ప్రతి సోమవారం ఈ టీవీ లో ప్రసారమౌతూ ప్రేక్షకులను అలరిస్తున్న షో ఆలీతో సరదాగా. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీలు అతిథులుగా వచ్చి, వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చెబుతారు. చాలా మంది సినీ రంగానికి దూరం అయిన వారు ఈ షో కి వచ్చి మళ్లీ ప్రేక్షకులను పలకరించారు.
అంతే కాకుండా నటులు, నిర్మాతలు, దర్శకులు, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా ఎంతో మంది ఈ షో కి వస్తారు. అలా వచ్చే వారం అతిథిగా హీరో మంచు విష్ణు రాబోతున్నారు. గత కొంతకాలంగా మా ఎలక్షన్స్ కారణంగా మంచు విష్ణు వార్తల్లో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఆలీతో సరదాగా షో లో మంచు విష్ణు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఈ షో కి సంబంధించిన ప్రోమోని ఇవాళ విడుదల చేశారు.
ఇందులో అలీ మంచు విష్ణు ని “మోహన్ బాబు గారి కొడుకు అని అంటున్నందుకు గర్వపడుతున్నావా?” అని అడిగితే, “భారతదేశంలో ఉన్న టాప్ 15 నటులలో నాన్న గారు ఒకరు” అని అన్నారు. అలాగే మోహన్ బాబు గారి కొడుకు అనే పేరు తనకి కెరీర్ స్టార్టింగ్ లో మాత్రమే ఉపయోగపడుతుంది అని, తర్వాత తన టాలెంట్ ఉంటేనే ఇంత దూరం వచ్చాను అని చెప్పారు.
ఆ తర్వాత అలీ, “కథ వినంగానే ఇది హిట్ అవుతుంది అని ఎన్ని సినిమాలకి
అనిపించింది?” అని అడిగితే, తను మంచి దర్శకులను ఎంచుకోలేకపోయాను అని,అందుకు కారణం తన ఫూలిష్ నెస్ అని, తాను ఒక సెంటిమెంటల్ ఫూల్ ని అని, అలా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలిగాయని మంచు విష్ణు చెప్పారు. అలాగే “మంచు మనోజ్ తో కూడా తనకి గొడవలు ఉన్నాయి అని వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది?” అని అలీ అడిగితే, “దీనికి నేను అసలు అందరికీ ఎందుకు సమాధానం చెప్పాలి?” అని మంచు విష్ణు అనడం మనం ప్రోమోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
watch video :
To watch the video, please click on “WATCH ON YOUTUBE”



#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15














