Ads
నాటింగ్ హామ్ వేదికగా ఇంగ్లాండ్ కి, ఇండియా కి మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ బౌలర్లు దూసుకెళ్లారు. బుధవారం మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ (64: 108 బంతుల్లో 11×4) బ్యాటింగ్ ఎంచుకున్నారు. కానీ ఇన్ని మొదటి ఓవర్ లోనే ఓపెనర్ రోరీ బర్న్స్ (0) వికెట్ పడగొట్టి ఆ జట్టు కి షాక్ ఇచ్చారు జస్‌ప్రీత్ బుమ్రా. తర్వాత వచ్చిన జాక్ క్రావ్లీ (27: 68 బంతుల్లో 4×4), మరో ఓపెనర్ డొమినిక్ సిబ్లీ (18: 70 బంతుల్లో 2×4) ఎక్కువ సేపు క్రీజ్ లో నిలిచినా కూడా జట్టుకు మెరుగైన స్కోర్ అందించలేకపోయారు.
Video Advertisement
తర్వాత వచ్చిన జానీ బెయిర్‌స్టో (29: 71 బంతుల్లో 4×4) చేయగా, జోస్ బట్లర్ (0: 18 బంతుల్లో), లారెన్స్ (0: 4 బంతుల్లో) చేశారు. చివరిలో వచ్చిన శామ్ కరన్ (27 నాటౌట్: 37 బంతుల్లో 4×4, 1×6) , రాబిన్సన్ (0), స్టువర్ట్ బ్రాడ్ (4), జేమ్స్ అండర్సన్ (1) స్కోర్ చేశారు. దాంతో మొదటి ఇన్నింగ్స్ లోఇంగ్లండ్ జట్టు 65.4 ఓవర్లు బ్యాటింగ్ చేయగలిగింది.
ఇంక టీమిండియా విషయానికొస్తే, ఇంగ్లండ్ ఆలౌట్ తర్వాత తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు బుధవారం ఆట ముగిసే సమయానికి 21/0 స్కోర్ తో నిలిచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (9 బ్యాటింగ్: 40 బంతుల్లో 2×4), కేఎల్ రాహుల్ (9 బ్యాటింగ్: 39 బంతుల్లో 1×4) క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా ఇంకా తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
End of Article