యాంకర్ గా ప్రదీప్, టీమ్ లీడర్స్ గా రష్మి – సుడిగాలి సుధీర్, జడ్జెస్ గా ప్రియమణి గారు, పూర్ణ గారు మరియు గణేష్ మాస్టర్ లు వ్యవహరిస్తున్న ఢీ షో గురించి అందరికి తెలిసిందే. దక్షణ భారతదేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో “ఢీ”…. 11 సీజన్స్ ముగించుకొని ఇప్పుడు “ఢీ” ఛాంపియన్స్(“ఢీ” 13వ సీజన్) తో మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది.
ఒకసారి అంతకు ముందు ఒకసారి పూర్ణ ఒక ఫ్యాన్ బుగ్గ కొరకడం వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పుడు ఈ విషయం చాలా రోజుల పాటు చర్చ లో నిలిచింది. “టీవీ షో లో ఇలాంటి పనులన్నీ ఏంటి ?” అని చాలా మంది ప్రశ్నించారు. తర్వాత కొన్ని రోజుల వరకు ఇలాంటి సంఘటనలు జరగలేదు. దాంతో బహుశా టీవీ యాజమాన్యం ప్రేక్షకుల ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటివన్నీ జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఏమో అని అనుకున్నారు.
అయితే ఇటీవల వచ్చిన ప్రోమో లో కూడా డాన్స్ పెర్ఫార్మెన్స్ నచ్చడంతో పూర్ణ వెళ్లి ఆ కంటెస్టెంట్ బుగ్గ కొరికారు. ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటన ఒకటి ఢీ లో జరిగింది. అయితే, ఇలాంటి టీవీ షో సాధారణంగా ఇంట్లో కుటుంబం మొత్తం కూర్చొని చూస్తారు. వాళ్లలో పిల్లలు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రేక్షకులు అడుగుతున్నారు.
కేవలం ఈ ఒక్క ప్రోగ్రాం లో మాత్రమే కాదు. మిగిలిన ప్రోగ్రామ్స్ లో కూడా ఇలాగే అవుతోంది. సినిమాల్లో అంటే సెన్సార్ ఉంది. కానీ ఇలా టీవీ షోస్ కి ఎలాంటి లిమిటేషన్స్ లేవా. ఈ షోలో మాట్లాడే మాటలు కూడా నవ్వుకునేలా ఉండవు. చాలా విషయాలు కేవలం టిఆర్పి ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.
watch video :
To watch the video, please click on “Watch On YouTube”