గతంలో రూ.11 కోట్లు.. ఈసారి రూ.50 లక్షలు..! ఐపీఎల్ సెంచరీ చేసిన తొలి ఇండియన్..!

గతంలో రూ.11 కోట్లు.. ఈసారి రూ.50 లక్షలు..! ఐపీఎల్ సెంచరీ చేసిన తొలి ఇండియన్..!

by kavitha

Ads

మనీష్ పాండే, ఈ పేరు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు సుపరిచితం. మనీష్‌ దేశి క్రికెట్ కన్నా ఐపీఎల్ లో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ 2014 ఫైనల్స్‌లో కోల్‌కతా జట్టు తరుపున, పంజాబ్‌ కింగ్స్ పై 94 పరుగుల మ్యాచ్-విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Video Advertisement

తాజాగా జరిగిన ఐపీఎల్ మినివేలంలో ఆరు ఏళ్ళ  తర్వాత మనీష్‌ పాండే మళ్ళీ కోల్‌కతా జట్టులో చేరాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో పాండేను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఇప్పటివరకు జరిగిన సీజన్లలో కోట్లలో పలికిన పాండే ఈసారి కనీస ధర పలకాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గత సీజన్ ఐపీఎల్ వేలంలో కోట్లు పలికిన మనీష్ పాండే ఐపీఎల్ 2024 వేలంలో కనీస ధర యాబై లక్షలకు కోల్‌కతా జట్టు కొనుగోలు చేసింది.  మొదటి  రౌండ్‌లో వేలంలో ఉన్న పాండేను కొనుగోలు చేయడానికి  ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. దాంతో అతను రెండోసారి వేలానికి వచ్చాడు. ఆ వేలంలో కేకేఆర్  పాండేని కనీస ధరకు కొనుగోలు చేసింది.
2008 ఐపీఎల్ ఫస్ట్ సీజన్‌లో మనీష్ పాండేను ముంబై ఇండియన్స్ కనీస ధర ఆరు లక్షలకు సొనటం చేసుకుంది. ఆ  తర్వాత, 2009లో పందెను ఆర్సీబీ రూ. 12 లక్షలు కొనుగోలు చేసింది. ఆ జట్టు తరుపున ఆడుతున్నప్పుడు సెంచరీ చేసి,  ఐపీఎల్ లో సెంచరీ చేసిన మొదటి ఇండియన్ గా నిలిచాడు. ఆ తర్వాత పూణే వారియర్స్  రూ. 20 లక్షలు కొనుగోలు చేయగా, తరువాత, పాండే ఐపీఎల్ 2011, 2012, 2013 సీజన్లకు పూణే జట్టు తరపున ఆడాడు. 2014 లో కేకేఆర్ రూ. 1.70 కోట్లుకు సొంతం చేసుకుంది. ఆ ఏడాది విజేతగా కేకేఆర్ నిలవడంలో పాండే కీలకంగా మారాడు.
కేకేఆర్ పాండేని 2018 సీజన్‌కు ముందు రిలీజ్ చేసింది. దీంతో సన్ రైజర్స్ రూ.11 కోట్ల భారీ రేటుకు పాండేను  కొనుగోలు చేసింది. మూడు సీజన్లలో సన్‌రైజర్స్ తరఫున ఆడినా పాండే అంతగా రాణించలేకపోయాడు. దాంతో అతను ఐపీఎల్-2022 వేలంలోకి వచ్చాడు. అందులో లక్నో జట్టు రూ.4.60 కోట్లకు కొనుగోలు చేసింది. అక్కడ కూడా పెద్దగా రాణించకపోవడంతో, ఐపీఎల్-2023 వేలంలోకి వెళ్ళాడు. అందులో ఢిల్లీ జట్టు రూ.2.40 కోట్లకు సొంతం చేసుకోగా, పాండే ఆ ఛాన్స్ ని ఉపయోగించుకోలేదు. ఈసారి అతన్ని కొనడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. చివరికి  కేకేఆర్ కనీస ధరకు కొనుగోలు చేసింది.

Also Read: హార్దిక్ పాండ్యా కండిషన్ పెట్టే ముంబయి ఇండియన్స్ కు వచ్చాడా? అసలు విషయం ఏంటంటే…?


End of Article

You may also like