శ్రీను వైట్ల, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన కింగ్ సినిమా విడుదల అయ్యి పన్నెండు సంవత్సరాలయింది. ఈ సినిమాలో త్రిష, మమత మోహన్ దాస్ హీరోయిన్లుగా నటించారు. శ్రీహరి గారు ఒక కీలక పాత్ర పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకి ముఖ్య హైలైట్ బ్రహ్మానందం గారు. ఆయన పోషించిన జయసూర్య పాత్రని, ఆ పాత్రలో ఆయన మాట్లాడిన డైలాగ్స్ ని ఇప్పటికీ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా సినిమా పాపులారిటీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది అంటే అందులో పాత్రలు, వాళ్ల ఎక్స్ప్రెషన్స్ ఎంత ఐకానిక్ గా ఉంటాయో మనమే అర్థం చేసుకోవాలి.

సోషల్ మీడియాలో ఏదైనా ఒక మీమ్ పేజ్ చూస్తే అందులో కింగ్ సినిమాకి సంబంధించిన టెంప్లేట్స్ చాలానే కనిపిస్తాయి. అదే ఒక వేళ సోషల్ మీడియాలో ఉన్న మొత్తం తెలుగు మీమ్ పేజెస్ చూస్తే కొన్ని వేలల్లో ఉంటాయేమో. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయిన డైలాగ్స్ రాసింది బి.వి.ఎస్.రవి. కింగ్ సినిమా విడుదలయ్యి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మీమ్స్ కి ఉన్న పాపులారిటీపై వస్తున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20


సినీ ఇండస్ట్రీకి న వచ్చే ప్రతీ అమ్మాయి లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సిందే , నేను కూడా ఎదుర్కొన్నాను అంటూ సంచలనం సృష్టించింది నటి, హిందీ బిగ్‌బాస్-13 మాజీ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్. పెద్ద నిర్మాత సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి తనను అత్యాచారం చేయాలని ప్రయత్నించాడంటూ చెప్పుకొచ్చింది. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు టీవీ కార్యక్రమాలు , సీరియల్స్ ద్వారా అందరికి సుపరిచితమైన నటి రష్మీ దేశాయ్. సల్మాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ 13 లో థర్డ్ రన్నరప్ కూడా. ఆ తర్వాత వెండితెరపై కూడా కనిపించింది. ఇటీవల ఒక ఇంగ్లీష్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించింది.
పదమూడేళ్ల క్రిందట తాను కెరీర్ ప్రారంభించానని, అప్పుడే టీనేజ్ లోకి అడుగుపెట్టానని, నటనపై ఇంట్రస్ట్ తో ఇటువైపొచ్చనని చెప్పింది. అయితే ఆ సమయంలో ఆఫర్స్ ఇప్పిస్తాను అనే వంకతో సూరజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో ఎవరూ పరిచయం లేకపోయేసరికి సూరజ్ నిజంగానే అవకాశాలు ఇప్పిస్తాడని నమ్మాను . కానీ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ రావాలంటే లైంగికంగా లొంగాల్సిందే అని చెప్పేవాడని, అలా చాలా సార్లు తనను లొంగగదీసుకునే ప్రయత్నం చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.
పెద్ద నిర్మాత యశ్ రాజ్‌తో కలిసి పనిచేసే అవకాశం ఇప్పిస్తానని తన నెంబర్ తీసుకున్న సూరజ్. ఓసారి ఫోన్ చేసి ఆడిషన్‌కి రమ్మన్నాడు, తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే ఆ రూమ్‌లో అతనొక్కడే ఉండడంతో డౌటొచ్చింది . దాంతో వెళ్లిపోతానని చెప్తే కూల్ డ్రింక్ తాగడానికి ఇచ్చి, అది తాగాల్సిందిగా బలవంతం చేశాడు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపాడని, దాన్ని తాగించి అత్యాచారం చేయాలనే ప్రయత్నం చేశాడని రశ్మి తెలిపింది.
అక్కడినుండి ఎలాగోలా తప్పించుకుని బయటపడి, ఆ తర్వాత అమ్మతో జరిగినదంతా చెప్పాను . దీంతో అమ్మ సూరజ్ ని పిలిపించి ఇంకోసారి నా బిడ్డ జోలికి వస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చిందని, ఈ పని నేనే చేసి ఉండాల్సిందని అనిపిస్తుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన రశ్మి చేసిన కామెంట్స్ తో మళ్లీ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం వైరలవుతోంది.





















#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
#23
#24
#25
#26
#27
#28
#29









