్మ 5, ఆడెన్ మార్‌క్రమ్ త్రీ,హెన్రిచ్ క్లాసెన్ 19 బంతుల్లో 31, వాషింగ్టన్ సుందర్ 24 నాటౌట్ కాగా, మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో మనీశ్ పాండే 27 బంతుల్లో 34 , అక్షర్ పటేల్ 34 బంతుల్లో 34,  ఓపెనర్ సాల్ట్ 0, మిచెల్ మార్ష్ 15 బంతుల్లో 25, డేవిడ్ వార్నర్ 20 బంతుల్లో 21, సర్ఫరాజ్ ఖాన్ 10, అమన్ హసీమ్ ఖాన్ 4 చేసారు.
1.
2. 3. 4. 5. 6. 7. 8.
9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18.
Also Read: “ఇంక కప్ రెడీ చేసి పెట్టుకోండి..!” అంటూ… CSK VS KKR మ్యాచ్‌లో “చెన్నై” గెలవడంపై 15 మీమ్స్..!