బ్యాట్ కొనుక్కోవడానికి కూడా స్థోమత లేదు… ఇప్పుడు ఐపీఎల్ లో 5.8 కోట్లు..! ఈ ప్లేయర్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా..?

బ్యాట్ కొనుక్కోవడానికి కూడా స్థోమత లేదు… ఇప్పుడు ఐపీఎల్ లో 5.8 కోట్లు..! ఈ ప్లేయర్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా..?

by kavitha

Ads

దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఆటగాళ్ల కొనుగోళ్లలో పాత రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఫ్రాంచైజీలు తాము కావాలనుకున్న ప్లేయర్ ను దక్కించుకోవడం కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి.

Video Advertisement

ఈ వేలంలో ఆసీస్ పేసర్ స్టార్క్ ఆల్‌టైమ్ ధర పొందిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. మరో ఆసీస్ ప్లేయర్ కమిన్స్ రూ. 20.50 కోట్లుకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అయితే అంతగా తెలియని, కొందరు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు సైతం కోట్లు కొల్లగొట్టారు. వారిలో శుభమ్ దూబే ఒకరు. అతని గురించి ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ వేలం ఎప్పడూ సంచలనాలకు కేరాఫ్ గా నిలుస్తుందన్న విషయం తెలిసిందే. ప్రతి వేలంలోనూ గత రికార్డులు బ్రేక్ చేస్తూ వచ్చింది. అలాగే ఈసారి కూడా గత వేలం రికార్డులను బద్దలు కొట్టింది.  గత వేలం అత్యధిక ధర రికార్డును ఈసారి ఇద్దరు ఆసీస్ ప్లేయర్లు బ్రేక్ చేశారు. కోల్‌కతా రూ. 24.75 కోట్లకు మిచెల్ స్టార్క్‌ను  సొంతం చేసుకోగా, సన్‌రైజర్స్ రూ. 20.50 కోట్లకు కమిన్స్‌ను సొంతం చేసుకుంది. ఎప్పటిలానే ఈసారి కూడా అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ను ఫ్రాంఛైజీలు కోట్లు పోసి సొంతం చేసుకున్నాయి.వారిలో ఒకరు శుభమ్ దూబే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శుభమ్ దూబేను రాజస్థాన్ రాయల్స్ రూ.5.8 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో రాత్రికి రాత్రే దూబే కోటీశ్వరుడిగా మారాడు. దూబే విదర్భ జట్టు తరుపున ఆడతాడు. లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన దూబే పవర్‌ఫుల్ లెఫ్టాండర్ మరియు మంచి ఫినిషర్. రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తాక్ టోర్నీలో అద్భుతంగా ఆడిన శుభమ్ దూబే పేరు మారుమ్రోగింది. దాంతో ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు దూబే కోసం పోటీ పడ్డాయి. ఫైనల్ గా రాజస్థాన్ రాయల్స్ రూ. 5.80 కోట్లకు దక్కించుకుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ ఆఫ్ హై పెర్ఫామెన్స్ జుబిన్ భరూచా శుభమ్ దూబే గురించి మాట్లాడుతూ, విదర్భ నుంచి వచ్చిన దూబే లైఫ్ లో ఉన్న కష్టాలు, క్రికెటర్ యశస్వి జైశ్వాల్‌కు వంటివే అని అన్నారు. శుభమ్ దూబే వద్ద ఈ ఏడాది కనీసం బ్యాట్ కొనడానికి కూడా డబ్బు లేదని చెప్పినట్లుగా వెల్లడించాడు. వేలంలో అతడిని కొనడానికి ప్రయత్నిస్తామని వెల్లడించారు. భరూచా, చెప్పినట్లుగానే రాజస్థాన్ రాయల్స్ దూబేను కొనుగోలు చేసింది.

Also Read: డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్ తో SRH టీం ప్రవర్తించే విధానం ఇదేనా..? అసలు విషయం ఏంటంటే..?


End of Article

You may also like