తాజాగా భారత్ రెస్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అతనికి పోటీగా కామన్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన అనిత షియోరాన్ ఓటమి పాలయ్యారు.
టాప్ రెజలర్లు అందరూ ఆమెకే మద్దతు ప్రకటించినప్పటికీ ఓటమి పాలవడం విశేషం. మొత్తం 47 ఓట్లతో గాను సంజయ్ సింగ్ కి 40 ఓట్లు పోలు అయ్యాయి.
తమని వేధించాడని మహిళా రెజలర్లు ఆరోపణలు చేసిన బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడే అధ్యక్షుడుగా ఎన్నికవ్వడం వారిని కలచివేస్తుంది. ఈ విషయం పైన భారత్ రెజలర్ సాక్షి మాలిక్ స్పందించారు. తాను రెజ్లింగ్ క్రీడను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. తమని వేధించిన బ్రిజ్ భూషణ్ సింగ్ కి వ్యతిరేకంగా 40 రోజులు పాటు రోడ్డు మీద పోరాటం చేశామని, తమకి మద్దతుగా దేశమంతా ముందుకు వచ్చిందని అలాంటి వ్యక్తికి చెందినవారు ఎన్నికల్లో గెలుపొందడం తమని మానసికంగా కలచివేస్తుంది అని చెప్పుకొచ్చారు.
తాము మద్దతు ఇచ్చిన వ్యక్తి ఓడిపోవడంతో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా సమావేశం నుండి కన్నీటి పర్యంతమై వెళ్ళిపోయారు.ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ మహిళ రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.దీనిపై రెజ్లర్లు అందరూ రోడ్ల మీదకు వచ్చి నిరసన చేసినది దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.