చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచే మ్యాచ్ ను గుజరాత్ టైటాన్స్ కు అప్పగించింది. ఐదో మ్యాచ్ ఒక్కటి గెలిచి అభిమానులకు కొంత ఊరట కలిగించిన తలైవాస్ ఆరో మ్యాచ్ లో మళ్ళీ ఓటమిపాలైంది. గుజరాత్ ఇన్నింగ్ ప్రారంభమయ్యాక విజయం సిఎస్ కే దే అని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ ఇద్దరూ కలిసి చెన్నై ఆశలకు గండి కొట్టారు. స్వయంకృతాపరాధాల వల్లే చేజేతులా చెన్నై మ్యాచ్ ను కోల్పోవాల్సి వచ్చిందని అభిమానులు నిరాశకు లోనయ్యారు.

Video Advertisement

ఐపీఎల్ సీజన్ 15 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పెద్దగా కలిసి రావడం లేదని చెప్పుకోవచ్చు. టోర్నీ ప్రారంభానికి ముందే ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం.. ఆ తర్వాత ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ సిఎస్ కే ఘోరంగా విఫలమైంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడితే ఒక ఐదో మ్యాచ్ మినహా అన్నింటిలోనూ చెన్నై చేతులెత్తేసింది.

csk trolls

ఇక ఈ ఏడాది కొత్త ఎంట్రీ గుజరాత్ టైటాన్స్ మాత్రం డిఫెండింగ్ చాంపియన్స్ ను ఢీ కొట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఎంసీఏ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై నిర్ధేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలోనే గుజరాత్ చేధించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 73/48(5 సిక్స్ లు, 5 ఫోర్లు) పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమించాడు. గైక్వాడ్ కు తోడుగా రాయుడు 46/31, శివమ్ దూబే 19/17, జడేజా 22/12 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఇక బౌలింగ్ విభాగంలో చెన్నై బౌలర్లు తొలుత విజృంభించారు. కేవలం 48 పరుగుల వద్ద గుజరాత్ నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. అయితే బ్రావో 3/23, తీక్షణ 2/24 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేసినా క్రిస్ జోర్డాన్ ఒకే ఓవర్లో 20 పరుగులు ఇచ్చి మ్యాచ్ ను గుజరాత్ చేతుల్లో పెట్టాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిన్నటి మ్యాచ్ లో గాయం కారణంగా దూరం అవ్వగా.. మ్యాచ్ ప్రారంభంలో టాపార్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే మిడిలార్డర్ డేవిడ్ మిల్లర్ 94/51(6 సిక్స్ లు,8 ఫోర్ల)తో ఒంటరి పోరాటం చేశాడు.ఆ తర్వాత రషీద్ ఖాన్40/21 జోర్డాన్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్స్ లు, రెండు ఫోర్లు కొట్టి మ్యాచ్ ను తిప్పేశాడు. అప్పటివరకు చెన్నై దే విజయం అని అంతా భావించారు. కానీ రషీద్ దెబ్బకు ఫలితం గుజరాత్ కు అనుకూలంగా మారిపోయింది. రషీద్ అవుటయ్యాక కూడా మిల్లర్ చివరి వరకు పోరాడి ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20

#21