జట్టు మారినా.. ఆ ఆటతీరు మాత్రం అంతే.. తీసిపారేయండి అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్స్.. ఇన్నేళ్ళుగా ఆడుతున్నా..?

జట్టు మారినా.. ఆ ఆటతీరు మాత్రం అంతే.. తీసిపారేయండి అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్స్.. ఇన్నేళ్ళుగా ఆడుతున్నా..?

by Sunku Sravan

Ads

ఐపీఎల్ మ్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న న్యూస్. నెటిజన్లు ఏ ప్లేయర్ ని కూడా విడిచి పెట్టడం లేదు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్న విజయ్ శంకర్ ను విపరీతంగా కామెంట్ తో ముంచెత్తుతున్నారు. చెత్త ఫామ్ ను కొనసాగిస్తున్నవంటూ ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

Video Advertisement

తాజాగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో విజయ్ శంకర్ చాలా నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. రెండు పరుగులు చేసిన విజయ్, కుల్దీప్ సేన్ బౌలింగులో ఆఫ్ స్టాంట్ కు దూరంగా వెళుతున్న టువంటి బంతిని అనవసరంగా గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్న ఆయన బలహీనతలు మాత్రం వదిలి పెట్టడం లేదు.

అదే ఆట తో అభిమానులను విసిగిస్తున్నాడు. గత సీజన్ వరకు ఎస్ఆర్ హెచ్ జట్టుకు ఆడిన విజయ్ ఆ టీంకి ఒరగబెట్టింది అయితే ఏమి లేదు. గత ఫిబ్రవరిలో జరిగినటువంటి మెగా వేలంలో విజయ్ శంకర్ ను గుజరాత్ ఒక కోటి 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినది. ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్లను ఆడినటువంటి విజయ్ శంకర్ 4,13 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్ లో కూడా రాణించలేకపోయారు.

తాజాగా ఒక అవకాశం ఇచ్చినప్పటికీ అందులో కూడా విఫలమయ్యాడు. దీంతో నెటిజన్లు అంతా విజయ్ ని ట్రోల్ చేస్తూ ఒక ఆట ఆడేసుకుంటున్నారు. నువ్వు మారవు నీ ఆట తీరు మారదు.. విఫలమవుతున్న క్రికెటర్ కు మళ్లీ మళ్లీ అవకాశం ఎందుకు ఇస్తున్నారు అంటూ.. తీసిపారేయకండి అంటూ కామెంట్లతో అదరగొడుతున్నారు.


End of Article

You may also like