రైతు బిడ్డని అభినందించిన మాజీ మంత్రి… ఏమన్నారంటే….!

రైతు బిడ్డని అభినందించిన మాజీ మంత్రి… ఏమన్నారంటే….!

by Mounika Singaluri

తెలుగులో మంచి క్రేజ్ ఉన్న రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్. ఈ సీజన్7 లో రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి అందరూ అతని టార్గెట్ చేస్తూనే గేమ్ ఆడారు. అయితే ఆ సింపతీ బాగా వర్కౌట్ అయి ఆడియన్స్ అందరూ అతనికి సపోర్ట్ గా నిలబడ్డారు. ఎలిమినేషన్ కి వచ్చిన ప్రతిసారి పల్లవి ప్రశాంత్ సేవ్ అయ్యాడు.

Video Advertisement

అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ 7 టైటిల్ విన్నారుగా పల్లవి ప్రశాంత్ సెన్సేషన్ సృష్టించాడు. టైటిల్ విన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అతనికి ఫాన్స్ భారీ ఎత్తున వచ్చి స్వాగతం పలికారు. అయితే బిగ్ బాస్ లో ప్రశాంతను టార్గెట్ చేసిన మిగతా ఆటగాళ్లను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ టార్గెట్ చేసి వాళ్ళ కార్ అద్దాలు ధ్వంసం చేశారు.

ఇది ఇలా ఉంటే టైటిల్ విన్ అయినందుకు పల్లవి ప్రశాంత్ ను మాజీ మంత్రి హరీష్ రావు అభినందనలతో ముంచెత్తారు. మా సిద్దిపేట రైతుబిడ్డ బిగ్ బాస్ టైటిల్ విన్ అయినందుకు శుభాకాంక్షలు అని పోస్ట్ పెట్టారు. రైతు నుండి బిగ్ బాస్ వరకు అతని ప్రయాణం చాలామంది హృదయాలను గెలుచుకుంది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.


You may also like

Leave a Comment