ఐపీఎల్ 2022 లో మరొక కరోనా కేసు నమోదు అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరొక ప్లేయర్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఇవాళ ఈ విషయానికి సంబంధించి చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. బుధవారం రోజు పంజాబ్ కింగ్స్ తో జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడుతుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బయలుదేరి వెళ్లాల్సి ఉంది.
కానీ టీంలో ఒక ప్లేయర్ కి కరోనా అని తేలింది. అంతకుముందు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో పాట్రిక్ పర్హాత్కి కరోనా పాజిటివ్ అని తేలడంతో అతనిని క్వారంటైన్ లో ఉంచారు. ఈ విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం నుండి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇది నిజం అని తెలిసింది.
ఇప్పుడు మరొక ప్లేయర్ కి కరోనా అని తేలింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా పాజిటివ్ అని తేలిన ప్లేయర్ పేరు ఇంకా బయటికి రాలేదు. గత శనివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మ్యాచ్ ఆడింది. ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ జట్టు సభ్యుల్లో కూడా ఆందోళన నెలకొంది. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10